Monday, June 29, 2026

వివాహం మనిషిని మార్చదు. బైట పెడుతుంది Marriage Doesn't Change You... It Reveals You

వివాహం మనిషిని మార్చదు. బైట పెడుతుంది Marriage Doesn't Change You... It Reveals You

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_9ddp7xdd70



Transcript:
(00:00) ఈ మధ్యకు వివాహాలకు సంబంధించిన వీడియోల మీదే మనసుపోతున్నదండి ఎందుకంటే సమాజం అలా ఉందన్నమాట ప్రేమించుకుంటున్నారు తల్లిదండ్రులకు చెప్పట్లేదు తల్లిదండ్రులు ఏదో సంబంధాలు కుదురి చేస్తున్నారు ఈ లోపల అవి హత్యల దాకా వెళ్ళిపోతున్నాయి. కదా అసలు భారతీయ సంస్కృతిని నిలబెట్టింది ఏదైనా ఉంది అంటే వివాహ వ్యవస్థ అండి ఒకప్పుడు మనం గొప్పగా చెప్పుకున్నాము ఈరోజు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామ అన్నమాట దాదాపు 50 పైగా విడుదల చేశనండి కనీసం కొంతమంది అన్నా ఆలోచిస్తారేమో అన్న ఆశ అంతకంటే ఏం లేదండి సరే విషయానికి నేను వచ్చేస్తాను
(00:47) ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు లేదా పెద్దలు కుదిరిచ్చిన పెళ్లే చేసుకుంటారు కానీ చాలామంది ఆడమగా పెళ్లియన తర్వాత ఎందుకో అనేక అసంతృప్తుల కారణంగా విడాకులు ఆలోచన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు కానీ మరి ఈ విషయం మీద నేను కొంచెం శ్రద్ధ వహిస్తున్నాను కాబట్టి నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి అసలు వీళ్ళలో ఏం జరుగుతున్నది వీళ్ళలో వ్యక్తిత్వ లోపమా లేకపోతే అసలు పెంపకంలోనే లోపం ఉందా లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ గతాన్ని తలుచుకొని మన పిల్లలు ఎలా ఉండకూడదు అని ఏమన్నా మరి
(01:32) ఆలోచిస్తున్నారా లేకపోతే సోషల్ మీడియా వల్ల సమాచార విజృంబణ వల్ల ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా లేకపోతే పిల్లల్లో ఉన్నది ప్రేమ కాదు మోహమా లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా టూ మచ్గా ఉన్నాయా అది కూడా కాకుండా నాకు అక్కడక్కడ వినిపిస్తున్నది ఏంటంటే చాటు మాటు వ్యవహారాల తర్వాత ఇంతే కదా అని అనుకోవటమా అసలు ఆ మాటక వస్తే స్వార్థంతోనే వైవాహిక జీవితంలో ప్రవేశిస్తున్నారా అన్న అనుమానం కూడా కలిగిందండి ఎందుకంటే అక్కడక్కడ మనం YouTube లో వాటిలో చూస్తూ ఉంటే ఏదో ఒక స్వార్థంతోనే
(02:16) వివాహ జీవితంలో అడుగు పెట్టడం తర్వాత అల్లరిగేయటం వాళ్ళకి కావాల్సిన తీసుకొని పోవటం కదా సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు ఏ విషయాలు మాట్లాడుకోవాలో ఆ విషయాలు మాట్లాడుకోకుండా ఆవేశంతో పెడిలోకి దిగిపోవడం అసలు ఏం జరుగుతుంది అది అన్నది ఈ వీడియోలోని విశ్లేషణ అండి జనరలైజ్ చేయకూడదండి ఎందుకంటే అందరూ అట్లాగే ఉంటారని మనం ఎప్పుడ అనుకోకూడదు కూడా వీలైనంత వరకు బాలెన్స్డ్ గా చెప్తేనే బెటర్ ఇటువంటి విషయాలు లేకపోతే చాలా మందికి కోపాలు వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే అందరు ఆడవాళ్ళు అందరూ మగవాళ్ళు కూడాను అలాగే ఆలోచిస్తారు అని అనుకుంటే అది చాలా
(02:59) పెద్ద తప్పండి. అంటే ఇప్పుడు మనం వివాహ సంక్షోభం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే రెండు వైపులా ఉండే మానసిక సామాజిక వ్యక్తిత్వ అలాగే ఆర్థిక అంశాల కలయకండి డైరెక్ట్ గా చెప్పాలి అంటే విడాకులకి కారణం పెళ్లి కానే కాదండి పెళ్లికి దారి తీసిన మనస్తత్వమే అంతకంటే ఏం లేదండి ఇప్పుడు ప్రేమలో పడేటప్పుడు ఒకరికొకరు నిజంగా అంతర్గతంగా చూస్తారు బాహ్య సౌందర్యాన్ని చూసుకుంటుంటారు ఊహలో విహరించేస్తూ ఉంటారు.
