Sunday, August 31, 2025

కాటుకగౌరి నోము కథ

ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుచుండెను. ఆ త్రోవన పోవుచున్న పార్వతీదేవి”  ఏమమ్మా  విచారించుచున్నావు ? ”  అని అడిగెను. అందుకు ఆమె ” అమ్మా నీవెవరివో తెలిసికొనుటకు నాకు  కండ్లు లేవు.  గ్రుడ్డిదానను, నన్ను చూచి అందరూ నవ్వుచున్నారు. ఆ బాధలు పడలేక ఇట్లు వచ్చితిని. ఇక్కడకు వచ్చిననూ నీవెవరో నన్ను పరామర్శించుచున్నావు. గ్రుడ్డిదాననగు నాకు సర్వము గ్రుడ్డిదిగనే తోచుచున్నది. ఇరుగు పొరుగు గ్రుడ్డి, మగడు గ్రుడ్డి, అంతా గ్రుడ్డి అని అన్నారు. ” పార్వతీదేవి నవ్వుకొని నీవు పూర్వము కాటుకగౌరి నోము పట్టి ఉల్లంఘన చేయుటచే నీకీ జన్మలో ఇట్టి కష్టము వచ్చెను. ఇప్పుడా నోము నోచినచో నీకు దృష్టి వచ్చునని వెడలిపోయెను. ఆమె తడుముకొని ఇంటికి వచ్చి నోము నోచుకొని దృష్టిని పొందగలిగెను.


ఉద్యాపన:

నోము పట్టి ఈ కథను చెప్పుకొని ఏడాదిపాటు అక్షతలు వేసుకొనవలెను. సంవత్సరం పూర్తయిన తరువాత ఒక పుణ్యవతికి తలంటి నీళ్ళుపోసి, చీర, రవికెలగుడ్డ, కాటుకతో బరిణి, దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను.

No comments:

Post a Comment