Saturday, December 4, 2021

మంచి మాటలు

ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు, లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు. మా ఇంటి దైవం వినుకొండ రామభక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు.. తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిత్యనూతన ఆనందాలతో జీవించాలని కోరుకుంటూ... 🤝💐🌹🕉️
శనివారం --: 04-12-2021 :-- ఈరోజు AVBమంచి మాటలు ..

ఒకరు నిన్ను ప్రతిరోజూ పలకరిస్తూన్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వారి మనసు లో మీ స్థానం చాలా ప్రత్యేకమైనది అని అర్థం ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏది లేదు .

జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన అన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు .

జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు , మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి , బాధ నుంచి సంతోషం అయిన ఓటమి నుంచి గెలుపు అయిన .

వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్క వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు .

ఎదిగే వయసు పారే యేరు ఖర్చు చేసే రూపాయి తిరిగిరాదు తప్పు అందరు చేస్తారు కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వారే జీవితంలో గొప్పవారవుతారు

*మీ ... AVB సుబ్బారావు 🙏

సేకరణ

No comments:

Post a Comment