Friday, May 1, 2026

బాధ లేకుండా జీవితం సాధ్యమా? Buddha చెప్పిన అసలు రహస్యం | Roots

బాధ లేకుండా జీవితం సాధ్యమా? Buddha చెప్పిన అసలు రహస్యం | Roots

Author Name:Roots

Youtube Channel Url:https://www.youtube.com/@RootsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mivRMbBxGAU



Transcript:
(00:00) ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు అర్జున్ వయసు 30 సంవత్సరాలు అతనికి ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. నెలకి లక్ష రూపాయలు జీతం వస్తుంది. అందమైన భార్య ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొన్నాడు. కొత్త కార్ కొన్నాడు. బయటికి చూస్తే అతని జీవితం పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్రెండ్స్ అందరూ అతన్ని చూసి అసూయ పడతారు.
(00:24) కానీ ప్రతి రాత్రి పడుకునే ముందు అర్జున్ కి ఒక విచిత్రమైన బాధ వచ్చేది. గుండెలో ఏదో బరువు అనిపించేది అన్ని ఉన్నాయి అయినా ఏదో లేదన్న ఫీలింగ్ ఆ బాధకి పేరు కూడా తెలియదు. ఎవరికైనా చెప్పాలంటే మాటలు రావు. ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి కదా అని అందరూ అంటారు. కానీ లోపల మాత్రం ఆ బిటనెస్ పోలేదు. నీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా అన్ని ఉన్నా ఏదో లేదన్న బాధ.
(00:48) ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఆ బాధ. ఈరోజు రూట్స్ లో మనం ఆ బాధ గురించి మాట్లాడదాం. బాధ లేకుండా జీవితం సాధ్యమా ఒకవేళ సాధ్యమైతే ఆ దారి ఏమిటి? 2005 100 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ ప్రశ్నకి సమాధానం జీవితమంతా వెతికాడు. అతను కనుగొన్న సత్యాలు ఈరోజు కూడా మనకి అంతే రెలవెంట్ గా ఉన్నాయి. నమస్కారం రూట్స్ కి తిరిగి స్వాగతం. ఇక్కడ మనం ప్రతి వారం జీవితంలోని డీప్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం.
(01:17) తత్వశాస్త్రం గురించి మనిషి అస్తిత్వం గురించి గత ఎపిసోడ్ లో మనం మాట్లాడాం మనిషి ఎందుకు బతుకుతున్నాడు అని సోక్రేట్స్ బుద్ధుడు సర్తరే విక్టర్ ఫ్రాంకల్ చెప్పిన లైఫ్ ఫిలాసఫీ చూసాం. ఈరోజు మనం ఇంకొంత లోతుకు వెళ్తాం. బాధ అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని మనం హ్యాండిల్ చేయగలమా అని చూద్దాం. ఈ ప్రశ్నకి సమాధానం వెతికిన గొప్ప వ్యక్తి బుద్ధుడు.
(01:39) అతను చెప్పిన ఫోర్ నోబుల్ ట్రూత్స్ అవి మన జీవితంలో ఎలా అప్లై చేయవచ్చు అని ఈరోజు తెలుసుకుందాం. చివరిలో ఒక సింపుల్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాను అది నీ రోజువారి బాధలను చాలా వరకు తగ్గించగలదు. కాబట్టి చివరి వరకు చూడు బుద్ధుని జీవితమే గొప్ప ఫిలాసఫీ అతని స్టోరీ అర్థమైతే అతను చెప్పింది ఎందుకు పవర్ఫుల్ గా ఉందో అర్థమవుతుంది. దాదాపు 2005 సంవత్సరాల క్రితం ప్రెసెంట్ డే నేపాల్ లో ఒక రాజు పాలించేవాడు.
