Tuesday, May 5, 2026

 నిలిచిన నావ కైనా 
కదిలే పడవకైనా 
కాలం ఒకటే 
వేగం ఒకటే!

ఎంతటి వారికైనా 
ఎక్కడ తామున్నా 
ఉన్నది ఒకటే రోజు 
మనదన్నది  అదే!

పోరాటపు పరుగులో 
చూడకు సమయం 
ఆశయాల ఆరాటంలో 
తెలియదు అలుపు...

శాపాలు పాపాలు 
ఎన్ని అడ్డొచ్చినా 
అదే నీదనుకుని 
అడుగేసి తీరాలి

దిగంతాలు నీకు తోడు 
గగనమే నీకు గొడుగు 
పదిలమగు  ధ్యేయమే 
పరుగాపని  పయనం 

మార్పు కోరే నీకోసం 
తూర్పు తెచ్చే వేకువ 
ఓర్పు తో మలచుకో 
దైవమిచ్చిన అవకాశం!

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment