Saturday, January 29, 2022

మంచి మాట.. లు

ఆత్మీయబంధు మిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
20-01-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
చూడు మిత్రమా!!
వినే ఓపిక లేనివాడు ఎప్పటికి అజ్ఞానిగానే మిగిలిపోతాడు, చెప్పే ధైర్యం లేని వాడు ఎప్పటికి పిరికివాడిగానే ఉండిపోతాడు,,


శత్రువుకు నీ బలాన్ని చూపించు, స్నేహితుడికి నీ గుణాన్ని చూపించు చాలు,,


మనల్ని తొక్కి బతుకుతాను అనే వాళ్ళ ముందు, ఎదిగి నిలబడతాను అనే ధైర్యంగా బ్రతకాలి, ధైర్యం లేకపోతే తాడు కూడా పాముగా కనబడుతుంది గుర్తుంచుకో,,


ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ముకో చాలు, మహా సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది,,


గతం అంతా గమ్మత్తు గానే ఉంటుంది గడిచిపోయింది కాబట్టి,
భవిష్యత్ అంతా భయం గానే ఉంటుంది భరించాలి కాబట్టి.


గుర్తుంచుకో,, ఎదుటి వ్యక్తి నీపై గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు,,
సేకరణ ✒️AVB సుబ్బారావు*

సేకరణ

No comments:

Post a Comment