గుడిమల్లం శివాలయం: ప్రాచీన రహస్యాలు & విశ్వాసాలు | The Ancient Mysteries of Gudimallam Shiva Temple
https://youtu.be/gdrD9zYXiaU?si=Rs1sjAhh6elKrPxn
https://www.youtube.com/watch?v=gdrD9zYXiaU
Transcript:
(00:00) మనందరికీ తెలిసిన తిరుపతికి చాలా దగ్గరలో ఒక చిన్న పల్లెటూర్లో వేల సంవత్సరాలుగా పరిష్కారం దొరకని ఒక రహస్యం దాగి ఉంది. ఇది కేవలం చరిత్రకారులనే కాదు సైంటిస్టులను కూడా తలలు పట్టుకునేలా చేస్తున్న ఒక అద్భుతం దాని పేరే గుడిమల్లం ఒక్కసారి ఊహించుకోండి ప్రపంచంలోనే ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్న ఒక పురాతన విగ్రహం మనం ఇప్పటిదాకా చూసిన వాటికి ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తి భిన్నంగా ఉంటే అవును మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి అద్భుతం గురించే అదే గుడిమల్లం లింగం తిరుపతికి జస్ట్ ఓ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి గుడిమల్లం అనే గ్రామంలో
(00:40) ఈ అద్భుతం ఉంది. ఐదు అడుగుల ఎత్తున్న ఈ శివలింగం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి పూజలు అందుకుంటుంది. అంటే దాదాపు 2300 ఏళ్లుగా దీని నిర్మాణం దాని రూపం అన్ని ఒక అంతుచిక్కని మిస్టరీ. సరే అసలు ఈ గుడిమల్లం శివలింగానికి అంత ప్రత్యేకత ఏంటి? మిగతా అన్ని శివలింగాల కన్నా దీన్ని అంత భిన్నంగా మార్చేది ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
(01:05) దీని రూపం వెనుకున్న రహస్యం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా మనం గుడికి వెళ్తే శివలింగం ఎలా ఉంటుంది అది ఒక నైరూప్య రూపం కదా కానీ గుడిమల్లంలో మాత్రం అలా కాదు ఇక్కడ లింగం వాస్తవానికి ఒక పురుషాంగం ఆకారంలో ఉంటుంది. దానిమీద ఒక వేటగాడి రూపంలో ఉన్న శివుడిని చెక్కారు. నిజంగా ప్రపంచంలో ఇలాంటి శివలింగం ఇంకెక్కడా మనకు కనిపించదు.
(01:33) ఇక విగ్రహం వివరాల్లోకి వెళితే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ శివుడు అంటే రుద్రుడు ఒక యక్షుడి భుజాలపై నిల్చుని ఉంటాడు. ఆయన కుడి చేతిలో ఒక గొర్రపిల్ల ఎడమ చేతిలో ఒక చిన్న కమండలం భుజం మీద ఒక గండ్ర గుడ్డలి ఇవన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విగ్రహానికి యజ్ఞోపవీతం లేదు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
(01:58) ఇంతటి అద్భుతం ఇన్ని వందల సంవత్సరాలు మన కళ్ళ ముందే ఉన్నా చాలా కాలం పాటు ప్రపంచానికి తెలియకుండా పోయింది. మరి దీన్ని మళ్ళీ వెలుగులోకి ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక పురావస్తు శాస్త్రవేత్తల కృషి చాలా ఉంది. దీని చరిత్ర క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుంచే మొదలవుతుంది. అప్పట్లో ఉజ్జైనీలో దొరికిన కొన్ని రాగి నాణాల మీద సేమ్ ఇలాంటి బొమ్మె కనిపించింది.
(02:26) తరువాత క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో ఈ లింగాన్ని గుడి మల్లల్లో ప్రతిష్టించారు. అప్పుడు గుడి, గట్రా ఏమీ లేదు జస్ట్ ఆరు బయటే ఉండేది. ఇక ఎన్నో వందల సంవత్సరాల తర్వాత 1911 లో గోపీనాథరావు అనే ఒక ఆర్కియాలజిస్ట్ దీన్ని కనుక్కొని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత 1973 74 లో తవ్వకాలు జరిపితే కానీ దీని అసలు వయస్సు దీని పురాతన నిర్మాణం బయటపడలేదు.
(02:53) సరే ఇదంతా చరిత్ర కానీ ఈ గుడికి ఒక బలమైన పురాణ ఘాత కూడా ఉంది. అదే ఈ ఆలయానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇచ్చింది. ఆ కథే పరశురాముని పురాణం. పురాణాల ప్రకారం ఏమైందంటే పరశురాముడు తన తండ్రి మాట మీద తల్లిని చంపేస్తాడు. ఆ పాప పరిహారం కోసం తిరుగుతూ ఇక్కడిక వస్తాడు. అప్పుడు ఈ శివలింగాన్ని కనుగొని రోజు పూజించడం మొదలు పెడతాడు.
