*_నేటి మాట_*
*మానవ జన్మకి సాత్విక మైన గుణములు ఎలా ఆవిర్భవిస్తాయి ??*
"ఆహారమే మనస్సు - జలమే ప్రాణము"
మనము మంట చేసుకుంటాము, ఎట్టి మంటనో అట్టి పొగ తయారౌతుంది,
ఎట్టి పొగనో అట్టి మేఘములు చేరుకుంటాయి,
ఎట్టి మేఘమో అట్టి వర్షము కురుస్తుంది,
ఎట్టి వర్షమో అట్టి పంట పండుతుంది, ఎట్టి పంటను అట్టి బుద్ధి...
ఐతే- ఇక్కడ మంట అంటే ఏమిటి? మనకర్మలే!
దేహము చేసే ప్రతీ పనీ కర్మనే!!
మానవుని శరీర మంతయు కర్మ మయమే!
కనుక, కర్మ మయిన ఈ శరీరమునకు ధర్మ మయిన ఆహారమును వేయాలి.
అనగా ఆహారము పవిత్ర మైనదిగా ఉండాలి.
సాత్విక మైనది గా ఉండాలి, భగవదర్పిత మైనది గా ఉండాలి.
అప్పుడే మానవుని యందు సాత్విక మైన గుణములు ఆవిర్భవిస్తాయి...
*_🥀శుభమస్తు.🥀_*
*🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*
No comments:
Post a Comment