కామాఖ్య ఆలయం గురించి ఇలాంటి వీడియో చూసుండరు | Kamakhya Magnum Opus | Nanduri Srinivas
Author Name:Nanduri Srinivas - Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x1sigD2YWTc
Transcript:
(00:05) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మహా శక్తిపీఠం శక్తిపీఠాలు అన్నిటిలోకి ఉత్తమోత్తమమైన స్థానం నాత పరతరం స్థానం త్వచిదస్తి ధరాతలే అని పరమేశ్వరుడు పురాణంలో ఎన్నిసార్లు చెప్పాడు అంటే ఇటువంటి శక్తిపీఠం ఇంకా ధరాతలం భూతలం మీద లేదు అని పరమేశ్వరుడు చెప్పాడు మనిషి ఏ కామ్యంతో అయినా అక్కడికి వెళ్లి చిత్తశుద్ధితో సాధన చేస్తే అమ్మవారు నెరవేర్చి తీరుతారు ఇంకా సందేహం లేదు మరి ఏ కోరిక లేకుండా సాధన చేస్తే మోక్షాన్ని కూడా ఇవ్వగలరు అంతటి క్షేత్రం అది ఛానల్ పెట్టినప్పటి నుంచి వేల మంది
(00:46) అడిగారు ఈ క్షేత్రం గురించి చెప్పండి క్షేత్రం గురించి చెప్పండి అని చివరికి మొన్న ఈ మధ్య అమ్మవారి దయవల్ల గ్రహణం వచ్చింది కదా కొన్ని నెలల క్రితం అక్కడికి వెళ్లి గ్రహణ సమయంలో సాధన చేసే అవకాశం అమ్మవారు ప్రసాది సాధించారు అప్పుడే అక్కడంతా పరిశోధన చేసి ఆ క్షేత్ర రహస్యాలన్నీ పడించి అమ్మవారి దయవల్ల చెప్పుకుందాం.
(01:08) ఇంతకీ ఏ క్షేత్రం అండి అది ఇంకే క్షేత్రం కామాక్షి క్షేత్రం సరే ఇంతకీ ఆరుఏడు నెలలు అయింది కెమెరా ముందుకువచ్చి పాపం చాలామంది దండూరి గారు వీడియోలు చేయట్లేదు ఏమిటండి అని ఛానల్ అడ్మిన్ కి మెయిల్స్ మెసేజెస్ పంపుతూనే ఉన్నారట అది మీ ప్రేమకి నిదర్శనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుకుందాం అసలు ఊపిరి సలపకుండా తిండి నిద్ర లేకుండా చేసింది బట్ అమ్మవారి దయవల్ల ఇప్పుడంతా సక్సెస్ఫుల్ గా పూర్త అయిపోయింది ఇక నుంచి మళ్ళీ మనం వీడియోలన్నీ వచ్చేస్తాం సరే ఇప్పుడు ఇంతకీ కామాక్షి విషయానికి వస్తే పరమేశ్వరుడు పురాణంలోనే ఇంకొక చోట నాతఫ్ పరతరం స్థానం కామాక్ష్య యోని మండలం అని చెప్పాడు.
(01:46) కామాక్షి అనగానే ఎవ్వరికేనా యోని పీఠం పంచబలు అమ్మవారు రజస్వల బ్రహ్మపుత్ర నీళ్లు ఎర్రగా మారడం పంచమకారాలు ఎవ్వరిని అడగండి ఇవే చెప్తారు అక్కడ ఎన్నో రహస్యాలు ఉపాసనా మర్మాలు దివ్య కుండాలు గుహలు అపూర్వమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి అలాగే YouTube లో చెప్పే వాటిలో కొన్ని నిజాలు చాలా అబద్ధాలు కూడా ఉన్నాయి అవన్నీ ఇక్కడి నుంచి వీడియోల్లో చెప్పుకుందాం వీటికి పురాణాలు తంత్రశాస్త్రం చరిత్ర త్ర అవన్నీ ఆధారం చేసుకుని ప్రామాణికతతో చెప్పుకుందాం.
(02:22) అది ఇది మనం చేస్తున్న యజ్ఞం కాదు అమ్మవారు చేయించుకుంటున్న యజ్ఞం సరే అసలు మొట్టమొదట కామాక్షలో ఏ ఆలయం గురించియనా అర్థం కావాలి అంటే దాని వెనక ఉన్న పురాణ కథ చరిత్ర ఏమిటో తెలియాలి ఆ చరిత్రకి ఆ పురాణ కథకి ఇప్పటికీ అక్కడ చాలా ఆలయాలు సాక్షాలుగా ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఈ వీడియోలో అదంతా చెప్తాను ఒక 30 నిమిషాలు పడుతుంది కానీ ఓపిగ్గా వినండి చాలా అద్భుతమైన వీడియో అసలు మీరు ఎక్కడ విని ఉండరు కామాక్షి గురించి ఇవన్నీ సరే అసలు కామాక్షి అమ్మవారి యోని పీఠం ఎలా వచ్చిందండి అంటే అంటే ఎవ్వరిని అడగండి ఏముందండి దక్షయజ్ఞం సంఘటన వల్ల అంటారు కాదు సృష్ట్యాదిలో ఇంకొక సంఘటన జరిగింది
(02:58) ఇది యోగిని తంత్ర శాస్త్రంలో ఉంది. ఏమిటి అంటే సృష్ట్యాదిలో బ్రహ్మగారు సృష్టి చేశక ఒకసారి అహంకరించారట ఆహా నేను కాబట్టి ఈ సృష్టి అంతా చేయగలిగాను ఇవన్నీ నా చేతే సృష్టింపబడినవి అని అప్పుడు అమ్మవారు నవ్వుకొని కేశి అనే ఒక రాక్షసిని తన శక్తిలోంచి సృష్టించారు. సృష్టిస్తే ఆ రాక్షసుడు పెద్దవాడైపోయి ఆ కేసి శక్తి వచ్చి బ్రహ్మగారినే మింగేయపోతే బ్రహ్మగారు పారిపోయారు.
(03:25) ఆయన మొట్టమొదట ఆశ్చర్యపోయారు ఇదేమిటి నేను సృష్టించలేదు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ తర్వాత వాడు ఏం చేసాడు కేశీపురం అని ఒకటి నిర్మించి బ్రహ్మని చంపండి అని చెప్పి జనాలందరిని రాక్షసులని పంపించాడు పంపించేసరికి బ్రహ్మగారికి అర్థం కాలే అమ్మ బాబోయ్ నా సృష్టి కాని దాంట్లో నాకన్నా శక్తిమంతమైనది ఒకటి ఉంది అని అప్పుడు తెలుసుకున్నారు అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్తే అందరూ కలిసి కాళికాదేవి దగ్గరికి వెళ్తే అమ్మవారు చెప్పారు నీ అహంకారమా ఇదంతా నీ వల్ల వచ్చింది అనుకుంటున్నావా భువనాలన్నీ వచ్చి వచ్చింది శక్తి నుంచి నీ నుంచి కాదు ఆ శక్తే నీకు అవన్నీ చేసి
(03:58) సృష్టించే శక్తిని ఇచ్చింది. అందుకని నీ పాప ప్రక్షాళనకు ఏం చేస్తావ అంటే ఒక పర్వతాన్ని నిర్మించి దాని పైన ఒక యోని మండలాన్ని నిర్మించు ఆ యోనే సృష్టికి ఆది అని చెప్తే అప్పుడు బ్రహ్మగారు అమ్మ అహంకరించాను క్షమించు అని చెప్పి ఒక పర్వతాన్ని ఒక యోని మండలాన్ని నిర్మించి ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా వినండి ఆ యోని మండలం దగ్గర ఎప్పుడు జీవంతో ఉండే ఎన్ని యుగాలైనా జీవంతో ఉండే ఒక జలధారని సృష్టించారు.
(04:29) సృష్టించి అప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ నన్ను క్షమించు ఆ కేసి నన్ను చంపేస్తా అంటున్నాడు అని అప్పుడు అమ్మవారు ఏమి యుద్ధం చేయలే అహుంకరించారు అంతే ఆ కేసి దెబ్బకి బూడిది అయిపోయాడు ఆ మొట్టమొదట బ్రహ్మగారు నిర్మించిన యోని పీఠమే ఆ కామాక్ష పీఠం ఈ ఆలయం ఇప్పటివరకు నాలుగు సార్లు నిర్మింపబడింది అవన్నీ ఏమిటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదట ఎప్పుడు నిర్మింపబడింది అంటే కృత యుగంలో దక్షయజ్ఞం కథ అది మీ అందరికీ తెలుసు కదా సతీదేవి ఆత్మత్యాగం చేసింది అప్పుడు పరమేశ్వరుడు తీసుకువెళ్తూఉంటే నారాయణ శక్తి వల్ల ఆ దేహం ముక్కలు ముక్కలు ముక్కల కింద అయి భారతదేశంలోన ఇంకా కొంచెం పక్కన కూడా ఆ
(05:07) భాగాలన్నీ పడ్డాయి అందులో సతీదేవి యొక్క యోని భాగం పడిందే ఈ కామాక్షి ప్రదేశం అంటే అంతకన్నా ముందే బ్రహ్మగారు ఆ యోని పీఠాన్ని ఎక్కడైతే సృష్టించారో చూడండి అమ్మవారి సంకల్పం శరీరం అంతా అలాగా చిన్నాభిన్నం అయిపోయినా సరే సరిగ్గా యోని భాగం వచ్చి ఆ పీఠం మీదే మళ్ళీ పడింది అన్ని జీవులకి మనందరికీ జన్మస్థానం ఏమిటి చెప్పండి అమ్మ యొక్క యోని కానీ అమ్మవారి యోని ఏమిటంటే సృష్టికే జన్మస్థానం మరి ఆ భాగం పడిన ప్రదేశం అంటే మామూలు శక్తి ఉంటుందా వెంటనే ఆ పర్వతం నీలం రంగులోకి మారిపోతే నీలాచలం అని పేరు పెట్టారు వెంటనే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు వీళ్ళ
(05:48) ముగ్గురు వచ్చి అమ్మో అమ్మవారి యోని మండలమే పడింది అని ముగ్గురు మూడు కొండలుగా మారిపోయారు అక్కడ అందుకే ప్రసిద్ధమైన ైన అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం ఉంది కదా లంకాయం శంకరి దేవి అందులో హరిక్షేత్రే కామరూప అంటారు. ఆ హరిక్షేత్రం ఎలా వచ్చిందఅంటే విష్ణుమూర్తి అక్కడ కొండ అయిపోయారు తత్రచ్య దేవతా సర్వాహ పర్వతాత్మకతాంగతాః అని పురాణంలో చెప్పారు దేవతలందరూ అక్కడ పర్వతాలు అయిపోయారు.
(06:16) సరే ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ సతీదేవి కథ అయిపోయాక మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల వివాహం కోసం మన్మధుడు ఒక సాహసం చేసాడు కదా పరమేశ్వరుడు మీదకే బాణాలు వేయడం అప్పుడు పరమేశ్వరుడు కంటి మంటల్లో బూడిద అయిపోయాడు ఆ తర్వాత మాడిపోయిన శరీరం ఉంటే మన్మధుడికి ఇక్కడికి వచ్చి సాధన చేసేసరికి మళ్ళీ ఆ అందాన్ని పొందాడు కాముడు రూపం పొందాడు కాబట్టి ఆ క్షేత్రాన్ని కామరూప అని పిలిచారు ఇప్పుడు అర్థమైంది కదా హరిక్షేత్రం ఏమిటో కామరూప అంటే ఏమిటో ఆ తర్వాత మన్మధుడు ఏం ఏం చేశాడంటే అయ్యో ఇంతటి యోని పీఠం నాకే అందాన్ని ఇచ్చిన పీఠం అందుకని ఇక్కడ ఒక ఆలయం కట్టాలి అని చెప్పి విశ్వకర్మ
(06:53) సహాయంతో ఆలయం కట్టించాడు అదే కామాఖ్యలో నిర్మించిన మొట్టమొదటి ఆలయం బ్రహ్మగారు సృష్ట్యాదిలో చేసినప్పుడు యోని పీఠం మాత్రమే ఉంది తప్ప ఆలయం లేదు. ఈయన నిర్మించగానే ఏమిటో తెలుసా విచిత్రంగా చతుష్యష్టి యోగిన్లు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి అయ్యో అమ్మ యోని పీఠం చుట్టూ మేము ఉండాలి అని వాళ్ళ నిజరూపాల్లో యోనిపీఠం చుట్టూ ఉన్నారు అలాగే అష్టభైరవులు ఉన్నారు ఆ తర్వాత దాన్ని ప్రాగజ్యోతిషపురము అని పిలిచేవారు ఇది మొట్టమొదటి ఆలయం మరి ప్రాగ్జ్యోతిషపురం కాస్త కామాక్ష్య ఎలా అయిందండి అంటే అది ఆ రెండో చరిత్ర తెలిస్తే అప్పుడు అర్థంవుతుంది ప్రాగజ్యోతిషపురం అనగానే ఎవ్వరికైనా ఎవరు
(07:29) గుర్తొస్తారు నరకాసురుడు అంతేనా యోని పీఠానికి రజస్వలకి ఇప్పుడు అంబు బాచ్యం జరుగుతుంది కదా రజస్వలకి నరకాసురుడికి వీట్లన్నిటికి ఒక సంబంధం ఉంది అది ఏమిటి అంటే భూదేవిని వరాహ స్వామి ఉద్ధరించాడు కదా వరాహ అవతారం ఈ కథ అంతా అందరికీ తెలుసు కదా అందులో భాగవతంలో అంతవరకే ఉంది కానీ కాళికా తంత్రంలో దాని గురించి విస్తారంగా చెప్పారు అప్పుడు ఏమైందంటే భూదేవి స్వామి యొక్క సంగమాన్ని కోరిందట వరాహ స్వామి సంగమాన్ని కానీ భూదేవి ఎప్పుడు రజస్వల దాంతో వరాహస్వామి వద్దన్నా సరే దేవి కోరితే అప్పుడు స్వామి ఆ సంగమాన్ని అనుగ్రహించారు. కాళీ తంత్రంలో అంటారు
(08:08) రజస్వలాయ గోత్రాయ గర్భ వీర్యేన పోత్రినః అని చెప్పారన్నమాట ఆ గర్భం రజస్వలగా ఉన్నప్పుడు ధరిస్తే అప్పుడు ఒక రాక్షసుడు కడుపున పడ్డాడు ఎందుకంటే చేయకూడదు కదా కానీ ఆ తల్లి చేసింది స్వామి కూడా ఇంకా అడుగుతోంది కదా అని అనుగ్రహించారు అంతే అప్పుడు ఆ రాక్షసుడు భూదేవి గర్భంలో పడ్డాడు దేవతలు ఏం చేశారు అయ్యో బాబోయ్ వరాహ స్వామి సంతానం అంటే ఎంత శక్తిమంతుడు అయి ఉంటాడు వీడు బయటికి వచ్చాడు అంటే వీడు రాక్షసుడు ఇంకా మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టేస్తాడు అని చెప్పి భూదేవికి ప్రసవం కాకుండా ఆపేసారు.
(08:43) దాంతో భూదేవి ఎంత బాధపడింది అంటే పురాణంలో రాశారు ఒక ఏనుగు పిల్ల కడుపులో ఉందనుకోండి అల్లా కల్లోలం ఎలా చేసేస్తుందో వాడు కడుపులో నుంచి అంత బాధ పెట్టేయడం మొదలు పెట్టాడు మొట్టమొదట తల్లిని బాధ పెట్టాడు తర్వాత ప్రపంచాన్ని బాధ పెట్టాడు. నా అంత మహావిష్ణువు దగ్గరికి వెళ్లి స్వామి బాధ భరించలేకపోతున్నాను దేవతలందరూ ప్రసవం కాకుండా ఆపుతున్నారు మీరు ఆ ప్రసవం అయిపోనివ్వండి అంటే అప్పుడు స్వామి ఇప్పుడు కాదు నేను కిందకి దిగివచ్చి రావణ వధ చేస్తాను కదా ఆ తర్వాత నీకు బిడ్డ జన్మిస్తాడు అని స్వామి చెప్పారు అంటే భూదేవి నేను భరించలేను బాబోయ్ ఇప్పుడు ఎక్కడ కృతయుగంలో ఉన్నావు ఇంకా త్రేతా యుగం
(09:16) వరకు ఆగాలా చివరి వరకు అంటే అప్పుడు స్వామి భూదేవి నాభిని శంఖంతో తాకి నీకు ఇంక నుంచి గర్భధారణ వేదన ఉండదు అని వరం ఇస్తే అక్కడినుంచి అమ్మవారికి అసలు ఆ వేదన ఏమీ లేదు కానీ గర్భంతోనే ఉన్నారట ఎప్పుడు కృతయుగంలో వరాహ స్వామి ద్వారా వచ్చిన గర్భం త్రేతా యుగంలో రావణ సంహారం కూడా అయ్యాక అప్పుడు అమ్మవారు ప్రసవిస్తే నరకాసురుడు బయటపడ్డాడు ఆ తరువాత పురాణం ప్రకారం అయితే జనకుడి దగ్గర కొంతకాలం ఉన్నాడు నరకాసురుడు అప్పుడు భూదేవి ఎవరో చెప్పకుండా జనకుడి దగ్గర తానే ఒక దాసి కింద ఉంటూ ఆ కొడుకుని పెంచుకుంది చివరికి 16 ఏళ్ళు అయ్యేసరికి ఏమైందంటే తపస్సుకి
(09:56) తీసుకువెళ్తాను ఇంకా వయస్సు వచ్చింది ఎందుకంటే 16 ఏళ్ళు వచ్చేసరికి పిల్లల్ని సరైన సాధనా మార్గంలో పెట్టగలిగితే జీవితాంతం ఇంకా ఆ మార్గంలోనే ఉంటారు. అప్పుడు ఏం చేసిందంటే గంగా తీరానికి వారణాసి దగ్గరికి తీసుకుపోయి అక్కడ శ్రీ మహావిష్ణువుకి తీవ్రమైన తపస్సు చేయించింది. చేస్తే అతను కూడా బ్రహ్మాండమైన తపస్సు చేశాడు చేసేసరికి అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయి ఏం కావాలి నాయనా అంటే స్వామి నేను స్థిరపడాలి నాకు రాజ్యం అవన్నీ కావాలి అని అడిగాడట అడిగితే సరే అయితే గంగలో ముంచి వాళ్ళిద్దరిని నేను జలమార్గంలో ఇందాక ప్రాగ్జ్యోతిష్యపురం ఉంది అక్కడికి
(10:31) తీసుకొచ్చి పెట్టారు స్వామి అలాగా ప్రాగజ్యోతిష్యపురానికి నరకాసురుడికి అలాగే నేను చెప్పినట్టు రజస్వలకి మూడిటికీ ఇది సంబంధం అయితే ఏమైంది అప్పట్లో ఆ ప్రాంతాన్ని ఘట టక అనే ఒక బిల్లుడు భయంకరమైన కిరాతకులు వాళ్ళందరూ పరిపాలించేవారు అంతో అసలు వాళ్ళు మానవమాతులు ఎవరిని రానిచ్చేవారు కాదు కానీ నరకాసురుడు ఎవరికి పుట్టాడు వరాహ స్వామికి విష్ణుమూర్తి కుమారుడు అంతా విష్ణు శక్తితో నరకుడు వాళ్ళందరినీ ఊచకోత కోసేసి ఓడించి కొంతమంది పారిపోయారు కొంతమంది చనిపోయారు చివరికి ఆ ప్రాగజ్యోతిషపురానికి రాజ్యాధిపతి అయ్యాడు అయ్యాక విష్ణుమూర్తి చెప్పాడు నాయనా నువ్వు ఈ యోని పీఠాన్నే
(11:08) ఆశ్రయించు బుద్ధిగా మెలగు ధర్మంతో ప్రవర్ ర్తించు నీకు ఇంకా తిరుగు ఉండదు అని అంటే ఆ యోని పీఠాన్ని ఇంకా అమ్మే అనుకునేవాడు అంతే నరకాసురుడు వదిలేవాడు కాదు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని అప్పుడు రెండవ ఆలయాన్ని నరకాసురుడు నిర్మించాడు. అంటే మొట్టమొదట విశ్వకర్మ నిర్మించిన ఆలయం అది ఎప్పుడో కృతయుగంలో జరిగిన సంఘటన కదా ఆలయం నెమ్మదిగా సిధిలం అయిపోయి వెళ్ళిపోయింది కాలగతిలో వెళ్ళిపోతే రెండవ ఆలయాన్ని నరకాసురుడు నిర్మించాడు అప్పుడు కామరూప అని పేరు పెట్టాడు.
(11:41) ఆ తర్వాత నరకాసురుడు యజ్ఞాలు యాగాలు చేసి ఋషులని సేవించేవాడు అపారమైన అమ్మవారి భక్తి ఇంకా కామాఖ్యాదేవి అంటే ప్రాణం ఇచ్చేసేవాడు అంతే అలాగ ఒక యుగం పాటు బానే ఉన్నాడు త్రేతా యుగం చివర్లో పుట్టాడు కదా అక్కడి నుంచి ద్వాపర యుగం చివరి వరకు బ్రహ్మాండంగా ఉన్నాడు నరకాసురుడు అసలు నరకాసురుడి గుణగణాలు వింటే ఆనందం వేస్తుంది ప్రతిరోజు అమ్మవారి ఆరాధన అదే మంత్రసాధన అంతే కృతయుగంలో గర్భంలో పడ్డాడు త్రేతా యుగంలో పుట్టాడు ద్వాపరం చివరి వరకు ఉన్నాడు విష్ణుమూర్తి పుత్రుడు మరి రాక్షసుడు ఎలా అయ్యాడండి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎంత మంచివాడికైనా సరే సావాస దోషం ఉంటుంది అది
(12:17) నాశనం చేసేస్తుంది. ఇతను ఏం చేశడు వెళ్లి బలి చక్రవర్తి కుమారుడు బాణాసురుడు ఉన్నాడు కదా మనకి బాణాసురుడు కృష్ణుడు కథ తెలుసు కదా ద్వాపర యుగం చివర్లోది ఆ బాణాసురుడు క్షోణపురం అని రాజధాని ఉంది అది ఎక్కడఉందంటే తేజ్పూర్ అని ఇప్పుడు గౌహతి ఉంది కదా కామాక్షికి దగ్గరలో ఆ గౌహతికి 180 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉంది ఆ రాజ్యము ఇప్పటికీ ఉంది మీరు వెళ్లి చూస్తే ఒక చిన్న గుట్ట పైన అగ్నిఘర్ అని ఒకటి ఉంది ఆ కోట అన్నమాట అక్కడే ఆ ఉషని అనిరుద్ధి బంధించడం ఆ కథ అంతా మనకి తెలుసు కదా అక్కడ శిల్పాలు అన్నీ కూడా చెక్కున్నాయి చూస్తే అసలు భలేగా ఉంటుంది. అయితే నరకాసురుడు
(12:56) బాణాసురుడితో స్నేహం చేశక అప్పుడు చెడిపోవడం మొదలు పెట్టాడు మొదలు పెట్టి రాక్షస ప్రవృత్తి అప్పుడు వచ్చిన అప్పటిదాకా ఒక యుగం పాటు బాగానే ఉన్నాడు పాపం వేదాధ్యయనం మానేసాడు మానేసి అమ్మవారు ఆరాధన వదిలేసాడు బ్రాహ్మణుల్ని ఋషుల్ని వీళ్ళఎవ్వరిని గౌరవించడం మానేసాడు దేవతా ద్వేషం పెంచేసుకున్నాడు. అప్పుడు ఏమైంది ఒకసారి వశిష్ట మహర్షి వచ్చారు వచ్చి ఆయన నేను అమ్మవారి యోని పీఠాన్ని దర్శనం చేసుకుని వెళ్తాను అని చెప్పారు ఈ మహర్షికిను అమ్మవారి యోని పీఠానికి చాలా సంబంధం ఉంది మీకు రాబోయే వీడియోలో ఇంకా చెప్తా కామాక్షికి సంబంధించి రెండు
(13:28) ముఖ్యమైన మలుపులకి వశిష్ట మహర్షి కారణం అయితే నేను దర్శనం చేసుకుని వెళ్తాను అంటే వీలు లేదు ఇప్పుడు అక్కడ సేవ జరుగుతోంది మీరు రావడానికి వీలు లేదు అన్నాడు అంటే మహర్షి అన్నారు ఒరేయ్ నేను అమ్మవారి ఉపాసకుడినిరా నన్నే ఆపుతున్నావ్ నువ్వు అంటే నరకాసురుడు మహర్షినే దూషించాడు దూషిస్తే అప్పుడు ఆయన ఆయనకి ఆగ్రహం వచ్చి ఓరి వరాహ పుత్ర నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నావు కదా నీ తండ్రే అవతారం తీసుకని వచ్చి నిన్ను సంహరిస్తారురా ఆయన చేతిలో చస్తావు నువ్వు అలాగే యోనిపీఠం కొన్ని సంవత్సరాల పాటు శతాబ్దాల పాటు అదృశ్యం అయిపోతుంది నీ చావు తర్వాత మళ్ళీ
(14:06) నేను ఇక్కడికి వస్తాను అని శపించి వెళ్ళిపోయి గౌహతి ఇప్పుడు ఉంది కదా అక్కడికి దగ్గరలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆశ్రమ ఇప్పటికీ ఉంది అందులో 22 అడుగుల బిలంలో భగవంతుడి స్వరూపం ఉంది అసలు ఇప్పటికి కూడా చూడొచ్చు అసలు అమ్మో అద్భుతమైన ప్రదేశం మీకు వేరే వీడియోలో చెప్తా అయితే అప్పుడు నరకుడు ఈయనతో ఇదంతా అయిపోయాక వాగ్వివాదం పైకి వెళ్లి చూసేసరికి ఆ యోని పీఠం అదృశ్యం అయపోయింది దాంతో భూదేవిని విష్ణువుని ప్రార్థించాడు అయ్యో యోని పీఠం ఎక్కడికి పోయింది అంటే వాళ్ళు అసలు మాట్లాడలేదు పలకలేదు కనిపించలే వినాశకాలే విపరీత బుద్ధి అప్పుడు వెళ్లి బాణాసురుని కలిసాడు
(14:42) అడిగితే వాడు అన్నాడు ఒరేయ్ విష్ణువు అసలు నీ తండ్రి కాదురా నీ తండ్రి వరాహ స్వామి ఆయన ఎప్పుడో అవతారంతో వచ్చాడు వెళ్ళిపోయాడు అంతే విష్ణువు నీ తండ్రి అనేది అబద్ధము నీకు అసలు ఒక రహస్యం చెప్పనా విష్ణువు నీ శత్రువు విష్ణువుని ద్వేషించు అని చెప్తే వాడికి ఆ లెసన్ బాగా ఎక్కేసింది వాళ్ళ అమ్మగారు ఎంత చెప్పినా మూర్ఖుడికి లేదు కానీ ఈ లెసన్ బాగా ఎక్కి ఆ తర్వాత రెండో పాఠం ఏం చెప్పాడంటే అలాగే నువ్వు కామాఖ్యాదేవి అంటే అమ్మవారు అమ్మవారు అనుకుంటున్నావు కదా అందమైన స్త్రీ అందుకని కామించు వెళ్లి విష్ణువుని ద్వేషించు ఈ స్త్రీని కామించు అని
(15:20) చెప్పాడు. దాంతో వాడు వెళ్లి అమ్మవారిని కామించి తపస్సు చేశాడు అమ్మవారి కోసం ఏమిటి నన్ను పెళ్లి చేసుకోవాలి కానీ తపస్సు చేస్తే అమ్మవారైనా ఏ దేవతా శక్తి అయినా కచ్చితంగా ప్రత్యక్షమ అయి తీరుతుంది అవతలవాడు దుర్మార్గుడైనా మంచివాడైనా సరే అది సృష్టిలో ఫార్ములా అన్నమాట చూడండి ఇప్పుడు దుర్మార్గుడైనా సరే ఏదో ఎంసెట్ రాసాడు అనుకోండి అద్భుతంగా రాస్తే వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు అంతే కానీ వీడు దుర్మార్గుడు కదా వీడికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వకూడదు అనుకోరా తపస్సు కూడా అంతే ఎవ్వరు చేసినా సరే చేసే విధానంలో చేస్తే భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు.
