Thursday, August 13, 2026

The Consciousness Secret Nobody Talks About

The Consciousness Secret Nobody Talks About

Author Name:Mr Bhanuprasad

Youtube Channel Url:https://www.youtube.com/@MrBhanuprasadOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hqoru8ums68



Transcript:
(00:00) ఒకసారి మీ జీవితాన్ని నిజాయితిగా గమనించండి. ప్రతిరోజు లేవడం, పని చేయడం, డబ్బు సంపాదించడం, ఫోన్ స్క్రోల్ చేయడం, మళ్ళీ నిద్రపోవడం ఇలా రోజులు గడిచిపోతున్నాయా ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా నేను ఇంకా ఏదో గొప్పది చేయగలను. కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అలా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మనిషి జీవితాన్ని నిర్ణయించేది అతని డబ్బు కాదు అతని చదువు కాదు అతని అదృష్టం కూడా కాదు అతని కాన్షియస్నెస్ లెవెల్ అంటే చైతన్య స్థాయి.
(00:28) ఇప్పుడు మీరు వినబోయే విషయాలు మీరు ఇప్పటివరకు విని ఉండకపోవచ్చు. ఈ వీడియో చివరికి మీరు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో మరియు ఎందుకు ఎక్కువమంది ఒకే స్థాయిలో చిక్కుకోపోతారో అర్థమవుతుంది. ఫస్ట్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. చైతన్యం అంటే కేవలం మెలుకువగా ఉండడం కాదు. ప్రపంచాన్ని మనల్ని మనం మన ఆలోచనలను మన భావద్వేగాలను ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటామో అదే కాన్షియస్నెస్.
(00:53) ఒకే సిచువేషన్ ను ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఒకరు కోపడతారు మరొకరు ప్రశాంతంగా స్పందిస్తారు. సంఘటన ఒక్కటే కానీ వారి చైతన్య స్థాయి వేరు అందుకే జీవితంలో బయట జరిగేది కాదు. లోపల ఎలా స్పందిస్తున్నామ అనేదే జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక చిన్న స్టోరీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఒక సంవత్సరం వర్షాలు రాలేదు.
(01:15) మొదటి రైతు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని బాధపడుతూ ఇంట్లో కూర్చున్నాడు. రెండో రైతు భావితోవ్వడం ప్రారంభించాడు. నీటిని నిల్వ చేశాడు. కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత మొదటి రైతు అప్పుల్లో మునిగిపోయాడు. రెండో రైతు మాత్రం విజయవంతమయ్యాడు. ఇద్దరికీ ఒకే సమస్య కానీ వారి కాన్షియస్నెస్ వేరు. సెకండ్ ఎక్కువ మంది చిక్కుకుపోయే స్థాయి.
(01:35) ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీరు థంబ్నెయిల్ లో చూసిన ఎర్రంగు మనిషిని గమనించండి. అతడే ఎక్కువ మంది మనుషుల ప్రతీక. ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి విషయాన్ని భయంతో చూస్తారు ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. ఎప్పుడు టెన్షన్ ఎప్పుడు అసంతృప్తి వాళ్ళ ఆనందం బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా పొగిడితే సంతోషం ఎవరైనా విమర్శిస్తే రోజంతా బాధ ఇది ఒక మానసిక జైలు.
