🌹 శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము, ఆచంట...!!🌹
🌸 ఆలయ సమయాలు: ప్రతి రోజు ఉదయం 4 నుండి రాత్రి 8:00 వరకు
🪷ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరిజిల్లా, ఆచంట మండలంలోని గ్రామం. ఇక్కడి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము, బహుళ ప్రసిద్ధిచెందినది. రామేశ్వరస్వామి వారి ఆవిర్భావానికి సంబంధించి ఒక ఆసక్తికర కథనం ఉంది.
🌸దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని, కాశీకి చేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బసచేసెను.
తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిహిత్యము కలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడ ఆ ఇంటినందే సర్వ సుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన, శివపంచాక్షరీ జపములు వినిపించెను.
🌸దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈ సమయమున కాశీలో ఉండవలసినది అని అతడికి జ్ఞాపకమొచ్చెను.
తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.
🌸అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్న ఆ వేశ్య యొక్క కుచాగ్రభాగముపై బడెను. మరుక్షణం అతనికి అదే ఈశ్వరుడై కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను.
అంతట ఆ బ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె కుచభాగమును పూజింప మొదలిడెను. అట్లు ఆ రాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి సొమ్మసిల్లి పడిపోయెను.
🌸అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహా దేవదేవుడు ప్రత్యక్షమయెను. భక్తా! నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను, ఏమి కావలెనో కోరుకొనమనెను. ఆహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు అన్నీ నీ మాయయే కదా స్వామీ..
నాకు మోక్షము ప్రసాదించు, నే పూజించిన రూపమై నీవిక్కడ వెలసిన అదియే మహాభాగ్యము అనెను.
అట్లే నీకును, నీవలన ఈమెకునూ.. ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను. అని అంతర్ధానమయ్యెను.
🌸ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహ ద్వారముల- -తోనూ, ప్రాకారము లోపలి భాగమున అనేక చిన్న దేవాలయములతో
గుడిని ఆనుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.
🌸ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును. చుట్టు ప్రక్కల ఎన్నో గ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడం వలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదు అనేటట్లుగా జనం వస్తూంటారు.
🌸 పేరు వెనుక చరిత్ర
🪷ఒడయనంబి అనే శివభక్తుడు చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్యప్రశస్తి, పౌరాణిక ప్రసిద్ధి పొందిన విషయం. ఆ చంట (ఆ చన్నున) శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంట ఈశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేర పిలుస్తూంటారు.
🌸శృంగవరపుకోట దానశాసనగ్రహీత మాతృశర్మ ఆచంట గ్రామస్తుడని క్రీ.శ.5వ శతాబ్ది నాటి శాసనం తెలుపుతోంది. దీన్ని అనుసరించి అప్పటికే ఆచంట అన్న పేరు వుండేదని కచ్చితంగా తెలుస్తోంది.
🪷శ. పు..1256లో ఆచంట సూర్పరాజుకు అప్పటి ప్రభువు మైలారదేవిని ఇచ్చి వివాహం చేస్తూ, ఆచంటరామేశ్వరునికి పోకతోటలు సమర్పించినట్టు శాసనాలు చెప్తున్నాయి.
🌸 ఉమా రామలింగేశ్వరాలయం, ఆచంట
🪷ఆచంటలోని ఉమా రామలింగేశ్వరాలయం బాగా ప్రాచుర్యం పొందింది. ఆలయంలోని రామలింగేశ్వరుణ్ణి సంబోధిస్తూ మేకా బాపన్న కవి ఆచంట రామేశ్వర శతకం వంటి రచనలు చేశారు.
No comments:
Post a Comment