🌹గుడ్ మార్నింగ్ 🌹నిత్య సత్య సాధన ఆధ్యాత్మికము. నిత్య అవసరాల ప్రయత్నం,పొందటం, అనుభవం జీవితం. నిత్య నిరంతర అవసరాలు ఎలాగైనా, అంటే కుదిరితే మంచిగా లేకపోతే చెడుగానైనా, పక్కవారి కష్ట సుఖాలతో సంబంధం లేకుండా పొందే ప్రయత్నం - స్వార్ధం.
ఇతరులను, నష్టపరచి, కష్టపెట్టి అయినా నా సుఖాలు పొందుతాను - రాక్షసత్వము.
మంచిగా మాత్రమే పొందుతాను, దొరికిన దానితో సర్దుకొని జీవిస్తాను - నిస్వార్ధం.నేను జీవిస్తూ నా చుట్టూ వున్నవారి జీవితాలకు అడ్డు వెళ్లకుండా జీవిస్తాను - మంచితనం.
వీలయితే నా చుట్టూ వున్నవారికి మేలు చేస్తూ జీవిస్తాను - త్యాగము.
నేను నష్టపోయినా మేలే చేస్తాను - దైవత్వం.
ఈ సృష్టిలో సమస్తము నా లాంటివే - ఆత్మ జ్ఞానం.
ప్రస్తుతము మనము ఎక్కడున్నామో గమనించుకొని - అక్కడనుండి మంచి వైపు సాగితే - ఆధ్యాత్మికము. అలాగే సాగుతుంటే - అజ్ఞానము. అంతకంటే దిగజారుతుంటే - జంతుతత్త్వము.నిత్య సత్య సాధనే ఆధ్యాత్మికము. 🌹god bless you 🌹
No comments:
Post a Comment