(03:44) అసలు ఈ ప్రేమలో పడ్డప్పుడు ఈ మెదడు ఉంది చూశారా అది కొన్ని లోపాల ఎట్టి పరిస్థితిలో కూడా పట్టించుకోదండి పెళ్లి తర్వాత మాత్రమే అవి బయట పడుతూ ఉంటాయి అన్నమాట బాధ్యతలు కానివ్వండి డబ్బు కానివ్వండి కుటుంబం పిల్లలు ఉద్యోగం అత్తమామలు అసలు సమయం కేటాయించడం ఇవన్నీ కూడాను తర్వాత తర్వాత మెల్లగా అర్థమవుతాయి. అయితే వీటి గురించి డిస్కస్ మరి ముందు ఎందుకు చేసుకోరు అంటే చెప్పాను కదా అది యాక్చువల్ గా ప్రేమ కాదండి మోహం అంతే ఊహలో వేరే చేస్తూ ఉంటారు.
(04:17) తర్వాత తర్వాత వైభవాగి జీవితంలో జరిగిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నేను ఈ వ్యక్తినే ప్రేమించానా అని కానీ వాస్తవం [గొంతు సవరించుకోవడం] ఏమిటంటేనండి వ్యక్తి మారలేదండి ఊహలు కరిగిపోయాయి అంచనాలు తారుమారయ్యాయి. ఎందుకయ్యాయి పెళ్లికి ముందు ఉన్న ప్రేమలో బాధ్యత లేదండి అసలు ఆ మాటక వస్తే అది ప్రేమే కాదు ప్రేమ అనేది ఒక భావోద్వేగం అండి వివాహం అనేది ఒక బాధ్యత ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
(04:53) ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఉంటున్న యువతలో ఈ ప్రేమలో బాధ్యత ఉండటం లేదండి ఊహలు ఉంటున్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి వివాహాల తర్వాత ఉండాల్సింది నిజంగా చెప్పాలి అంటే ప్రేమతో కూడిన బాధ్యత అసలు శితలైన ప్రేమ ఏదన్నా ఉంది అంటే అది వివాహం తర్వాత మొదలు కావాలండి అది అంతకుముందంతా ఏదన్నా ఉంటుంది అంటే అర్థం చేసుకోవడమే ఒకళ్ళనఒకళ్ళు అర్థం చేసుకోవడమే ఇప్పుడున్న స్పీడ్ ప్రపంచంలో ఒక పట్లాగా లేదండి పరిస్థితి వైవాహిక జీవితంలాగా అడుగుపెట్టి దాన్ని అర్థవంతంగా చేసుకోవాలి అంటే ఓ సంవత్సరం పాటన్నా మాట్లాడుకోవాలి.
(05:36) ఎక్కడో ఒకచోట అభిప్రాయ భేదాలు వచ్చాయి అనుకోండి మౌలిక అంశాల మీద అప్పుడు దూరం జరగటం కూడాను మంచి విషయమే మంచి విషయమే ఈ విషయంలో యువత ఎందుకో శ్రద్ధ తీసుకోవట్లేదండి ఇప్పుడు ఈ ప్రేమలో ఏం మాట్లాడుకుంటారు నువ్వు లేకపోతే నేను లేను ఐ లవ్ యు వెరీ సిన్సియర్లీ అసలు నువ్వే ప్రపంచాన్ని నాకు [నవ్వు] ఇలా ఉంటుంది వ్యవహారం కానీ పెళ్లి తర్వాత బాధ్యతతో ఉండవలసిన విషయాలు ఏంటండి అంటే పెళ్లికి ముందు కూడా ఉండాలి.