(15:53) అంతా అమ్మవారు ప్రత్యక్షమయి ఏం కావాలి నాయనా అంటే నన్ను పెళ్లి చేసుకో అని ఓరి మూర్ఖుడా నువ్వు నా కుమారుడు లాంటి వాడివి నన్ను ఆరాధించేవాడివి అంటే నాకు అదేం కుదరదు నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. అయితే అమ్మవారు సరే అయితే ఒక పరీక్ష పెడుతున్నాను మీకు రేపు సూర్యోదయం లోపు బుద్ధి చెల్లించకుండా ఈ ఆలయానికి ఒక మెట్ల దారి కట్టు ఈ నీలాచర పర్వతానికి కింద నుంచి ఒక మెట్ల దారి కట్టు అది నువ్వు పూర్తి చేయగలిగితే కనుక అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పారు తమ్మవారు అంత అదంతా పని నాకు కింద నుంచి పైకి మెట్ల దారి కట్టటం అని మొత్తం శిల్పులందరినీ
(16:25) పిలిచి వాళ్ళ చేత మీరు మెట్టల దారి కట్టండి రేపు పొద్దున కోడి కూసేలోపు అది పూర్తఅయిపోవాలి అని చెప్పాడు. అంతే సరే అని మొదలు పెట్టారు ఈ లోపల ఏమైంది ఒక కోడి కూసి అప్పటికి ఇంకా పూర్త అవ్వలేదు దాంతో అయ్యో తెల్లారిపోయింది అని చెప్పి విచారంతో అది కట్టడం మానేసాడు. ఆ తరువాత తెల్లారి సూర్యోదయం అయ్యాక నిజం తెలిసింది కానీ అప్పటికే శిల్పులందరూ వెళ్ళిపోయేసరికి ఇంక కోపం వచ్చి ఆ కోడిని వెంటపడి చంపేసాడు ఇదేదో నాకు కావాలనే వచ్చింది అమ్మవారు పంపించిన శక్తి అక్కడ ఆ కోడిని చంపిన ప్రదేశమే ఇప్పటికీ గౌహతి దగ్గర ఉంది దాన్ని కుక్కూరకాట అని
(16:59) పిలుస్తారు అంటే కోడిని చంపిన ప్రదేశం అది 80 కిలోమీటర్ల దూరంలో ఉంది గౌహతి నుంచి ఆ మెట్ల దారి అతను కట్టింది ఇప్పటికి కూడా ఉంది దాన్నే ఒరియాలో మొఖిల ఉజు ుజువా బాట్ అని పిలుస్తారు ఆ మెట్ల దారి అతను నరకాసురుడు కట్టించింది. ఆ తర్వాత సరే ఇది అవ్వట్లేదు అని చెప్పి బ్రహ్మగారికి ఘోరమైన తపస్సు చేశారు. చేస్తే మళ్ళీ బ్రహ్మగారు కూడా ప్రత్యక్షమయ్యారు నరకాసురుడికి అంత పట్టుదల సాధనలో ప్రత్యక్షమై నాయనా ఏం వరం కావాలి నీకు అంటే సరే అయితే నేను మూడు వరాలు కోరుకుంటాను అని అడిగాడు ఒక వరం కాదు ఆయన సరే కోరుకో అంటే మొట్టమొదటిది దేవతల చేతుల్లోనూ అసురుల చేతుల్లోనూ నేను
(17:35) చావకూడదు అంటే ఆయన నవ్వుకుని తథాస్తు అన్నాడు రెండవది నా వంశం సృష్టి అంతం వరకు ఉండాలి అని కోరుకున్నాడు అంటే ఆయన సరే తథాస్తు అని దీవించాను మూడవది నాకు ఒక స్త్రీ సుఖం సరిపోదు 16వేల స్త్రీల సుఖం కావాలి నాకు అని అడిగాడు అంటే బ్రహ్మగారు నవ్వుకుని సరే అయితే నీకు 16వేల అందమైన స్త్రీలని ప్రసాదిస్తా కానీ నారదుడు నీ పురంలో కాలు మోపేదాకా నువ్వు వాళ్ళని అనుభవించలేవు అని చెప్తే సరే అయితే నారదుడిని పిలిపించుకుంటాను ఆ తర్వాత అనుభవిస్తాను సరే అని చెప్పి బ్రహ్మగారికి నమస్కారం చేసి చాలా వరగర్వంతో వెనక్కి వచ్చాడు వస్తే బాణాసురుడు ఓరి మూర్ఖ కూడా
(18:14) దిట్టాడు ఏమిటి ఏమైంది అంటే ఒరేయ్ మీ నాన్నగారి చేతిలో నువ్వు చనిపోతావు అని శపించాడు కదరా మహర్షి అది కదరా నువ్వు కోరుకోవాల్సిన అసలు వరం అంటే మళ్ళీ తపస్సు చేస్తాను అన్నాడు అంటే కుదరదు అది ఎందుకంటే దేవ కార్యాల్లో ఎప్పుడ కూడా రెండో మారు ప్రయత్నించకూడదు ఒకసారి సఫలీకృతం అయ్యాక అని తంత్రశాస్త్రంలో చెప్పారు.