(02:05) ఆ రాజుకి ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరే సిద్ధార్థ్ పుట్టిన వెంటనే ఒక ఆస్ట్రోలజర్ భవిష్యత్తు చెప్పాడు. ఈ పిల్లవాడు రాజు అవుతాడు లేదా సన్యాసి అవుతాడు అని రాజు భయపడ్డాడు. కొడుకు సన్యాసి అవ్వకూడదని అతన్ని రాజభవనం లోపలే పెంచాడు. బాధ అంటే ఏమిటో తెలియకుండా చేశాడు. సేవకులు భవనాలు సంగీతం వినోదం అన్ని ఉన్నాయి.
(02:29) బయట ప్రపంచం ఏమిటో సిద్ధార్థ్ కి తెలియదు. సిద్ధార్థ్ పెద్దవాడయ్యాడు. పెళ్లి అయింది. యశోధర అనే అందమైన అమ్మాయితో సంసారం చేశాడు. ఒక కొడుకు పుట్టాడు. జీవితం సుఖంగా సాగిపోతుంది అనుకున్నారు. కానీ ఒకరోజు సిద్ధార్థ్ కి రాజభవనం బయటకు వెళ్ళాలని అనిపించింది. తండ్రి అనుమతి తీసుకుని బయటకి వెళ్ళాడు. ఆ ఒక్కరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
(02:51) వీధుల్లో వెళ్తుండగా అతను నాలుగు దృశ్యాలు చూశడు. మొదటిది ఒక ముసలివాడు. శరీరం మంగిపోయి చేతిలో కర్ర పట్టుకొని ఒక్కో అడుగు వేయడానికి కూడా కష్టపడుతున్నాడు. సిద్ధార్థ్ మదన పడ్డాడు. అందరికీ ముసలితనం వస్తుందా అని తర్వాత ఒక రోగిని చూశడు. రోడ్డు పక్కన పడి ఉన్నాడు శరీరం జ్వరంతో వనుకుతుంది. బాధతో మూలువుతున్నాడు. ఆ తర్వాత ఒక శవాన్ని చూశాడు.
(03:15) నలుగురు మోసుకుపోతున్నారు వెనకాల ఫ్యామిలీ ఏడుస్తున్నారు. సిద్ధార్థ్ మనసు చెదిరిపోయింది. అందరూ చనిపోతారా అని చివరగా ఒక సన్యాసిని చూశాడు. ఆ సన్యాసికి ఏమీ లేదు కానీ అతని మొహంలో ఒక విచిత్రమైన శాంతి ఉంది. కళ్ళు క్లియర్ గా ఉన్నాయి. ఆ శాంతి చూసి సిద్ధార్థ్ ఆగిపోయాడు. ఆ రాత్రే అతను నిర్ణయం తీసుకున్నాడు. అన్ని వదిలి పెట్టాడు.
(03:38) నిద్రపోతున్న భార్యను చివరిసారి చూశాడు. పక్కనే పడుకున్న పసిపాపను చూశాడు. వాళ్ళను తాకలేదు ఎందుకంటే తాకితే వదలలేను అని తెలుసు రాజభవనం వదిలాడు. జీవితంలో అన్నింటికంటే ప్రెషస్ అయిన వాళ్ళను వదిలాడు. ఒక్కటే క్వశ్చన్ తో బయటకి వెళ్ళాడు. బాధ ఎందుకు వస్తుంది? దాన్ని ఆపగలమా అని ఆరు సంవత్సరాలు సిద్ధార్థ్ అడవుల్లో తిరిగాడు. గొప్ప గొప్ప గురువుల దగ్గర చదివాడు.
(04:02) కనమైన తపస్సు చేశాడు. రోజుకి ఒక్క అన్నపు గింజ మాత్రమే తింటూ శరీరాన్ని హింసించాడు. శరీరాన్ని బాధ పెట్టుకుంటే మాయ శాంతిస్తుందని అనుకున్నాడు. కానీ ఆరు సంవత్సరాల తర్వాత కూడా జవాబు దొరకలేదు. అతను చాలా అలసిపోయాడు. శరీరం చాలా వీక్ అయింది. ఒకరోజు అతను ఒక నది దగ్గర కూర్చున్నాడు. ఒక పడవలో పోతున్న మ్యూజిక్ టీచర్ తన శిష్యుడికి చెప్తున్నాడు.