(06:10) ఎప్పుడైతే అసలు శసలైన ప్రేమ కాదో అది ఇన్ఫాక్చుయేషన్ పెళ్లి తర్వాత చాలా విషయాలు వస్తాయి పెళ్లి ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ వస్తాయి. అవేంటంటే పిల్లల్ని ఎప్పుడు వినాలి వాళ్ళ చదువులు ఏంటి ఈఎంఐలు ఎవరు కట్టాలి అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు తల్లిదండ్రుల బాధ్యత మరి ఏంటి అసలు ఇంటి పనులు ఎవరు చేయాలి పొదుపు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడాను ఈ ఇన్ఫాక్షస్ అనే ప్రేమతో పెళ్లి చేసుకున్న తర్వాత బయట పడిపోతూ ఉంటాయి నేను ఏమంటానంటే వీటన్నిటిని ముందే డిస్కస్ చేసుకోవాలంటే అట్లాగే కరీర్ డెవలప్మెంట్ కూడాను కరీర్ డెవలప్మెంట్ గన ఇది ఎక్కడా జరగట్లేదు అసలు అంటే జరిగే
(06:48) పరిపక్త కూడా లేదండి లేదు ఇంకొక విషయం నేను బాగా గమనించింది ఏంటంటే అంటే వింటున్నది కూడా ప్రస్తుత ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో దురదృష్టవశాత్తు ఆడపిల్లలకి ఒకటి నూరి పోస్తున్నారండి తల్లిదండ్రులు అదేంటంటే నువ్వు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అని పెళ్లి చేస్తున్నారు కానీ భవిష్యత్తుపై వాళ్ళక కూడా నువ్వు భరోసా ఉండటంలేదు.
(07:13) ముఖంగా ఆడపిల్లలు పేరెంట్స్ అన్నమాట నువ్వు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి రేపు పొద్దున ఏదైనా జరగొచ్చు జరిగినప్పుడు మరి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా అని అంటున్నారు. ఏ ఇది నిజంగా చూడండి ఆలోచించండి ఎంత ప్రమాదకరమైన విషయం పురుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏం జరుగుతున్నది అంటే అంటే అక్కడక్కడ లేండి మనం చెప్పాను కదా మొట్టమొదట్లో ఏది జనరలైజ్ చేయకూడదుని భార్య సంపాదన అయితే నువ్వు ఎట్లైనా ఎంజాయ్ చేయాలిరా కానీ వాడు మట గుర్తుపెట్టుకో డెసిషన్ మేకింగ్ మీదే ఆడవాళ్ళకి ఇచ్చావా నువ్వు పప్పెట్ట అయిపోతావ్ అని చెప్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారండి
(07:48) ఇక్కడే ఘర్షణ స్టార్ట్ అవుతున్నది. అంతే సో జెండర్ ఇస్ నాట్ ది క్రైటీరియా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇస్ ది హాల్మార్క్ ఆఫ్ హ్యాపీ మరీడ్ లైఫ్ నీ డబ్బు నా డబ్బు కాదండి మన డబ్బు అంటే పరస్పర అవగాహన చాలా ముఖ్యంండి ఇది ఏ మాత్రం అనటం లేదు ప్రతి యువతలు అందుకనే మా అవసరం ఎక్కువగా ఏర్పడుతున్నది రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ మోటివేషనల్ స్పీకర్స్ అట్లాగే ఇన్ఫ్లయన్సర్స్ అంటున్నారు కొత్త కేటగిరీ ఒకటి బయలుదేరింది.
(08:26) అట్లాగే ఇంకో ఒక కాన్సెప్ట్ కూడా సొసైటీలో వచ్చేసింది ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి దానికి ఏదో కోర్సులు కూడా ఈ మధ్య బయటికి వచ్చాయి అంటున్నారు కానీ దాని మీద కూడా నేను దృష్టి పెట్టాలి. అట్లాగే ఇన్ఫ్లయన్సస్ ఇన్ఫ్లయన్సర్స్ కౌన్సిలర్స్ ఇటువంటి వాళ్ళందరూ వచ్చేస్తున్నారండి.
(08:46) అంటే సమాచారం పెరిగింది వివేకము డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెరగట్లేదు నేను చాలా వీడియోలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఆ వీడియోలు చూడని వాళ్ళు కనీసం ఈ మాట అన్నా వింటారేమనని పెళ్లికి ముందు కనీసం 10 15 పరస్పర కలయకలు పరస్పర చర్చలు ఉండాలండి అప్పుడే నిశ్చితార్థం గాన ప్రీ వెడ్డింగ్ షూట్స్ గన లేకపోతేనూికి 90% వివాహ లు వీగిపోయే అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్నది అదే కానీ ఇప్పుడు యువత ఒకడు గుర్తుపెట్టుకోవాలి పెళ్లి తర్వాత నేను నాది ఉండదండి [నవ్వు] మనము మనది మాత్రమే ఉంటుంది.