(18:40) దాంతో ఇంకా అది వదులుకొని ఆలోచన కొడుకుల్ని కని వాళ్ళకి బలం పెంచి అప్పుడు పూర్తి నరకాసురుడు కింద తయారయ్యాడు. ఈ లోపల రాక్షసులందరూ చేరిపోయారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక దుర్మార్గులు ఎవరైనా ఉండి సన్మార్గులని ఏడిపించే వాళ్ళు ఉంటే గనుక మిగతా దుర్మార్గులందరూ ఆ లీడర్ కిందకి వచ్చేస్తారు అది సృష్టిలో ఉన్న ఒక ఫార్ములా అది దాంతో ఇంక భీభత్సాన్ని సృష్టించి దేవతల్ని ఋషుల్ని అందరిని ఏడిపించడం మొదలు పెడితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకి కిందకి దిగివచ్చి నరకాసురుని సంహరించాడు ఇది మనం భాగవతంలో చదువుకున్నాం కదా ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకి వశిష్ట మహర్షి శాపం తీరి మళ్ళీ ఆ
(19:15) యోని పీఠం అక్కడికి వచ్చింది ఆ తర్వాత కొన్నేళ్లకి వశిష్టుడు ఇంకొక శాపం ఇచ్చాడు యోని పీఠానికి అది కామాక్షనే మలుపు తిప్పిన శాపం ఆ శాపాన్ని ఇప్పటికీ మనం కళ్ళతో చూడొచ్చు కానీ అది పూర్తిగా వేరే సబ్జెక్ట్ అందుకని మీకు ఇంకొక వీడియోలో చెప్తాయి కామాక్ష సిరీస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సరే ఇంతకీ నరకాసురుడు కట్టించిన ఆలయం కూడా కొంత కాలానికి ద్వాపర యుగం అయిపోయేసరికి కాలగర్భంలో కలిసిపోయింది.
(19:42) ఇప్పటిదాకా నేను చెప్పినవి పురాణ కథలు. ఇప్పుడు కలియుగంలో చరిత్ర ఏం జరిగింది అనేది చెప్తా. సరే కలియుగానికి వచ్చేసరికి ఆ పీఠం ఉంది. ఆ శక్తి అక్కడే ఉంది కానీ కొంచెం అవ్యక్త స్వరూపంలో ఉంది ఎందుకంటే పైన ఆలయం లేదు కాబట్టి ఎవ్వరికీ అక్కడ ఆ శక్తి పీఠం ఉంది అని తెలియదు. మళ్ళీ అమ్మవారు వ్యక్తం కాదల్చుకున్నప్పుడు 16వ శతాబ్దంలో ఏం జరిగిందంటే ఇప్పుడు నేను చెప్పబోయే చరిత్ర దీనికి బోలెడన్ని సాక్ష్యాలు ఉన్నాయి 1520వ సంవత్సరంలో విశ్వసింఘ అని ఒక మహారాజు కోచ్ అనే రాజవంశం అన్నమాట అక్కడ పరిపాలించేవాడు ఆయనే విశ్వసింహుడు అని పిలుస్తాం మనం అయితే వాళ్ళు విశ్వసింఘ
(20:18) అంటారు. అయితే వాళ్ళు అమ్మవారికి అపారమైన భక్తులు కానీ వాళ్ళకి యోనిపీఠం అక్కడ ఉంది అని తెలియదు. అయితే ఒకసారి అహోములు అని ఒక శత్రువులు ఉన్నారన్నమాట వాళ్ళతో యుద్ధం చేశాడు చేసి ఆ యుద్ధం అలా పగలు రాత్రి పగలు రాత్రి అయ్యి ఒకరోజు రాత్రి ఏమైందంటే ఇంక డస్సిపోయి పూర్తిగాను ఆ సైన్యం కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అడవుల్లో యుద్ధం చేసి తప్పిపోయి పాపం ఈ విశ్వసింహుడు అతని తమ్ముడు శివసింహుడు అని వాళ్ళద్దరు దారి తప్పి నెమ్మదిగా ఒక చిన్న పర్వతం పైకి వెళ్ళారు విపరీతమైన దారి అలసట ఇంకా ఎంత నీరసించిపోయారుఅంటే చచ్చిపోతామేమో అనిపించి
(20:54) ఈ లోపల ఏమైంది ఆ చుట్టూ అడవి చిమ్మ చీకటి అక్కడ ఒకచోట వెలుగుక్ కనిపిస్తుంది. వెలుగు కనిపిస్తుంటే ఏమిట్రా ఇది అని వెళ్లి చూస్తే అక్కడ చీకట్లో ఒక వృద్ధురాలు ఇలా జడలు కట్టేస్తుంది ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఒక కాగడా పెట్టుకుని అక్కడ ఒక యోని పీఠానికి పూజ చేస్తుంది. అసలు ఆవిడని చూసేసరికి ఒళ్ళు గగురు పొడిచింది వీళ్ళకి పడిచి దాహం దాహం అంటే ఓహో మీకు దాహం వేస్తుందా ఉండండి అని ఆ యోని పీఠంలోనుంచి తీర్థం వస్తుంది ఏమిటది మొట్టమొదట బ్రహ్మగారు సృష్టించిన జలం నేను చెప్పాను కదా అది ఎలా నిరంతరాయంగా వస్తూనే ఉంటుంది. ఆ తీర్థం ఇప్పటికీ కూడా
(21:28) అపురూపమైన తీర్థం యోని పీఠం నుంచి వచ్చేది దాంతా తీర్థాన్ని పట్టి వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు అది సేవించారు సేవిస్తే అప్పుడు వాళ్ళకి వెంటనే ఓపిక వచ్చేసింది. వచ్చే సహా ఇదేంటి ఇలా తయారయ్యాము ఏమిటి ఇది అని అడిగితే ఇది కామాఖ్య అని కామ అని పిలవబడే అమ్మవారి శక్తిపీఠం ఏ కోరికైనా కోరుకుంటే ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మవారికి సాధన చేస్తే సరిపోతుంది అంటే వెంటనే రాజు వెళ్లి అన్నాడట నాకు సైన్యం దొరకాలి అలాగనే యుద్ధంలో గెలవాలి అహోముల మీద గెలిస్తే గనుక ఇక్కడ బంగారపు ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు మొక్కుకునేసరికి ఆ రెండు కోరికలు