(04:24) వీన తీగ చాలా లూస్ గా ఉంటే సౌండ్ రాదు. చాలా టై గా ఉంటే తెగిపోతుంది. కరెక్ట్ గా ఉంటేనే మ్యూజిక్ వస్తుంది అని ఆ మాటలు సిద్ధార్థ్ మనసులో నాటుకున్నాయి. అతనికి అర్థమైంది ఎక్స్ట్రీమ్ గా పోవడం వల్ల జవాబు రాదు అని మిడిల్ పాత్ అవసరం అని అతను తిరిగి సాధారణ ఆహారం తినడం మొదలు పెట్టాడు. బోద్గ అనే చోట ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు.
(04:47) ఇక్కడి నుంచి కదలను జవాబు దొరకకపోతే ఇక్కడే ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడు. రోజులు గడిచాయి. ఒక రాత్రి అతనికి ఎన్లైటన్మెంట్ వచ్చింది. అతను బుద్ధ అయ్యాడు అంటే తెలుసుకున్నవాడు అని అర్థం ఆ చెట్టు బోధి ట్రీగా ప్రసిద్ధి పొందింది. బుద్ధ కనుగొన్న విషయాలను ఫోర్ నోబెల్ ట్రూత్స్ అంటారు. ఇవి ఫిలాసఫీలో చాలా ఇంపార్టెంట్ వీటిని తెలుగులో చాలా క్లియర్లీ చెప్తాను.
(05:11) మొదటి నోబెల్ ట్రూత్ ఏమిటంటే జీవితంలో బాధ ఉంది. దీన్ని బుద్ధ దుఃఖం అన్నాడు. పుట్టడం బాధ, పెద్దవాడం బాధ, అనారోగ్యం బాధ, చావు బాధ. ఇష్టమైన వాళ్ళు దూరంగా వెళ్ళడం బాధ ఇష్టం లేని వాళ్ళతో ఉండటం బాధ కావలసింది దొరకకపోవడం బాధ ఇది విన్నప్పుడు చాలా నెగటివ్ గా అనిపిస్తుంది. కానీ బుద్ధ ఇది చెప్పడంలో ఒక డీప్ పర్పస్ ఉంది. ఒక డాక్టర్ ముందు రోగాన్ని డయాగ్నోస్ చేస్తాడు.
(05:36) తర్వాత ట్రీట్మెంట్ చేస్తాడు. అలాగే బాధ ఉందని రికగ్నైజ్ చేయడం దాన్ని సాల్వ్ చేయడానికి మొదటి స్టెప్. రెండవ నోబుల్ ట్రూత్ ఏమిటంటే బాధకి కారణం కోరిక మరియు అటాచ్మెంట్. ఇది చాలా డీప్లీ అర్ధం చేసుకోవాలి. బుద్ధ అన్ని వద్దు అని చెప్పలేదు. జీవితంలో ఎంజాయ్ చేయడం తప్పు కాదు కానీ ఒక విషయం తప్పకుండా ఇలాగే ఉండాలి అని పట్టుకుంటే అదే బాధకి కారణం అవుతుంది.
(06:00) ఆ జాబ్ ఉంటేనే నేను సక్సెస్ఫుల్ గా ఉంటాను. ఆ పర్సన్ నాతో ఉంటేనే నా జీవితం కంప్లీట్ అవుతుంది. అని అనుకున్నప్పుడు మనం ఆ విషయానికి బంది అవుతాం. ఆ బంధమే బాధను తీసుకొస్తుంది. ప్రతిసారి ఎక్స్పెక్టేషన్ తీరకపోతే ప్రతిసారి మనం హోల్డ్ చేసిన విషయం మారిపోతే బాధ వస్తుంది. ఎందుకంటే మనం ఆ అవుట్కం మీద మన హ్యాపీనెస్ ని పణంగా పెట్టాం.
