Monday, June 29, 2026

 *జేబులోడబ్బులు లేకపోయినా.... నీకు ఏం కావాలిరా అని అడిగే దమ్మున్న ఒకే ఒక్క రాజు...నాన్న...*

నాన్నకు స్వార్థం ఎక్కువ....

తన ప్రతి రూపం నింగిపై విహరించాలని.... 

నాన్నకు అహంకారం....

తన త్యాగాలను దాచి పెట్టి గంభీరత్వం ప్రదర్శించడం....

నాన్నకు ఆత్మాభిమానం.....

తన పిల్లలు ఎవ్వరి వద్దా చేయిచాచకూడదని.....

పిల్లల వంతు కష్టాలు తనే అనుభవించాలను కుంటాడు....

తన జీవితం ధారపోసిన పిల్లలు తమ స్వార్థం కోసం తనను వృధ్ధాశ్రమాలలో ఉంచినా చిరునవ్వుతో భరిస్తాడు. ఎన్నో సంద్రాలను కన్నుల వెనుక దాస్తాడు. 

తీరం చేరని కెరటంలా శూన్యంలో మిగిలిపోతాడు. ఆ ప్రభాసుని కాంతిలో తాను వెలుగై ఉంటాడు. విరిసే పూవులలో సుగంధ పరిమితమై వ్యాపిస్తాడు. 

ప్రకృతిలో వసంతమై పరవశిస్తాడు. ప్రతి పిల్లలకు తండ్రి ఆదిదేవుడు. గరళం తనలో నింపుకున్న శివుడు. నాన్నే మనకు ఆదర్శం.
 
నాన్న గొప్పతనం వెలకట్టలేనిది.. కోపంలో బాధ్యత.. మాటల్లో ప్రేమ
నాన్న తన పిల్లల ఎదుగుదల కోసం కష్టపడే వ్యక్తి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనివి. 

నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. 

తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది.  అమ్మ తొమ్మిది నెలలు మోసి జన్మనిస్తే.. 

నాన్న తన జీవితమంతా పిల్లలను మోస్తాడు. నిస్వార్థ ప్రేమతో గుండెల మీద ఆడుకుంటూ జీవితానికి మార్గం చూపే మార్గదర్శి తండ్రి.  

చాలామందికి నాన్న అయిన తరువాతనే  నాన్న విలువ ఏంటో తెలుస్తుంది.  మా నాన్న  ఇన్ని బాధలు, బాధ్యతల్ని ఎట్లో మోశాడు? పిల్లలు చేసే అల్లరి, వాళ్లకు కొంచెం సుస్తీ చేసినా గుండెలో అలజడి! ఇవన్నీ ఎట్లా భరించాడు? అని నాన్న అయినతరువాతనే ప్రశ్నించుకుంటారు. అప్పుడే అర్ధమవుతుంది. .. 

నాన్న వేసిన బాటలో నా అడుగులు పడుతున్నాయని ...  ఆ టైంలో నాన్న వైపు చూస్తే.. నా పిల్లల కోసం ఆ గ్రేట్ మ్యాన్ ఇప్పుడు తాతగా మారాడు. చిన్నపిల్లాడిలా వాళ్లని ఆడిస్తున్నాడు. 

కథలు చెప్తూ బుద్ధులు నేర్పుతున్నాడు. తన బిడ్డకు కష్టం రావొద్దని.. మళ్లీ నా కష్టాన్ని పంచుకుంటున్నాడని అనిపిస్తుంది.  ఇదే నాన్న గొప్పతనం.. 

జీవివితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో!  ఈ ముచ్చట ప్రపంచానికి తెలియదు కాని ...  ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు. ఎవరి నాన్న వాళ్లకు గ్రేట్! చిన్నప్పుడు స్కూల్లో...  

మా నాన్న సూపర్ హీరో ...అంటే ...మా నాన్న సూపర్ హీరో.... పోటీపడి కథలు చెప్పుకున్నారు కదా..మీరు .. మీ స్నేహితులు.  మా నాన్నకు మస్తు బలం ఉంటదిరా భయ్..

No comments:

Post a Comment