(22:06) నెరవేరిపోయాయి మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అమ్మ దగ్గరికి అమ్మ నా కోరిక నెరవేరింది పీఠం దయ అని చెప్పి ఒక మేకని బలిచ్చాడు ఇస్తే అప్పుడు అవ్వ అడిగింది నాయనా ఇక్కడ బంగారపు ఆలయాన్ని నిర్మిస్తా అన్నావు కదా నువ్వు అని అంటే చూడండి మనిషికి ఎప్పుడైనా కోరిక తీరిపోతే గనుక వెంటనే భగవంతుని మర్చిపోతాడు ఏమన్నాట ఓ పని చేస్తాను ఇక్కడ యోనిపీఠం నుంచి నీళ్ళ వస్తున్నాయి కదా ఇందులో నా ఉంగరాన్ని తీసివేస్తా ఇది నాకు వారణాసిలో గంగలో దొరకాలి అప్పుడు కట్టిస్తా అన్నా చూడండి ఎంత దారుణం అది కోరిక కోరుకొని ఇలా చేయొచ్చా మొక్క అంటేను అది వదిలేసి ఆ ముసలవ్వ నవ్వుకుని
(22:39) వదిలేసింది సర్లే అమ్మవారే తీసుకొస్తారు నిన్ను వదిలేయ ఆ తర్వాత మర్చిపోయాడు చాలా సంవత్సరాలు అయ్యాక ఏమైందంటే వారణాసి వెళ్లి ఒకసారి గంగలో స్నానం చేసి మునిగి ఇలా దోసిట్లోకి నీళ్లుు తీసుకోగానే అందులో ఉంగరం కనిపించింది. ఇది అమ్మవారి మహిమ అంటే కామాక్షదేవి అంటే అమ్మో సామాన్యం కాదు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించిఉన్న మహాశక్తి అయితే అప్పుడు పశ్చాత్తాప్ పడి అమ్మ బంగారంతో ఆలయం కట్టలేను ఆరోజు ఏదో చెప్పేసాను మరి ఏం చేయమంటావు ఇప్పుడు అని అడిగితే అప్పుడు అమ్మవారి కలలో కనిపించి నాయన ఒక పని చేయి ప్రతి రాయిలో కొంచెం
(23:11) బంగారం పెట్టి నా ఆలయాన్ని నిర్మించు అంటే అప్పుడు అలా నిర్మించాడట అయితే ఇది వినగానే ఇప్పుడు కామాక్షా దేవి ఆలయంలో ప్రతి రాయి కింద కొంచెం బంగారం ఉందండి అని ఒక సంద సందేహం వచ్చేస్తుంది కదా చెప్తా చెప్తా మనం చూసేది ఆ రాజు కట్టించిన ఆలయం కాదు దీని శిధిలాలు ఇప్పటికే ఉన్నాయి అంతటి శక్తిపీఠాన్ని ఒక దుర్మార్గుడు నాశనం చేసేసాడు ఎవడండి వాడు ఆలయాల ధ్వంసం అనగానే భారతదేశంలో ముగ్గురు నికృష్టులే గుర్తొస్తారు ఎవరికైనా కాలాపహాడు మాలిక్ కాఫర్ గజని ఎన్ని ఆలయాలని ధ్వంసం చేసేసారో ముగ్గురు దుర్మార్గులు ఒక్కటేనా కట్టారా వీళ్ళు వాళ్ళ జన్మలో కట్ల అసలు తలుచుకుంటే
(23:47) వాళ్ళ ముగ్గురు గురించి రక్తం మరిగిపోతుంది సర్లేండి ఇంతకే ఈ రాజు రాజు కొడుకు నరనారాయణుడు అని అలాగే ఆయన కజిన్ ఒకతను చిల్లారాయ అని వీళ్ళద్దరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకసారి 1562 లో కాలాపహాడు వచ్చాడు అప్పటికి వాడు బెంగాల్ సేనాని అన్నమాట వచ్చి కామాఖ్యదేవి ఆలయానికి హంసం చేసేసాడు భక్తుల్ని ఊచపోత కోసి పాపం వాళ్ళ ఆలయాన్ని ధ్వంసం చేయొద్దు అంటే అందరిని నలికేసి అక్కడ శవాల పుట్టలు ఆ తర్వాత చిల్లారాయి దొరికితే అతన్ని బంధించి జైల్లో పెట్టేసాడు తీసుకెళ్లి పాపం అతను ఆ జైల్లో మగ్గిపోయి అమ్మా అమ్మా తల్లి నీ ఆలయాన్ని కాపాడుకోలేకపోయాము నీ
(24:23) ఆలయం ధ్వంసం అయింది వెంటనే మా జీవితాలు నాశనం అయిపోయి నన్ను ఎలాగైనా కాపాడు తల్లి నీ పాదాల్ని ఆశ్రయించి ఉన్నాము అంటే అప్పుడు అమ్మవారి కళలో కనిపించి చిల్లారాయికి ఒక ఉపాయం చెప్పారు పక్కరోజు ఉదయం ఆ నవాబు తల్లిని పాము కరిచింది. నవాబుకి తల్లి అంటే మహా ప్రీతి అసలు దాంతో చనిపోతోంది నా తల్లి అని చెప్పి వైద్యులని పిలిస్తే ఎవ్వరు బాగు చేయలేకపోయారు.
(24:45) అప్పుడు చిల్లారాయి జైల్లో నుంచి నేను బాగు చేస్తాను నాకు ఆ శక్తి ఉంది అంటే సరే తీసుకురండి అన్నారు అదే అమ్మవారు చెప్పిన ఉపాయం అప్పుడు ఆ శవన్ దగ్గరికి వెళ్లి చెవిలో మానసాదేవి నామం మూడు సార్లు చెప్పేసరికి లేచి కూర్చున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనకి సంబంధించిన ఒక గుర్తు కూడా ఇప్పటికీ కామాక్షాదేవి ప్రధాన ఆలయంలో ఉంది అది మీకు తర్వాత చెప్తా సరే ఆ విషం దిగిపోయింది నవాబు తెగ సంతోషించి సత్కరించి వదిలి పెడితే మళ్ళీ వెనక్కి తిరిగివచ్చి 1565 లో ఒక ఆలయం కట్టి లక్ష జంతువుల్ని బలిచ్చారట ఆలయం తెరిచేటప్పుడు అది నాలుగవ ఆలయం ఈరోజు మనం చూస్తున్నది ఆ
(25:23) కామాక్షి ఆలయం అర్థమైంది కదా ఇంత చరిత్ర ఉంది కామాక్షికి ఎక్కడైనా విన్నారా మీరు అది అందుకే ఈ వీడియో వీడియో చేయడం విస్తారంగా సరే ఆ తర్వాత ఏమైంది కెందుకలాయని ఒక మహా ఉపాసకుడు ఆయనకి అమ్మవారు ఇలా పిలిస్తే పలికేవారు అంత గొప్ప సాధకుడు ఆయన్ని తీసుకొచ్చి పూజారి కింద పెట్టారు. పెడితే ఇంకా పీఠం అద్భుతంగా వైభవంతా పరిడ వెళ్ళడం ప్రారంభమయింది ఎందుకంటే ఉపాసకుడు గట్టైనవాడు ఉన్నాడు అంటే గనుక ఏ ఆలయం అయినా సరే ఖచ్చితంగా వృద్ధిలోకి వచ్చేస్తుంది.