(06:22) మూడవ నోబుల్ ట్రూత్ ఏమిటంటే బాధను ఆపడం సాధ్యం. ఇది బుద్ధ చెప్పిన అత్యంత హోప్ఫుల్ విషయం. బాధ పర్మనెంట్ కాదు. ఇది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనమే దాన్ని వదిలించుకోగలం. అటాచ్మెంట్ వదిలి పెడితే బాధ తగ్గుతుంది. ఇది ఈజీగా అనిపించదు కానీ ఇది పాసిబుల్ ఈ ట్రూత్ మనకి హోప్ ఇస్తుంది. నీ బాధ నీతో పర్మనెంట్లీ ఉండదు అది మారవచ్చు అని నాలుగవ నోబుల్ ట్రూత్ ఏమిటంటే దానికి ఒక పాత్ ఉంది.
(06:48) బుద్ధ దానిని ఎయిట్ ఫోల్డ్ పాత్ అన్నాడు. ఎయిట్ ఫోల్డ్ పాత్ లో రైట్ థింకింగ్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సంట్రేషన్ ఉంటాయి. ఇవి చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. సరైన విధంగా ఆలోచించు. సరైన మాటలు మాట్లాడు సరైన పనులు చెయ్ ఇవి డైలీ లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తే మెల్లగా బాధ తగ్గుతుంది అని బుద్ధ చెప్పాడు.
(07:09) ఇప్పుడు ఒక చాలా కామన్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేస్తాను. చాలా మంది అంటారు బుద్ధ అన్ని వద్దు అని చెప్పాడు. డిజైర్స్ లేకుండా ఎలా బతకాలి అని. ఇది కరెక్ట్ అర్ధం కాదు. బుద్ధ డిజైర్ లేకుండా ఉండమని చెప్పలేదు. అతను చెప్పింది ఏమిటంటే డిజైర్ తో కాదు. క్రేవింగ్ తో జాగ్రత్తగా ఉండమని. డిజైర్ అంటే నాకు ఈ గోల్ సాధించాలని ఉంది నేను ట్రై చేస్తాను అని క్రేవింగ్ అంటే ఇది జరగకపోతే నా జీవితం అర్థం లేదు అని ఆ డిఫరెన్స్ లోనే మొత్తం ఫిలాసఫీ ఉంది.
(07:38) ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ కోసం కష్టపడతాడు. ఆ డిజైర్ హెల్దీగా ఉంది. కానీ అదే స్టూడెంట్ ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నా జీవితం నాశనం అవుతుంది అని అనుకుంటే అది క్రేవింగ్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు డెవాస్టేట్ అవుతాడు. బుద్ధ చెప్పింది ఏమిటంటే ఎఫర్ట్ చెయి కానీ అవట్క మీద నీ ఎంటైర్ హ్యాపీనెస్ పెట్టుకో అని మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక వ్యక్తి తన పార్ట్నర్ ను డీప్లీ లవ్ చేస్తాడు.
(08:04) ఆ లవ్ అందమైనది కానీ అదే వ్యక్తి ఆ పర్సన్ నన్ను వదిలి వెళ్తే నేను బతకలేను అని అనుకుంటే ఆ లవ్ అటాచ్మెంట్ గా మారిపోయింది. ఆ అటాచ్మెంట్ వల్లే జెలసీ వస్తుంది. పొజెసివ్నెస్ వస్తుంది కాన్స్టెంట్ ఫియర్ వస్తుంది. ఆ రిలేషన్షిప్ లో ఇద్దరికీ సఫోకేటింగ్ గా అనిపిస్తుంది. బుద్ధ చెప్పింది ఏమిటంటే లవ్ చెయి కానీ ఆ వ్యక్తిని పోసెస్ చేయాలని అనుకోకు అని ఇది ప్రాక్టీస్ చేయడం ఈజీ కాదు.
(08:28) కానీ ఈ పర్స్పెక్టివ్ మారిన తర్వాత జీవితం చాలా లైట్ గా అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని టైట్లీ హోల్డ్ చేయకుండా లూస్లీ హోల్డ్ చేయడం నేర్చుకోవడమే బుద్ధ చెప్పిన పాత్. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. బుద్ధ 2005 వందల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు ఈరోజు మోడర్న్ సైన్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్టడీ జరిగింది.
(08:48) దాని పేరు హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హ్యాపీనెస్ స్టడీ 80 సంవత్సరాలు వందల మంది మనుషుల జీవితాలు అబ్సర్వ్ చేశారు. వాళ్ళు కనుగొన్నది ఏమిటంటే డబ్బు ఫేమ్ సక్సెస్ ఇవి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఇవ్వలేదు. జెన్యూన్ హ్యూమన్ కనెక్షన్స్ అంటే నిజమైన మనుషుల మధ్య సంబంధాలు అవే రియల్ హ్యాపీనెస్ కి కారణమయ్యాయి.
(09:10) బుద్ధ అన్నాడు అటాచ్మెంట్ వద్దు. కానీ కనెక్షన్ ఉండాలి అని ఈ రెండింటి మధ్య తేడా చాలా సటిల్ గా ఉంటుంది. కానీ చాలా ఇంపార్టెంట్. అటాచ్మెంట్ అంటే నువ్వు నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని నువ్వు మారకూడదు నువ్వు ఎప్పుడూ నాకు ఇలా రెస్పాండ్ చేయాలి అని కనెక్షన్ అంటే నేను నీతో ఉన్నాను నువ్వు ఎలా ఉన్నా నీకు ఫ్రీడమ ఉంది.
(09:30) నాకు కూడా ఫ్రీడమ ఉంది అని అటాచ్మెంట్ లో ఫియర్ ఉంటుంది కోల్పోతానేమో అని కనెక్షన్ లో ట్రస్ట్ ఉంటుంది. ఇద్దరికీ స్పేస్ ఉంటుంది. ఈ తేడా అర్థమైతే చాలా రిలేషన్షిప్స్ క్లియర్ అవుతాయి. ఎక్కడ బాధ వస్తుందో అర్థంవుతుంది. న్యూరోసైన్స్ కూడా బుద్ధాన్ని సపోర్ట్ చేస్తుంది. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ఈ క్షణంలో ఉండటం దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళ బ్రెయిన్ లో స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయని స్టడీస్ చెప్తున్నాయి.
(09:54) స్ట్రెస్ తగ్గుతుంది. యంజైటీ తగ్గుతుంది. బుద్ధ చెప్పిన ప్రెసెంట్ మూమెంట్ అవేర్నెస్ ఇప్పుడు సైన్స్ గా ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ ఫిలాసఫీ నీ జీవితంలో ఎలా యూస్ చేయవచ్చు అని చెప్తాను. ఇది థియరీ మాత్రమే కాదు ఈరోజే మొదలు పెట్టగలవు. మొదటి స్టెప్ ఏమిటంటే నీ బాధను రికగ్నైజ్ చేయడం చాలామంది బాధగా ఉన్నారని అడ్మిట్ చేసుకోరు.
(10:16) ఓకేగా ఉన్నాను అంటారు లోపల బాధగా ఉన్నా బుద్ధ చెప్పాడు బాధ ఉందని రికగ్నైజ్ చేయడమే మొదటి స్టెప్ అని అది వీక్నెస్ కాదు అది కరేజ్ రెండవ స్టెప్ ఏమిటంటే ఆ బాధ వెనుక ఉన్న ఎక్స్పెక్టేషన్ ని చూడడం. నీకు ఇప్పుడు ఉన్న బాధ ఏదైనా తీసుకో ఆ బాధ వెనుక ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఉందా? ఒక రిలేషన్షిప్ లో బాధగా ఉంటే ఆ వ్యక్తి ఇలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ వల్లే కదా బాధ వస్తుంది.
(10:38) ఒక జాబ్ లో అన్హ్యాపీగా ఉంటే జీవితం ఇలా ఉండాలి అనే ఐడియా వల్లే కదా వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రియలిస్టిక్ గా ఉందా అని అడుగు మూడవ స్టెప్ ఏమిటంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండటం బుద్ధ చెప్పిన అత్యంత ప్రాక్టికల్ టీచింగ్ ఇది. గతంలో జరిగిన దానిపై రూమినేట్ చేయడం వల్ల డిప్రెషన్ వస్తుంది. భవిష్యత్తు గురించి వరీ చేయడం వల్ల యంజైటీ వస్తుంది.
