Sunday, June 28, 2026

ఈ 7 పద్ధతులతో ఎవరి అబద్ధాలనైనా పసిగట్టడం నేర్చుకోండి - Chankya Niti

ఈ 7 పద్ధతులతో ఎవరి అబద్ధాలనైనా పసిగట్టడం నేర్చుకోండి - Chankya Niti

Author Name:Telugu Vastu Tips

Youtube Channel Url:https://www.youtube.com/@teluguvaastutips

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3AVeIBQriyc



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ నిజం తెలిసినవాడే అబద్ధం చెప్పగలడని చాణక్యుడు అంటాడు. ఎందుకంటే అబద్ధం వినేవారికి నిజం తెలియకపోవచ్చు కానీ అబద్ధం చెప్పేవాడికి అసలు నిజం ఎప్పుడూ తెలుస్తుంది. అందుకే అబద్ధాన్ని కనిపెట్టడం కూడా ఒక కల. హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కు స్వాగతం. ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే లైఫ్ లో ప్రతి స్టేజ్ లోనూ మీకు సహాయపడే ఒక కలను నేర్చుకోబోతున్నాం.
(00:27) అదే అబద్ధాన్ని కనిపెట్టే కల. ఎప్పుడు నిజాయితీగా బతకాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కలను నేర్చుకోవడం చాలా అవసరం. ఈ వీడియోలో అవతలి వ్యక్తి అబద్ధం చెప్తున్నాడని ఎలా ఈజీగా పట్టుకోవచ్చు ఏ సంకేతాలను గమనించాలో మరియు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు నేను మీకు చాణక్యుడు మరియు అతని శిష్యుడైన చంద్రగుప్తుడికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను.
(00:52) ఈ కథ మిమ్మల్ని ఆలోచింపజేయడమే కాకుండా చాణక్యుడు తన పదునైన మైండ్ తో క్షణాల్లో అబద్ధాన్ని ఎలా పట్టుకున్నాడో కూడా మీకు నేర్పుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నారు. వీడియో స్టార్ట్ చేసే ముందు. ఫ్రెండ్స్ మన ఛానల్ లో స్టార్ట్ చేసిన చాణక్య సిరీస్ లో ఇది ఎనిమిదవ వీడియో.
(01:18) ఈ సిరీస్ కి మీ నుండి వచ్చిన రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. థాంక్యూ సో మచ్ ఈ సిరీస్ వీడియోలు చాలా బాగున్నాయని లైఫ్ లో ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అని మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కి మరోసారి థాంక్స్. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.
(01:39) ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకరోజు చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడి దగ్గరికి వచ్చాడు. కానీ అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. చాణక్యుడు అతడి వైపు చూసి చాలా ప్రశాంతంగా చంద్రగుప్త ఏమైంది ఈరోజు ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. దానికి చంద్రగుప్తుడు పైకి నవ్వుతూ ఏం లేదు గురుదేవా నేను యుద్ధానికి సిద్ధమవడంలో నిమగ్నమై ఉన్నాను.
(02:06) అంతా బాగానే ఉంది అని చెప్పాడు. కానీ అతని కళ్ళు మాత్రం వేరే విషయం చెప్తున్నాయి. చంద్రగుప్తుడు నవ్వుతున్నది నకిలీ నవ్వని అతని గొంతులో వనుకు ఉందని చాణక్యుడు గమనించాడు. చాణక్యుడు చిరునవ్వు నవ్వి చంద్రగుప్త నువ్వు నా శిష్యుడివి నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు అసలు ఏమైందో చెప్పు అన్నాడు. చంద్రగుప్తుడు మళ్ళీ నవ్వుతూ ఆ ప్రశ్నను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ గురుదేవా మీరు ప్రతిసారి నా మనసుని చదివేస్తారు. నిజంగా ఏం లేదు అన్నాడు.
(02:32) కానీ చాణక్యుడికి అసలు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతను రెండు నిమిషాల్లోనే చంద్రగుప్తుడు అబద్ధం చెప్తున్నాడని పసిగట్టేసాడు. చాణక్యుడు చాలా ప్రశాంతంగా కానీ గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. చంద్రగుప్త నువ్వు చెప్తున్నది నిజం కాదు నిన్న రాత్రి నువ్వు కొంతమంది సైనికులతో రహస్యంగా సమావేశం పెట్టావు ఒక పథకం కూడా వేశవు.
(02:54) ఆ పథకమే ఇప్పుడు నా దగ్గర దాస్తున్నావు. నేను చెప్పింది నిజమే కదా దాంతో చంద్రగుప్తుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. కాస్త ధైర్యం తెచ్చుకొని అతను ఇలా అన్నాడు. గురుదేవా నేను ఎంతో నమ్మకంగా అబద్ధం చెప్పాను కానీ మీరు దాన్ని అంత సులభంగా ఎలా కనిపెట్టేశారు దయచేసి నాకు ఈ విద్య నాకు నేర్పించండి.
(03:16) అప్పుడు చాణక్యుడు నవ్వుతూ నా ప్రియ శిష్యుడా అబద్ధాన్ని పట్టుకోవడం అనేది ఏదో మ్యాజిక్ కాదు అది అవతలి వ్యక్తిని జాగ్రత్తగా గమనించడం ఓపిక మరియు తెలివి ఉపయోగించడం ద్వారా వచ్చే ఒక కళ. ఈరోజు నేను నీకు అబద్ధాన్ని ఎలా గుర్తించాలో నిజాన్ని ఎలా బయటకు లాగాలో నేర్పిస్తాను. కానీ దీనికంటే ముందు ఈ కల ఎంత ముఖ్యమో చెప్పే ఇంకొక చిన్న సంఘటన చెప్తాను విను అన్నాడు.
(03:41) అది పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే ఒక చిన్న గ్రామం అక్కడ అందరూ చాలా నిజాయితీగా బతికేవారు. ఆ ఊళలో ధర్మదత్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక నెయ్యి దుకానం ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతని దుకానం చాలా పేరుపొందింది. ఎందుకంటే అతను ఆవుపాలతో సొంతంగా తయారు చేసే నెయ్యి చాలా స్వచ్ఛంగా మంచి సువాసనతో ఎంతో రుచిగా ఉండేది.
(04:08) అందుకే అతని దుకానం ఎప్పుడూ జనాలతో నిండి ఉండేది. చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా జనాలు అతని దగ్గరికే వచ్చేవారు. దాంతో అతని వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అతనికి జీవితంలో అన్ని ఉన్నాయి. డబ్బు పేరు ప్రతిష్ట కానీ మనుషుల మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఎంత సంపాదించినా అతనిలో ఆశ చావలేదు. రోజులు గడిచే కొద్దీ ధర్మదత్తుడికి ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ ఆలోచన వచ్చింది.
(04:34) నెయ్యిలో కాస్త తక్కువ ధరక వచ్చే నూనె కలిపితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కదా అని పథకం వేశడు. ఎలాగో తన దుకానానికి మంచి పేరు ఉంది కాబట్టి జనాలు గుర్తుపట్టలేరని గట్టిగా నమ్మాడు. అనుకున్నట్టుగానే మొదటి రోజు కల్తీ నెయ్యి అమ్మితే అదంతా సులువుగా అమ్ముడైపోయింది. ఎవరు దాని వాసనని కానీ రంగుని కానీ అనుమాన పడలేదు.
(04:56) దాంతో అతనికి మితిమీరిన నమ్మకం వచ్చేసింది. ఇక అప్పటి నుండి రోజువారి నెయ్యిలో నూనె కలపడం మొదలు పెట్టాడు. ఖర్చులు తగ్గాయి లాభాలు రెట్టింపఅయ్యాయి. అతని గల్లా పెట్టే డబ్బులతో నిండిపోయింది. జనాలు తనను ఒక మంచివాడిగా దైవభక్తి ఉన్నవాడిగా అనుకోవాలని అతను ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దుకానాన్ని పెద్దది చేశాడు.
(05:19) ఊరి గుడికి భారీగా విరాళాలు ఇవ్వడం కూడా మొదలు పెట్టాడు. కానీ అతను ఒక చిన్న విషయం మర్చిపోయాడు. నిజాన్ని ఎంతకాలం దాచినా ఏదో ఒక రోజు అది బయట పడక మానదు. కొన్నాళ్ళకి ఊరి పెద్దలకి ఆ నెయ్యి రుచిలో వాసనలో తేడా రావడం గమనించారు. పైగా ఆ నెయ్యి తిన్న తర్వాత పిల్లలకి కడుపు నొప్పి రావడం మొదలైంది. కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళు కూడా నెయ్యి మునుపటిలా లేదని అనుకున్నారు.
(05:44) కానీ ధర్మదత్తుడు ఊళలో పెద్ద మనిషి అయిపోయేసరికి ఎవరూ ధైర్యంగా బయటకి చెప్పలేకపోయారు. అలాంటి సమయంలోనే ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ఆయన దేశమంతటా తిరుగుతూ రకరకాల ఊర్లలో ఆగుతూ అక్కడి ప్రజల కష్టాలు విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈ ఊరికి వచ్చినప్పుడు ఆయన కూడా ధర్మదత్తుడి దుకానంలోనే నెయ్యి కొన్నారు. ఆయన ఆ నెయ్యి వాసన చూసి వేలితో కాస్త వృద్ది చూసి విషయం ఏంటో కనిపెట్టేసి మెల్లగా నవ్వారు.
(06:12) ఆ సాధువు గ్రామస్తుల ముందే ధర్మదత్తుడిని పిలిచి ఏంటి నాయనా ఈ నెయ్యిలో ఏదో తేడా ఉందని నీకు అనిపించడం లేదా అని అడిగాడు. భయంతో ప్రజలు ఏమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ సరే రేపు ఉదయం అందరూ గుడి దగ్గరికి రండి అక్కడే అసలు నిజం ఏంటో తేలుస్తాను అన్నారు. మరుసటి రోజు ఉదయం ఊరంతా గుడి దగ్గర చేరింది. సాధువు ధర్మదత్తుడిని కూడా అక్కడికి పిలిచాడు.
(06:36) అందరి కళ్ళు అతని పైనే ఉన్నాయి. అప్పుడు సాధువు ఒక గిన్నెలో ఆ నెయ్యిని తీసుకొని అందులో దూది పెట్టి దీపం వెలిగించారు. ఆశ్చర్యకరంగా ఆ దీపం వెలగగానే దట్టమైన నల్లటి పొగ చెడ్డ వాసన రావడం మొదలయ్యాయి. అది చూసి జనాలంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు సాధువు చూశారా స్వచ్ఛమైన నెయ్యి ఎప్పుడూ ఇలా మండదు ఇందులో తప్పకుండా కల్తీ జరిగింది అన్నారు.
(07:02) ధర్మదత్తుడి ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. గ్రామ పెద్ద తీవ్రంగా నిజం చెప్పు ఇందులో ఏం కలిపావు అని నిలదీశడు. ధర్మదత్తుడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ సాధువు తీక్షణమైన చూపుల నుండి ఊరి జనాల ఆగ్రహం ముందు అతని ఆటలు సాగలేదు. చివరికి తలదించుకొని నేను నెయ్యిలో చౌకరకం నూనె కలిపాను అని ఒప్పుకున్నాడు.
(07:24) ఒక్కసారిగా ఊరంతా నిశశబ్దం అలుముకుంది. ఇన్నేళ్లుగా అతన్ని నమ్మినందుకు అందరూ సిగ్గుపడ్డారు. ధర్మదత్తుడు ఏడుస్తూ దురాశకు లోనై ఈ పాపం చేసేసాను. నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆ సాధువు చాలా ప్రశాంతంగా ఇలా చెప్పారు. చూడు బాబు డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ ఇలా అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు.
(07:49) నువ్వు గుడికి ఇచ్చిన విరాళాలన్నీ వృధ ఎందుకంటే ఆ డబ్బు వెనుక ఎంతో మంది పాపం ఏడుపున్నాయి. ఆ రోజు నుండి తానెప్పుడూ కల్తీ చేయనని ధర్మదత్తుడు అందరి ముందు మాటఇచ్చాడు. గ్రామస్తులు కూడా అతనికి చివరి అవకాశం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ అప్పటి నుండి ఏ వస్తువు కొన్నా బాగా పరీక్షించుకొని జాగ్రత్తగా కొనడం అలవాటు చేసుకున్నారు. చంద్రగుప్త ఈ సంఘటన నుండి నువ్వు ఏం నేర్చుకున్నావ్? ఇందులో మొదటి మరియు అతి పెద్ద పాఠం ఏంటంటే ఒక వ్యక్తి ఎంత తెలివైన వాడైనా సరే నిజాన్ని ఎప్పటికీ దాచలేడు.
(08:21) అబద్ధాల ముసుగు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తొలగిపోతుంది. రెండోది వ్యాపారంలో నిజాయితీనే అన్నింటికంటే పెద్ద సంపద. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడే నిజమైన వ్యాపారస్తుడు అవుతాడు. ఇక ఈ సంఘటనలో మూడో కోణం కూడా ఉంది. అదే జనాల చూపు. ఆ మహర్షి లాగా ఒక్క వ్యక్తి మెలకువగా ఉన్నా సరే ఊరంతటికీ కళ్ళు తెరిపించవచ్చు. అంటే సమాజం కళ్ళు మూసుకొని ఉన్నంత కాలం ఇలాంటి మోసగాళ్ళు ఎదుగుతూనే ఉంటారు.
(08:49) కానీ జనాలు ఎప్పుడైతే అప్రమత్తం అవుతారో అప్పుడు ఇలాంటి అన్యాయాలకి ముగింపబడుతుంది. చంద్రగుప్త ఆ మహర్షి ఆ వ్యాపారిని మార్చడమే కాకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే నిజం మారిపోదని ఊరి మొత్తానికి ఒక మంచి పాఠం చెప్పారు. గ్రామస్తులు ముందే గ్రహించి ఉండి ఉంటే వాళ్ళకు స్వచ్ఛమైన నెయ్యి దొరికేది. ఆ కల్తీ వల్ల పిల్లల ఆరోగ్యం కూడా పాడైపోయేది కాదు.
(09:11) అందుకే ఒక రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు గానీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నా గాని నువ్వు ఎప్పుడూ మెలకువగా ఉండాలి. నీ ఆస్థానంలో ఎవరైనా నిన్ను విపరీతంగా పొగుడుతున్నారంటే ఆ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించు. ఎవరైనా నీకు ఏదైనా సలహా ఇస్తే వాళ్ళ మనసులో ఏముందో చదవడానికి ప్రయత్నించు. ప్రతి మాట, ప్రతి చేష్ట చివరికి అవతలి వ్యక్తి నవ్వు వెనుక ఉన్న నిజాన్ని కూడా అర్థం చేసుకోవడం అలవాటు చేసుకో.
(09:40) కేవలం దురాశకు లోనై ఆ వ్యాపారి తన పరువు మొత్తం పోగొట్టుకున్నాడు. ఈ రోజుకి ఆ ఊరి జనాలు అతన్ని అనుమానంగానే చూస్తారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి నమ్మకం పోతే దాన్ని మళ్ళీ సంపాదించడం అసాధ్యం. అప్పుడు చంద్రగుప్తుడు గౌరవంగా తలవంచి ఆచార్య నాకు అర్థమైంది. రాజ్యంలో అయినా నా సొంత జీవితంలో అయినా నిజాన్నే అన్నింటికంటే గొప్పగా భావిస్తాను.
(10:05) ఎంత పెద్ద అవకాశం వచ్చినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను ఎప్పటికీ అన్యాయానికి మోసానికి తావివ్వను అని మాటఇచ్చాడు. అప్పుడు చాణక్యుడు సంతోషంగా చంద్రగుప్త ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడని సులువుగా కనిపెట్టడానికి ఉపయోగపడే కొన్ని సూత్రాలు ఇప్పుడు నీతో పంచుకోబోతున్నాను. కానీ ఈ కల తెలియాలంటే నీకు చాలా సహనం పరిశీలన అవసరం. కాబట్టి ఇప్పుడు ఆ సూత్రాలు ఏంటో ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుసుకుందాం అన్నాడు.
(10:34) మొదటి సూత్రం బాడీ లాంగ్వేజ్ ను గమనించండి. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నప్పుడు అన్నింటికంటే ముందే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. వాళ్ళ నోరు ఏవైనా అబద్ధాలు చెప్పొచ్చు కానీ వాళ్ళ బాడీ మాత్రం నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఉదాహరణకు ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు పదే పదే కళ్ళు తిప్పుతుంటే లేదా చూపులు పక్కకు మారుస్తుంటే వాళ్ళు ఏదో దాస్తున్నారని అర్థం.
(11:02) సాధారణంగా నిజం చెప్పే వ్యక్తి అవతలి వాళ్ళ కళ్ళలోకి ధైర్యంగా చూసి మాట్లాడతాడు. కానీ అబద్ధం చెప్పేవాడు ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేస్తాడు. లేదా పదే పదే కళ్ళు దించేసి కిందకి చూస్తుంటాడు. అంతేకాదు అబద్ధం చెప్పేటప్పుడు జనాలు తెలియకుండానే పదే పదే వాళ్ళ నోటిని కానీ ముక్కును కానీ పట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ లోపల ఉన్న టెన్షన్ ని చూపిస్తుంది. మైండ్ ఎప్పుడైతే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తుందో అప్పుడు బాడీలో తెలియకుండానే ఒక రకమైన ప్రెజర్ పెరుగుతుంది.
(11:32) దాంతో చేతులు ఆటోమేటిక్ గా ముక్కు నోరు లేదా మెడ దగ్గరికి వెళ్తుంటాయి. చివరికి వాళ్ళ కాళ్ళ మూమెంట్స్ కూడా చాలా విషయాలు చెప్తాయి. అబద్ధం చెప్పే వ్యక్తి పదే పదే కాళ్ళు ఊపడం కుర్చీలో కంఫర్టబుల్ గా కూర్చోలేక అటూ ఇటు కదలడం లేదా మాటి మాటికి కూర్చునే స్టైల్ మార్చడం లాంటివి చేస్తాడు. ఈ మూమెంట్స్ అన్నీ వాళ్ళ లోపల రన్ అవుతున్న కంగారు వల్లే జరుగుతాయి.
(11:55) రెండవ సూత్రం వాయిస్ టోన్ ను గమనించండి. అవతలి వ్యక్తి మాట్లాడే టోన్ మీద శ్రద్ధ పెట్టడం రెండో ముఖ్యమైన సూత్రం. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నప్పుడు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ వాయిస్ లో చిన్న మార్పు వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మామూలుగా మాట్లాడేటప్పుడు చాలా కూల్ గా నెమ్మదిగా మాట్లాడుతుంటాడు. కానీ మనం ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగినప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ గొంతు పెంచినా లేదా గొంతు కాస్త బొంగురు పోయినా వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని ఏదో దాస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు
(12:30) మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా గొంతు నొక్కుకుపోతూ నేను నేను అంటూ మధ్య మధ్యలో నత్తిగా మాట్లాడితే అది కూడా అబద్ధానికి ఒక హింట్ కావచ్చు. కొన్నిసార్లు అబద్ధం చెప్పేవాళ్ళు అవతలి వ్యక్తికి నమ్మకం కలిగించడం కోసం ఒకే మాటను పదే పదే చెప్తుంటారు. ఉదాహరణకు లేదు లేదు నేను అస్సలు అక్కడికి వెళ్ళలేదు నిజంగా వెళ్ళలేదు అంటూ ఒకే వాక్యాన్ని రిపీట్ చేస్తారు.
(12:58) ఇలా పదే పదే చెప్తున్నారంటే వాళ్ళు తమ అబద్ధాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ గొంతులో వనుకు లోపల టెన్షన్ పెట్టుకొని అబద్ధం చెప్పే వ్యక్తి ఎంత ట్రై చేసినా తన గొంతును నార్మల్ గా ఉంచలేడు. వాళ్ళ నోరు ఎండిపోవడం వల్ల గొంతు మారుతుంది. కొద్దిగా వనుకుతుంది లేదా చాలా స్పీడ్ గా మాట్లాడేస్తారు.
(13:19) కొంచెం అబ్సర్వ్ చేసే ఎవరైనా ఈ తేడాని ఈజీగా కనిపెట్టేయగలరు. అయితే ఇక్కడ మనం ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉండటం వల్ల లేదా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు వచ్చే కంగారు వల్ల కూడా గొంతు ఇలాగే మారవచ్చు కాబట్టి కేవలం గొంతును బట్టే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని ఫిక్స్ అయిపోకండి. దాంతో పాటు వాళ్ళ ముఖ కవలికలు ఐ మూమెంట్స్ మరియు బాడీ లాంగ్వేజ్ ని కూడా కలిపి చెక్ చేసుకోండి.
(13:47) మూడవ సూత్రం వాళ్ళ మాటల్లోని తేడాలను గమనించండి. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండడం చాలా కామన్ ఎందుకంటే నిజం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. కాబట్టి నిజం చెప్పేవాడి కథ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ అబద్ధం చెప్పేవాడు సిచువేషన్ ను బట్టి కథలు అల్లాసి వస్తుంది. అలా కొత్త కథలు క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఎక్కడో ఒక చోట కచ్చితంగా దొరికిపోతాడు.
(14:14) ఉదాహరణకు ఒక వ్యక్తి మొదట నేను నిన్న రోజంతా ఇంట్లోనే ఉన్నాను అని చెప్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత మాటల మధ్యలో నేను నిన్న మార్కెట్ లో ఒక ఫ్రెండ్ ని కలిశాను అంటాడు. ఇది క్లియర్ గా మాట మార్చడమే అవుతుంది. ఎందుకంటే రెండు విషయాలు ఒకే టైంలో జరగడం ఇంపాసిబుల్ కదా ఈ రకంగానే అబద్ధాలు చెప్పేవాళ్ళు తెలియకుండానే మాటలు మారుస్తూ ఉంటారు.
(14:35) దాంతో వాళ్ళ అబద్ధాల ముసుగు తొలగిపోతుంది. వాళ్ళు ముందు చెప్పిన దానికి తర్వాత చెప్తున్న దానికి తేడా ఏంటో మీరు ప్రశాంతంగా ఓపికగా గమనిస్తే ఆ డిఫరెన్స్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మీరు ఒకే విషయాన్ని తిప్పి తిప్పి వేరే రకాలుగా అడిగినప్పుడు వాళ్ళు బాగా కంగారు పడతారు. కొన్నిసార్లు ఒకే క్వశ్చన్ ని కాసేపు ఆగి మళ్ళీ అడిగితే వాళ్ళ ఆన్సర్ పూర్తిగా మారిపోతుంది.
(14:58) ఇది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనడానికి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అయితే ఇక్కడ కూడా ఒక చిన్న జాగ్రత్త కొన్నిసార్లు నిజాయితీపరులు కూడా పాత విషయాలను మర్చిపోవడం వల్లనో లేదా సరిగ్గా గుర్తులేకపోవడం వల్లనో మాటలు మార్చవచ్చు. కాబట్టి ఈ రూల్ తో పాటు మనం ముందు చెప్పుకున్న మిగతా రూల్స్ కూడా కలిపి చెక్ చేసుకోవడం మంచిది.
(15:20) నాలుగవ సూత్రం వాళ్ళ ఎమోషన్స్ లోని నిజాయితీని గమనించండి. అబద్ధం చెప్పే వాళ్ళు ప్రదర్శించే ఎమోషన్స్ చాలా వరకు ఫేక్ గా ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా పైకి చాలా బాధపడుతున్నట్టు లేదా విపరీతంగా ఆనంద పడుతున్నట్టు నటిస్తుంటారు. కానీ వాళ్ళ కళ్ళలో మాత్రం ఆ బాధ గాని సంతోషం గాని అస్సలు కనిపించవు. ముఖంలో ఎలాంటి రియల్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా కేవలం ఓవర్ యక్షన్ చేస్తున్నారంటే అక్కడ ఏదో తేడా ఉందని మనం ఈజీగా డౌట్ పడొచ్చు.
(15:49) ఎందుకంటే నిజమైన ఎమోషన్స్ అనేవి లోపలి నుండి నార్మల్ గా వస్తాయి. వాటి కోసం స్పెషల్ గా ట్రై చేయాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధం చెప్పేటప్పుడు అవతలి వ్యక్తి బాగా ఆలోచించి కావాలని కొన్ని ఎమోషన్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. అందుకే వాళ్ళ వాయిస్ కి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి అస్సలు సింక్ ఉండదు. ఉదాహరణకు మీ హెల్ప్ కి థాంక్స్ చెప్తూ తను చాలా హ్యాపీగా ఉన్నానని ఒక ఫ్రెండ్ అంటున్నాడు అనుకుందాం.
(16:15) కానీ వాళ్ళ ముఖంలో ఆ గ్లో గాని సంతోషం గాని కనిపించకుండా కేవలం ఆర్టిఫిషియల్ గా నవ్వడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఏదో దాస్తున్నారని అర్థం చేసుకోండి. అలాగే బాధగా ఉన్నట్టు నటించేవాళ్ళు మాటి మాటికి ముక్కు తుడుచుకోవడం తల దించేసుకోవడం లేదా పక్కకు తప్పుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎమోషన్స్ ని కాస్త ఎక్కువగా చూపించినంత మాత్రాన ప్రతి ఒక్కరు అబద్ధం చెప్తున్నట్టు కాదు ఎందుకంటే కొంతమంది క్యారెక్టరే సహజంగానే కాస్త డ్రామాటిక్ గా ఉంటుంది.
(16:46) చిన్న విషయానికే ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి కేవలం ఎమోషన్స్ ఒక్కటే కాకుండా వాళ్ళ మాటలు బాడీ లాంగ్వేజ్ మరియు వాయిస్ స్టోన్ ని కూడా కలిపి చెక్ చేసుకోండి. ఐదవ సూత్రం టైం ప్రెజర్ క్రియేట్ చేయండి. అబద్ధం చెప్పే వాళ్ళకి తమ అబద్ధాన్ని క్రియేట్ చేసుకోవడానికి కాస్త టైం కావాలి. అలాంటప్పుడు మీరు వాళ్ళపై వరుసగా ప్రశ్నలు వేస్తూ వెంటనే ఆన్సర్ చెప్పమని అడిగితే వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు లేదా కంగారులో తడబడతారు.
(17:15) ఉదాహరణకు మీరు ఒకరిని నిన్న నైట్ నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు వాళ్ళు వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు ఆలోచిస్తూ అటు ఇటు దిక్కులు చూస్తున్నారంటే మైండ్లో ఒక అబద్ధాన్ని రెడీ చేస్తున్నారని అర్థం. అదే నిజం చెప్పేవాడైతే ఏమాత్రం తడుముకోకుండా క్లియర్ గా ఆన్సర్ ఇస్తాడు. అందుకే ఎవరి మీదైనా డౌట్ వస్తే అకస్మాత్తుగా ఒక క్వశ్చన్ వేసి వెంటనే సమాధానం చెప్పమని ప్రెజర్ చేయండి.
(17:41) దాంతో వాళ్ళలో టెన్షన్ పెరిగి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న జాగ్రత్త. కొన్నిసార్లు నిజం చెప్పే వాళ్ళు కూడా ఆలోచించడానికి టైం తీసుకుంటారు. ముఖ్యంగా ఆ విషయం చాలా పాతదైనా లేదా ఆ వ్యక్తి బాగా అలసిపోయి ఉన్నా ఆన్సర్ ఇవ్వడానికి కాస్త టైం పట్టొచ్చు. కాబట్టి కేవలం దీన్ని బట్టే డిసైడ్ అవ్వకుండా మిగతా రూల్స్ కూడా చెక్ చేసుకోండి.
(18:02) దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అనవసరమైన సోది చెప్పడం అబద్ధం చెప్పేవాళ్ళు తమ కథను నిజంలా నమ్మించడం కోసం అడగని విషయాలను కూడా తెగ చెప్తుంటారు. అసలు ప్రశ్నకు సంబంధం లేని చిన్న చిన్న వివరాల అన్నింటిని లాగుతారు. ఉదాహరణకు మీరు నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే వాళ్ళు నేను మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఒక రెడ్ కలర్ కార్ చూశాను.
(18:25) అంతలోనే సడన్ గా వర్షం పడింది. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ కలిసాడు అంటూ సంబంధం లేని డీటెయిల్స్ ఇస్తారు. అదే నిజం చెప్పేవాడైతే సింపుల్ గా నేను మార్కెట్ కి వెళ్ళాను అని చెప్తాడు. అంతే అబద్ధం చెప్పేవాళ్ళు తమ మాటల్లో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇరికిస్తారంటే వినేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు క్వశ్చనే మర్చిపోవాలి అనేది వాళ్ళ ప్లాన్. ఇది కూడా అబద్ధానికి ఒక పెద్ద సైన్.
(18:48) కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొంతమందికి మామూలుగానే ప్రతి విషయాన్ని సాగదీసి డీటెయిల్డ్ గా చెప్పే అలవాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళ పాత అలవాట్లను కూడా మైండ్ లో పెట్టుకోండి. ఒకవేళ ఎప్పుడు షార్ట్ గా మాట్లాడే వ్యక్తి సడన్ గా కథలు కథలుగా చెప్తుంటే మాత్రం కచ్చితంగా అలర్ట్ అయిపోండి. ఏడవ సూత్రం మీ అంతరాత్మను నమ్మండి.
(19:10) మనందరికీ ఒక సిక్స్త్ సెన్స్ లేదా మనందరికీ అంతరాత్మ అనే ఒక సహజమైన ఆలోచన ఉంటుంది. ఎవరైనా మనతో అబద్ధం చెప్తున్నప్పుడు ఏదో తేడా కొడుతోంది. వీడు చెప్తున్నది కరెక్ట్ కాదు అని లోపల నుండి మన మనసు ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంది. ఆ ఇన్నర్ వాయిస్ ని ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. ఎవరైనా మీ కళ్ళలోకి చూసి నేను చెప్తున్నది 100 శాతం నిజం చెబుతున్నాను అని అన్నప్పుడు మీ మనసులో ఎక్కడో ఒక చిన్న డౌట్ వస్తుందంటే కచ్చితంగా ఆ ఫీలింగ్ ని పట్టించుకోండి.
(19:36) ఎందుకంటే అవతలి వ్యక్తి ముఖం వాళ్ళ ప్రవర్తన మాటలు మరియు సిచువేషన్స్ వీటన్నింటిని గమనించి మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఇస్తున్న సీక్రెట్ హింట్ అది. మీరు మీ లైఫ్ లో ఈ రూల్స్ అన్నింటిని ఫాలో అయితే చాలా తక్కువ టైంలోనే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే తేడాని చాలా ఈజీగా కనిపెట్టేస్తారు.
(19:59) ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో సరికొత్త టాపిక్ తో కలుద్దాం.
(20:20) అంతవరకు సెలవ్ థాంక్యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జై హింద్.

No comments:

Post a Comment