(25:51) ఆయన ఏం చేసేవాడు ప్రతిరోజు రాత్రి అమ్మవారికి హారతి ఇస్తూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఒక పాట పాడేవాడు ఆ పాట అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఆ పాటకి పొంగిపోయి అమ్మవారు రోజు ప్రత్యక్షమై దివ్య సౌందర్యంతో తేజస్సుతో వెలిగిపోతూ నృత్యం చేసేవారట నృత్యం చేసి నాన్న నీ పాట విని నేను వచ్చి నృత్యం చేస్తున్నాను ఈ రహస్యం మాత్రం ఎవ్వరికీ చెప్పకు అని చెప్పారు అయితే ఏమైంది మనిషి ఊరుకోడు కదా ఎవరో ఒకళ కుటుంబంలో చెప్తే అక్కడి నుంచి అలా అలా బయటికి వెళ్లి చివరికి ఆ నరనారాయణుడు అనే రాజుకి తెలిసి తెలిసి అమ్మ బాబోయ్ అమ్మవారు వస్తున్నారా ఒక జీవిత కాలంలో ఇంక అమ్మవారిని చూడగలమా
(26:26) అని చెప్పి పూజారిని పిలిచి నాకు చూపించు అమ్మవారిని అని ఆశ పెట్టాడు పెడితే నేను చూపించలేను అంటే నీకు ఇంత ధనం ఇస్తాను అంటే చివరికి ఆశపడి సరే అని గర్భాలయంలో ఒక గోడకి దాదాపు ఆగ్నేయం మూల అన్నమాట ఆ గోడకి సౌత్ వైపు ఒక కన్నం పెట్టాడు. ఆ కన్నం ఇప్పటికీ ఉంది మీకు రాబోయే వీడియోలో ఎక్కడ ఉందో చెప్తాను.
(26:49) ఆ కన్నంలోని చూస్తే యోని పీఠం పూర్తిగా కనిపిస్తుంది దాంతో రాజు అక్కడ దాక్కొని రాత్రి చూస్తూఉంటే ఇతను ఇవ్వడం మొదలు పెట్టాడు హారతి మొదలు పెడితే అప్పుడు అమ్మవారు వచ్చి నృత్యం చేయడం మొదలు పెట్టారు ఇతను భయంతో వెనక్కి చూస్తున్నాడు చూస్తుంటే అంత తన్మయత్వంలో ఉన్న అమ్మవారు గమనించి ఓరి దుర్మార్గుడా ఎవరికీ చెప్పొద్దు అంటే డబ్బుకు అమ్ముడిపోతావా అని చెప్పి చాచి ఒక్కటి కొట్టేస్తాడు అమ్మవారు కొడితే ఏమిటి ఆ తల ఎగిరిపోయి ఒకచోట పడింది ఎక్కడో దూరంగానో అది అది ఎక్కడ పడిందంటే ఈ కామాక్ష పీఠానికి 71 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ ఆ ఊరిని కెలాయగావ్ అని పిలుస్తారు. ఆ ఊరిలో
(27:25) వెళ్లిపడింది ఇప్పటికీ ఉంది ఆ ఊరు ఆ తర్వాత రాజుని నువ్వు ఇంత దారుణం చేస్తావా నీకు ఏం శక్తి ఉంది నన్ను చూడటానికి నువ్వు చేసింది చాలా తప్పు అందుకని నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను ఈ ఆలయం నీది అన్న అహంకారంతో చేశవు కదా అందుకని నీ వంశం వాళ్ళఎవ్వరు భవిష్యత్తులో ఈ ఆలయానికి రాకూడదు అంతే కాదు తలెత్తి నీలాచలం వైపు కూడా చూడకూడదు అని చెప్పించారంట అమ్మవారు దాంతో ఏడిచేసాడు ఆ రాజు అమ్మ మా జీవితాలన్నీ మా తండ్రివి మావి అందరి జీవితాలు నీ యోని పీఠం చుట్టానమ్మా దయచేసి అనుగ్రహించు తల్లి అంటే ఇంకేమీ లేదు అని చెప్పి అమ్మవారు మాయమైపోయారు. అందుకే
(27:59) ఇప్పటికీ కూడా ఆ రాజవంశీయులు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళు కామాక్షి ఆలయంలోకి రారు మిగతా సేవలు అన్ని చేయిస్తారు వాళ్ళు ఆలయంలోకి మాత్రం రారు ఆ పక్కనుంచి ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగులు వేసుకుని ఆలయం కంటపడకుండా వెళ్తారు అమ్మవారి మాటక ఇస్తున్న గౌరవం అలాగే ఆ పని చేశారంటే మీ వంశం నాశనం అయిపోతుంది అని అమ్మవారు చెప్పించారు కాబట్టి ఎవ్వరు ఆ పని చేయరు ఇది కామాక్షి ఆలయం యొక్క పురాణం చరిత్ర వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం పరమేశ్వరుడు పురాణంలో లో ఒక మాట చెప్పాడు ఏంటంటే సత్యాస్తు పతితం తత్ర విషీర్ణ యోని
(28:34) మండలం సంస్పర్శతాం శిలాం మర్చోర్ తస్యో మోక్షమవాప్నుయాత అంటే అసలు ఆ యోని పీఠాన్ని ఒక్కసారి తాకితే చాలు ఎంత అదృష్టమో అది అని మన అదృష్టం ఏమిటంటే ఇప్పుడు తాకనిస్తున్నారు అందుకని కామాక్షి వెళ్తే తాకచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ తాకనివ్వరేమో తిరుమల్లాగా మళ్ళీ అక్కడ క్యూలు అవన్నీ ఫామ్ అయిపోతాయి అందుకని వెళ్తే చూడవచ్చు అలాగే అక్కడ ఎన్నో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అసలు ఆ పంచబలులు ఏంటి అంబుబాజు ఏంటి అమ్మవారు నిజంగానే రజస్వలు అవుతారా ఎర్రటి బట్ట నిజమేనా అవన్నీ కూడా రాబోయే వీడియోలో చెప్తా శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక
(29:12) వీడియోల్ని మూడు [సంగీతం] ఛానల్స్ గా విభజించాం. మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి
No comments:
Post a Comment