*✍️ 👏 🤝 👍 బయట వర్షం పడుతోంది, లోపల క్లాస్ జరుగుతోంది, మీ అందరికీ తల వంద రూపాయలు ఇస్తే మీ కోసం మీరు ఏమి కొంటారు అని పిల్లలందరికీ అడిగారు మాస్టారు .. . నేను వీడియో గేమ్‌లు కొంటానని ఒకరు, నేను క్రికెట్ బల్ కొంటాను అనీ మరొకరు ..*
*కొందరు నేనే అందమైన బొమ్మను కొంటాను , చాక్లెట్లు కొంటాము అనీ మరికొందరు అన్నారు. ఒక పిల్లవాడు ఏదో ఆలోచనలో మునిగి వున్నాడు గురువు అతన్ని అడిగాడు, నీవు ఏమి ఆలోచిస్తున్నారు?*
*నీ కోసం ఏమి కొంటావు అనీ ..*
*👉 ఆ పిల్లాడు మాస్టార్ తో సార్ , మా అమ్మకి చూపు సరిగ్గా కనబడదు .. కాబట్టి అమ్మకి కంటి అద్దాలు కొనిస్తాను అన్నాడు. మాస్టర్ అందుకు మీ అమ్మకి మీ నాన్నగారు అద్దాలు కొనగలడు ..నీవు నీకు ఇష్టమైనవి కొనవచ్చు కదా!!*
*👉 అందుకు ఆ చిన్నారి చెప్పిన సమాధానం టీచర్‌ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. మా నాన్న ఇక ఈ లోకంలో లేరని ఆ చిన్నవాడు చెప్పాడు.. మా అమ్మ బట్టలు కుడుతుంది, అలాగే కుట్టు పని నేర్పుతుంది, చూపు తక్కువగా ఉండడం వల్ల బట్టలు సరిగ్గా కుట్టడానికి రావడం లేదు .. అందుకే నేను బాగా చదువుకుని పెద్దవాడిని అయ్యి అమ్మకు సకల సంతోషాలుఇవ్వాలి అనుకున్నాను*
*మాస్టర్ , ఇలా అన్నాడు .. ఆమ్మా కొడుకా, నీ ఆలోచనే నీ సంపాద. నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ 100 రూపాయలు అప్పుగా ఇస్తున్నాను. నీవు బాగా సంపాదించి అమ్మాకు బాగా చూసుకో ఆ 100 రూపాయలు అప్పుడు తిరిగి ఇవ్వు . మరియు నీవు గొప్పవాడు కావాలని నేను కోరుకుంటున్నాను అనీ తలపై నిమురుతూ ఆశీర్వదించారు*
*15 సంవత్సరాల తరువాత, *
*బయట వర్షం పడుతోంది. లోపల తరగతులు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ వాహనం వచ్చి పాఠశాల ముందు ఆగింది. దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్కూల్లో నిశ్శబ్దం. అయితే ఇది ఏమిటి? జిల్లా కలెక్టర్ వృద్ధ ఉపాధ్యాయుడి కాళ్లపై పడి "సార్ నేను దామోదర్ దాస్ అలియాస్ ఝండు.*
*👉 మీ అప్పులో రూ. 100 తిరిగి ఇవ్వడానికి వచ్చాను." పాఠశాల సిబ్బంది మొత్తం ఆశ్చర్యపోయారు. వృద్ధ ఉపాధ్యాయుడు వంగి ఉన్న యువ కలెక్టర్‌ను లేపి గట్టిగా కౌగిలించుకుని ఏడుపు ప్రారంభించాడు.*
*👉 మనం కోరుకుంటే, మన ఆత్మవిశ్వాసం మరియు శ్రమ బలంతో మన విధిని మనమే వ్రాసుకోవచ్చు మరియు మన విధిని ఎలా వ్రాయాలో మనకు తెలియకపోతే, మన విధిని పరిస్థితులే వ్రాస్తాయి.*
*👉 కాకపోతే ఈరోజుల్లో ఇంతగా తమ తల్లిదండ్రులుకోసం యజ్ఞం చేసే నిశ్వార్ధ పిల్లలు ఎంతవరకు వున్నారో అనేదే మిలియన్ డాలార్ల ప్రశ్న🙏💐👍*
No comments:
Post a Comment