(11:01) ఈ క్షణంలో ఏముందో దాన్ని యజ ఇట్ ఇస్ గా చూడడం వల్ల క్లారిటీ వస్తుంది. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేయి రోజు 15 నిమిషాలు నీ బ్రీది మీద ఫోకస్ చేయి మరే థాట్ రాకుండా ఉండాలని ట్రై చేయకు థాట్స్ వస్తాయి వాటిని అబ్సర్వ్ చేసి మళ్ళీ బ్రీది మీదకి ఫోకస్ తీసుకురా ఇది చేయలేనట్టు అనిపిస్తుంది మొదట్లో కానీ ఇది రెగ్యులగా చేస్తే నీ మైండ్ గ్రాడ్ువల్లీ సెటిల్ అవుతుంది.
(11:24) బాధలు రావుని కాదు కానీ ఆ బాధలు నిన్ను కంట్రోల్ చేయలేవు. ఒక లాస్ట్ థాట్ చెప్తాను. మనం ఎప్పుడూ హ్యాపీనెస్ ని అవుట్సైడ్ లో వెతుకుతాం. ఆ జాబ్ వస్తే ఆ పర్సన్ వస్తే ఆ మనీ వస్తే హ్యాపీ అవుతాను అని కానీ బుద్ధ చెప్పాడు ఆ హ్యాపీనెస్ అక్కడ లేదు అని అది ఆల్వేస్ ఇన్సైడ్ లోనే ఉంటుంది. అవుట్సైడ్ విషయాలు టెంపరరీ సాటిస్ఫాక్షన్ ఇవ్వవచ్చు. కానీ పర్మనెంట్ పీస్ రావడానికి ఇన్సైడ్ చూడాలి.
(11:46) మన థాట్స్ తో మన అటాచ్మెంట్స్ తో మన ఎక్స్పెక్టేషన్స్ తో ఆనెస్ట్ గా ఉండాలి. ఇది ఒక్క రోజులో జరగదు. ఇది ఒక ప్రాక్టీస్ ఒక జర్నీ కానీ ఈ డైరెక్షన్ లో ఒక్క అడుగు వేయడం మొదలు పెట్టిన జీవితంలో ఒక రియల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. చివరగా మన సిద్ధార్థ్ స్టోరీకి తిరిగి వద్దాం. అతను అన్ని వదిలాడు ఒక ప్రశ్నతో వెళ్ళాడు. బాధ లేకుండా జీవితం సాధ్యమా అని ఆరు సంవత్సరాల తర్వాత అతను కనుగొన్న జవాబు ఏమిటంటే బాధ పూర్తిగా పోదు.
(12:16) కానీ బాధతో మనం ఎలా రిలేట్ అవుతామో అది మారవచ్చు. బాధ వచ్చినప్పుడు అది నా అటాచ్మెంట్ వల్ల వచ్చింది అని అర్థమైతే అది మనల్ని కంట్రోల్ చేయలేదు. మనం దాన్ని అబ్సర్వ్ చేయగలం. ఆ అబ్జర్వేషన్ లోనే ఫ్రీడమ దాగి ఉంది. ఆ ఫ్రీడమ కోసం రాజ్యం వదలక్కర్లేదు. భార్యను వదలక్కర్లేదు. నీ రోజువారి జీవితంలోనే నీ బాధల గురించి ఒక్కసారి డీప్లీ ఆలోచించు. ఆ బాధ వెనుక ఉన్న ఎక్స్పెక్టేషన్ చూడు అది నీకు స్వేచ్ఛను ఇస్తుంది.
(12:42) ఎపిసోడ్ నచ్చిందా లైక్ చెయ్. ఈ ఫిలాసఫీ నీకు యూస్ఫుల్ గా అనిపిస్తే నీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయి వాళ్ళకి కూడా ఈ విస్డమ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడతాం డబ్బు సంతోషం ఇవ్వదు అయితే ఏది ఇస్తుంది అని అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన రూట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment