🌺🙏 *ఓం నమో భగవతే వాసుదేవాయ* 🙏🌺*
*_🌴 ఆనందకరమైన జీవనానికి శారీరక ఆరోగ్యము పాటు మానసిక ఆరోగ్యము కూడా అత్యవసరము. మానవునికి దేవునియందు విశ్వాసము దృఢముగా ఉన్నపుడే తాను మానసికముగా దృఢముగా ఉండగలడు. దేవుని యందు విశ్వాసము జీవనానికి ఒక బరోసా. చెట్టు కొమ్మపై వాలిన పక్షి ఎట్టి ఆందోళన లేకుండా హాయిగా కూర్చుంటుంది. చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో లేదా పెద్ద గాలి వచ్చి తను కిందకి పడిపోతానేమో అనే భయం దానిలో కొంచమైనా ఉండదు. కారణం దాని రెక్కలపై దానికున్న నమ్మకం. అలానే మనకు భగవంతునిపై దృఢమైన విశ్వాసము ఉన్నపుడు మనము దేనికినీ భయపడవసిన పనిలేదు. తనని నమ్మిన వారిని ఎప్పుడు, ఎక్కడ ఎలా ఆదుకోవాలో అయనకు బాగా తెలుసును. మనం కేవలము విశ్వసించి ఉంటే చాలు. మిగతా భారం ఆయనే చూసుకుంటాడు.🌴_*
No comments:
Post a Comment