(02:02) ఈ స్థాయిలో మనిషి తన ఆలోచనలకే బానిస అవుతాడు. అతను జీవించడం కాదు కేవలం స్పందిస్తూ ఉంటాడు. ఎవరైనా కోపం తెప్పిస్తే కోపడతాడు. ఎవరైనా భయపెడితే భయపడతాడు. అంటే అతని జీవితానికి డ్రైవర్ ఇతరులే అతను కాదు ఇంకో కథ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నప్పుడు ఒక ఏనుగును బలమైన గొలుసుతో కట్టేస్తారు. ఎంత ప్రయత్నించినా తెంచుకోలేడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఏనుగును ఒక చిన్న తాడుతో కడతారు.
(02:24) ఇప్పుడు దానికి ఆ తాడు తెంచే శక్తి ఉంది. కానీ అది ప్రయత్నించదు. ఎందుకంటే దాని మనసు ఇంకా బందీలోనే ఉంది. మనలో చాలా మంది కూడా అలాగే ఉంటారు. మనల్ని మనమే పరిమితం చేసుకుంటాం. ఇదే కారణంగా ఎక్కువ మంది జీవితాంతం అక్కడే ఆగిపోతారు. థర్డ్ ఎందుకు అక్కడే ఆగిపోతారు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆటోపైలట్ జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అదే రొటీన్ ఎప్పుడు ప్రశ్నించరు నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను అనే ప్రశ్న అడగరు.
(02:57) సెకండ్ భయం మార్పు అంటే భయం కొత్తగా నేర్చుకోవడం అంటే భయం విఫలం అవుతానేమో అనే భయం. ఈ భయమే మనిషిని ఒకచోట నిలిపి వేస్తుంది. థర్డ్ అహంకారం నాకు అన్ని తెలుసు ఈ ఒక్క ఆలోచనే అభివృద్ధికి అతి పెద్ద శత్రువు నేర్చుకోవడం ఆగిపోయినప్పుడు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఫోర్త్ పై స్థాయికి ఎలా వెళ్ళాలి? అయితే దీని నుంచి బయట పడడం ఎలా? స్టెప్ వన్ ముందుగా మీ ఆలోచనలను గమనించండి.
(03:22) ఆలోచనలు నిజాలు కావు. అవి కేవలం ఆలోచనలు మాత్రమే. స్టెప్ టూ ప్రతిరోజు 10 నిమిషాలు నిశబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. ఇది మీలో స్పష్టతను పెంచుతుంది. స్టెప్ త్రీ ఎక్కువగా చదవండి మంచి పుస్తకాలు మంచి వ్యక్తులు మంచి ఆలోచనలు మీ కాన్షియస్నెస్ ని నెమ్మదిగా పెంచుతాయి. స్టెప్ ఫోర్ ప్రతి సంఘటనకు వెంటనే స్పందించకండి.
(03:46) ఒకసారి ఆగండి ఆలోచించండి. తర్వాత స్పందించండి. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. స్టెప్ ఫైవ్ ప్రతిరోజు మీకు మీరే ఒక ప్రశ్న అడగండి. నేను నిన్నటికంటే ఈరోజు మంచి మనిషిగా మారానా? ఈ ప్రశ్న మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఇంకో లాస్ట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక గురువు తన శిష్యుడిని అడిగాడు. నీ జీవితాన్ని మార్చేది ఎవరు? శిష్యుడు అన్నాడు నా కుటుంబం నా అదృష్టం, నా పరిస్థితులు గురువు నవ్వి ఒక అద్దం ఇచ్చాడు.
(04:14) ఇదిగో ఇందులో కనిపించే వ్యక్తే నీ జీవితాన్ని మార్చగలిగే ఏకైక వ్యక్తి అన్నాడు. గుర్తుంచుకోండి చాలామంది జీవితాంతం భయం సందేహం ఇతరుల అభిప్రాయాల మధ్య ఆగిపోతారు. కానీ కొంతమంది మాత్రమే తమ ఆలోచనలను మార్చుకుంటారు. వారు తమ జీవితాన్ని కూడా మార్చుకుంటారు. ఈ రోజు నుంచే మీ కాన్షియస్నెస్ ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళండి. కంక్లూజన్ గుర్తుంచుకోండి మనిషి జీవితంలో అతి పెద్ద శత్రువు బయట ప్రపంచం కాదు.
(04:39) తనకు తెలియకుండా ఒకే చైతన్య స్థాయిలో చిక్కుకోపోవడమే. మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారనేది ముఖ్యం కాదు. రేపు ఒక్క అడుగు ముందుకు వెళ్తున్నారా లేదా?

No comments:

Post a Comment