Saturday, June 29, 2024

             *_నేటి మాట_*

*దైవానుగ్రహం కలగాలంటే ఏమి చేయాలి???*
చిన్న పిల్లల నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటుంది..! అది అందరూ గమనించే ఉంటారు. 
ఎవరైనా వాళ్లకోసం ఏదైనా వస్తువు లేదా బొమ్మ  తెచ్చినప్పుడు, *' ఇది నాది ' అని గట్టిగా వాదిస్తారు*. 

అది ఎంత చిన్నదైనా సరే, ' ఇది నాది '  అని వాళ్ళు అనుకున్నారంటే ... బంగారం వారి ముందు పెట్టినా కూడా ఆ వస్తువును ఇవ్వడానికి ఒప్పుకోరు.. 

మనం కూడా సరిగా భగవంతుని విషయములో మనం ఇలానే ఉండాలి...
' భగవంతుడు నా వాడు ' అని గట్టిగా అనుకున్న తరువాత ఎలాంటి ప్రాపంచిక వస్తు విషయ సుఖాలకు లొంగకూడదు.  

సంసారపు మాయలో పడి సర్వేశ్వరుని మరువకూడదు, విడువకూడదు. 
దైవానుగ్రహం చిక్కవలెనంటే దైవాన్ని దృఢముగా పట్టుకోవాలి..
అప్పుడే ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతాము .

               *_🌺శుభమస్తు.🌺_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment