🌾 *అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*🌾
*ఎడమ చేతితో తినేతిండికి, నిలబడి తినేతిండికీ రాక్షస శక్తులు వస్తాయి.*
*ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే.*
*అన్నానికి జాతి దోషం,ఆశ్రయ దోషం, నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి.*
*జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము. అవి ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి లాంటివి. వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్జనీయములు.*
*సాత్త్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునే వారు వీటిని వదిలేయాలి.*
*ఆశ్రయ దోషం అంటే పాత్రనుబట్టి దోషము. పాలు శ్రేష్టమైనవి. కాని అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కల్లుతో సమానం. అది పాత్ర దోషం.*
*నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి. మారేడు దళాలు శివునికి ప్రీతి. కాని ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం. అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే. కాకి, పిల్లి, కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనము కూడా దోషమే.*
*మనము బయటనుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో, ఎక్కడనుంచి తెస్తున్నారో తెలీదు. అందుకని భగవంతునికి నివేదించి భోజనం చెయ్యాలి. మన దగ్గరకు రాకమునుపు అవి ఏమైనా, మనదాకా వచ్చాకా జాగ్రత్త అవసరం కనుక భగవంతునికి నివేదించడంవలన ఆ దోషాలు పోతాయి.*
*అందుకే ‘'దోషములేని అన్నము ఇవ్వమ్మా'’ అని వేడుకోవాలి. ‘'ప్రతి రోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం కల్పించు తల్లీ’' అని కోరుకోవాలి.*
*బియ్యాన్ని రామ నామముతో ఏరుకొని ఆ బియ్యంతో వండుకొని తింటే ఇంక దానికి దోషము ఉండదు.*
🙏🌹🌴🪷 🕉️🪔🕉️🪷 🌴🌹🙏 *మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకూ శుభోదయం శుభాకాంక్షలతో*🙏🏻🇮🇳👏
No comments:
Post a Comment