(03:19) దగ్గరలోని చెరువులో రోజుకి ఒకే ఒక్క పువ్వు పూసేదట. ఆ పువ్వును కాపాడటానికి చిత్రసేనుడు అనే యక్షుడిని కాపలా పెడతాడు. కానీ ఒక రాక్షసుడు ఆ పువ్వును దొంగలించడానికి ప్రయత్నిస్తే వాళ్ళద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. చివరికి పరమశివుడు ప్రత్యక్షమై వాళ్ళ భక్తికి మెచ్చి అందరికీ మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే ఈ గుడికి పరశురామేశ్వరాలయం అని కూడా పేరువచ్చింది.
(03:40) అయితే ఈ ఆలయంలోని వింతలు కేవలం ఆ లింగానికే పరిమితం కాలేదు. ఆలయ నిర్మాణం దగ్గర నుంచి అక్కడున్న వేరే విగ్రహాల వరకు అన్ని మిస్టరీలే. ఈ నిర్మాణంలో ఉన్న వింతలు మనకు అర్థం కావాలంటే ముందు ఆగమ శాస్త్రం అంటే ఏంటో తెలియాలి. సింపుల్ గా చెప్పాలంటే హిందూ దేవాలయాలు ఎలా కట్టాలి ఏ దిక్కున ఏది ఉండాలి అని చెప్పే ఒక రూల్ బుక్ అనమాట.
(04:05) అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. గుడిమల్లం ఆలయం ఈ ఆగమ శాస్త్ర నియమాలను ఏమాత్రం పాటించలేదు. గుడి ప్రధాన ద్వారం తూర్పుకు బదులుగా పడమర వైపు ఉంటుంది. ఆలయం ఆకారం కూడా గజ పృష్టాకారం అంటారు. అంటే ఏనుగు వెనుక భాగంలా ఉంటుంది. అన్నింటికన్నా పెద్ద షాక్ ఏంటంటే గర్భగుడి భూమికి 10 అడుగుల లోతులో ఉంటుంది. అసలు ఎందుకు ఇలా కట్టారు? ఇక్కడ వింతలు శివలింగం తోనే ఆగిపోలేదు.
(04:33) ఇక్కడున్న కుమారస్వామి విగ్రహం కూడా చాలా స్పెషల్ ఆయన వాహనం నెమలి వెనక్కి తిరిగి ఉంటుంది. ఇలాంటిది మనం ఎక్కడా చూసి ఉండం. ఇంకా భారతదేశంలోనే దొరికిన మొట్టమొదటి సూర్య విగ్రహాల్లో ఒకటి ఇక్కడ ఉందని కూడా నమ్ముతారు. అంతేకాదు సాక్షాత్తు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అచ్చు గుద్దినటువే విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఇప్పటివరకు మనం చరిత్ర పురాణాలు నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం.
(05:01) ఇప్పుడు ఈ ఆలయం చుట్టూ ఉన్న సైన్స్ కి కూడా అందని కొన్ని వింతల గురించి తెలుసుకుందాం. ఇవి ఈ స్థలం యొక్క మిస్టరీని ఇంకాస్త పెంచుతాయి. 60 సంవత్సరాలు ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆలయంలో ప్రతి 60 ఏళ్లకోసారి ఒక అద్భుతం జరుగుతుంది. కరెక్ట్ గా ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి గర్భగుడి ఎక్కడి నుంచో వచ్చిన నీళ్ళతో పూర్తిగా నిండిపోతుంది.
(05:27) శివలింగం మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఆ నీళ్ళు వాటంతట అవే మాయం అయిపోతాయి. గంగాదేవి వచ్చి శివుణ్ణి కౌగిలించుకుంటుందని అక్కడ వాళ్ళు నమ్ముతారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడికి శ్రీకాళహస్తి శివాలయానికి మధ్య ఒక రహస్య సురంగ మార్గం ఉందని కూడా గట్టిగా నమ్ముతారు.
(05:53) పూర్వకాలంలో పూజారులు దాని ద్వారానే వెళ్లేవారట. కొన్నేళ్ల క్రితం గర్భగుడిలో ఒక పెద్ద ఆగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఐదుగురు చనిపోయారు కూడా కానీ ఆ విగ్రహానికి చిన్న గీత కూడా పడలేదు. ఎందుకంటే దాన్ని డోలరైట్ అనే ఒక ప్రత్యేకమైన రాయితో చేశారు. ఇది విపరీతమైన వేడిని కూడా తట్టుకోగలదు. ఇంతకీ ఆ రాయికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
(06:21) కొందరి వాదన ప్రకారం ఆ రాయి ఈ భూమి మీదది కాదట. ఎప్పుడో తోక చుక్కలు భూమిని డీ కొట్టినప్పుడు ఏర్పడిన ఒక ఉల్క అని వాళ్ళు చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే మనం ఇన్ని వేల సంవత్సరాలుగా పూజిస్తున్నది ఒక ఏలియన్ ఆబ్జెక్ట్ నా ఈ ప్రశ్నతోనే గుడిమల్లం రహస్యం మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది
No comments:
Post a Comment