(09:31) ఇద్దరు గెలవడం కాదు నా మాటకు వస్తే సంబంధం గెలవాలి సంబంధం నిలబడాలి ఆ సంబంధం ఆదర్శంగా ఉండాలి నలుగురికి కూడా ఇంకొకటండి ఇక్కడ ఏంటంటే యువతలో ఆవేశం ఎక్కువ ఉంటది కదా ఆవేశంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు పెళ్లి తర్వాత కూడా మాట్లాడుకోవడం చేతన అయితే పోట్లాటలు కోట్లాటలు తగ్గుతాయండి. అప్పుడు విడాకులు ఉండవు. అసలు వివాహానికి పెద్ద శత్రువు ఏంటంటే నేనే కరెక్ట్ నేనే రైట్ అనే మనస్తత్వం అన్నమాట ఇక్కడ హూ ఇస్ కరెక్ట్ కాదండి వాట్ ఇస్ కరెక్ట్ వాట్ ఇస్ కరెక్ట్ అవసరమైతే మోమాటం లేకుండా మిత్రులతోనో పెద్దవాళ్ళతోనో
(10:18) డిస్కస్ చేయాలి ఏదనా సమస్య వచ్చినప్పుడు జరగట్లేదు. ఎవరి వాళ్ళు అహానికి పోతున్నారు. హక్కులతో సంబంధాలు నిలబడవండి బాధ్యతలు నిర్వర్తిస్తేనే సంబంధాల్లో విశ్వాసం పెరుగుతుంది. మనం వాడు గుర్తుపెట్టుకోవాలి పెళ్లి ఎప్పుడు వ్యక్తిని మార్చదు ఉన్న అసలు శసలైన వ్యక్తిత్వాలు ఏదనా ఉంటే మంచివి గాని చెడువి గాని అవి బయట పడిపోతాయి.
(10:47) స్వార్ధపరుడు అయితే స్వార్థం బయటపడుతుంది. సహనపరుడు అయితే సహనం బయటపడుతుంది. అబద్ధాలు చెప్పేవాడైతే అబద్ధాలు బయటపడతాయండి. ఆ నేను కూడా చాలా సీరియస్ గా ఆలోచించాను నాకు అర్థమయింది అంటే ఈరోజు ఇవతకి పెళ్లి అంటే భయం కాదండి పెళ్లి అంటే భయం లేదు కానీ వాళ్ళ భయం ఏంటంటే ఎటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చేస్తాడు.
(11:12) ఎటువంటి అమ్మాయి వస్తుందో తప్పుడు వ్యక్తిని ఏమనా ఎంచుకుంటున్నావేమో అన్న ఒక భయం ఉందంటే ఈ భయాన్ని తక్కించేది ఎట్టి పరిస్థితిలో కూడాను ప్రేమ కాదు పరిపక్వత అంటే విజయవంతన వివాహం అంటే ఇద్దరూ ఎప్పుడూ ఒకేలా ఆలోచించడం కాదండి విభేదాలు వచ్చినా సంబంధాల్ని కాపాడుకో మనం అని నిర్ణయించుకోవడమే అంతకంటే ఏం లేదు ఇప్పుడు జీవితం అన్న తర్వాత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి ఆ చిన్న విషయాలను కూడా నువ్వు క్షమించలేకపోతే ఏం జరుగుతుందంటే ఆ బంధం నిలబడదు కదా చచ్చిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి భర్త ఆఫీస్
(11:57) నుంచి వచ్చాడు రెగ్యులర్ గా ఉండవలసిన భార్య లేదు పక్క ఫ్లాట్ లో ఉంది వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది పాపం ఆదుకుందాం అని వెళ్ళింది. దాన్ని కూడా భర్త ఇష్యూ చేసేస్తే ఎలాగా నువ్వు హాయిగా కిచెన్ లోకి వెళ్లి ఓ టీ పెట్టేసి క్లాస్ లో వేడి వేడి టీని పోసి భార్య కోసం ఎదురు చూడొచ్చు కదా సింపుల్ సింపుల్ విషయం నేను చెప్తున్నాను అంటే మీకు తెలుసో లేదో అంటే ప్రేమ కంటే గౌరవం అనేది ఎక్కువ కాలం నిలుస్తుందండి ప్రేమకి గౌరవానికి చిన్న తేడా ఉంది అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కువ భాగం ప్రేమ ఎప్పుడు కూడాను ఇష్యూ బేస్డ్ గా ఉంటుంది.
(12:37) గౌరవం అలా కాదండి ఒక్కసారి గనుక గౌరవం ఏర్పడితే అది ఎలా ఉంటుందంటే అది టోటల్ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అది ఇప్పుడు ఒక పొరపాటు చేస్తే 10 ఒప్పులు గుర్తుకు తెచ్చుకొని సర్దుకు పోవటమే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇచ్చే గౌరవం అంతే ఇప్పుడు తప్పులు చేయడం సహజమేనండి కానీ నేను చేస్తున్న ఈ తప్పులన్నీ ఒకప్పుడు చేసిన ఒప్పుల ఆధారంగా వచ్చినవే కదా సారీ సారీ సారీ ఇక్కడఏదో పొరపాటు జరుగుతున్నది.
(13:18) ఆ తప్పులు చేయడం సహజమే అసలు ఒప్పులన్నీ ఆ తప్పుల ద్వారా నేర్చుకున్నవే కదా అని మనకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది అసలైన ససలైన గౌరవాన్ని ఇవ్వడం అంటే అంటే ఇచ్చి పుచ్చుకునే గౌరవం మీదనే ఈ వివాహం అనేది నిలబడుతుందండి. ఇప్పుడున్న వాతావరణం ఎట్లా ఉందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడాను ఆ మాటక వస్తే పిల్లల నుంచి కూడా ఎలా ఉందంటే వివాహం అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒప్పందం లాగా ఉందండి నిజంగా మాట్లాడితే ఇది ఒప్పందం కాదండి.
(13:53) అదిఒక ఒప్పుకోవాలిఅన్నమాట అంటే నిజాయితితో కూడిన ఒప్పుకోలు అంటే ఇట్స్ నాట్ ఆన్ అగ్రీమెంట్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ కాన్సెంట్ ఇప్పుడు మంచి జీవిత భాగస్వామిని దొరకడం నిజంగా అదృష్టం కావచ్చు నేను కాదన్నా కానీ మంచి జీవిత భాగస్వామిగా మారటం మార్చుకోవడం అనేది మడుకు మన చేతుల్లోనే ఉందండి అది ఓపిక మీద ఆధారపడింది. అది గుర్తుపెట్టుకోవాలి.
(14:20) పెద్దవాళ్ళం ఎన్నో మంచి మాటలు చెప్తున్నాం కానీ అసలు యువతక ఎక్కుతున్నాయో లేదో మాకు తెలియట్లేదు. అట్లాగే విజయవంతమైన వివాహం అంటే గొడవలు పడవకపోవడం కాదు గొడవ పడ్డ తర్వాత కూడా దాన్ని తాటాకు మంటలా మర్చిపోయి చలిమంటల దగ్గర చలికాచుకుంటూ నిప్పులు పడుతున్న లేవకుండా ఉండటం అదండి అది విజయవంతమైన వివాహం అంటే [నవ్వు] నేను ఇందాక చెప్పినట్టుగా వివాహాన్ని నిలబెట్టేది ప్రేమ కాదండి కేవలం పరిపక్వతే ఆ పరిపక్వతను నిలబెట్టేది కూడా నువ్వు అహంకారం కాదండి సర్దుకుపోయే మనస్తత్వం సర్దుకుపోయే మనస్తత్వం అంటే వినయంతో కూడుకున్నది అన్నమాట మళ్ళీ ఆ వినయాన్ని నిలబెట్టేది భయం కాదు
(15:05) కొంతమంది భయంతో వినయంగా ఉంటూ ఉంటారు కాదు అది మ్యూచువల్ రెస్పెక్ట్ ద్వారా వస్తుందన్నమాట ఎక్కడైతే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో అక్కడ అసలు శిశులైన ప్రేమ నిలబడుతుందండి కుటుంబాలు నిలబడతాయి తద్వారా సమాధానం నిలబడుతుందిన్నమాట సో ఇదండి వీడియోలోని సంగతి నేను చాలా స్లోగా మెల్లగా చెప్పే ప్రయత్నం చేశాను. చూద్దాంండి యువతకు గనుక వెళితే యువత ఆలోచిస్తుందేమో చూడాలి.
(15:33) సో ఇదండి వీడియోలో సంగతి వీనంద కృతజ్ఞతలు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 లైక్ బటన్ బెల్ ఐకాన్ మీరు ఎటు నొక్కుతారో నాకు తెలుసు కాకపోతే ఒక చిన్న రెస్పెక్ట్ రిక్వెస్ట్ ఏంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ పెట్టండి అంతే నమస్కారం

No comments:

Post a Comment