Sunday, January 30, 2022

మనిషికి సంకల్పాలు ఎందుకు వస్తాయి?

 *🌷మనిషికి సంకల్పాలు ఎందుకు వస్తాయి?🌷*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*అంతర్గతం గా ఉన్న (కారణ కోశం )వాసనా గుణాల వలన లేదా బయటి ప్రపంచం లొ ఉన్న విఆకర్షింప చేసి వాటిని పొందా లనే కోరికల వలన, మనిషికి సంకల్పం,భావం,ఆలోచన,కార్యాచరణ -ఇలా ఒక గొలుసు కట్టు చర్య లాగా క్రియలు జరుగుతూ మనస్సు,బుద్ది ఎల్లప్పుడు మహా ఆందోళన తో ఉంటాయి.*


*మనిషి బయట ఉన్న ఆకర్షణలకు ,బంధాలకు దూరం గా పారిపోయి అడవుల కెళ్ళినా, వాసనా మయ కారణ కోశాన్ని శుభ్రం చేసు కోక పోతే సంకల్పాలను ఆపలేము.*

*కారణ శరీరం అనేది మన పుట్టుకకు, ముఖ్యం గా మన మెదడు పని చేసే విధానానికి మూల కారణం .*

*EEG అనేది మెదడు లో ని విద్యుత్ స్పందనలను తెలుపుతుంది .(electrical impulses in gross matter i.e.brain).*

*ఆ మెదడు వెనక ఉన్న కారణ కోశం లోని స్పందనలను తెలుసు కొనే పరికరాలు ప్రస్తుతం లేవు .*

*ఆ స్పందనలను పూర్తిగా తుడిచి వేయాలి . we have to erase all old baggage.*


*శుద్ది జరగడానికి కారణ కోశం మొత్తాన్ని రి ప్రోగ్రామ్మింగ్ అనగా పునర్వ్యవస్థీకరణం చేయాలి.*

*అది ఒక్క రొజు,ఒక ఏడు,లేదా ఒక జన్మలో జరిగేది కాదు.*

*కానీ,పని కట్టుకొని,ఒక నిశ్చల మైన వివేక వైరాగ్య అభ్యాసం తో సంకల్పాలన్నింటినీ ఆలోచనలుగా మారకుండా కట్టడి చేసే ప్రక్రియే ధ్యానం.*


*ఉదాహరణ కు  రోజుకి  60000 రకాల ఆలోచనలతో మనస్సు హడావిడి గా ఉంటుంది.*

*ధ్యాన సాధన తొలి మెట్టులో వాటిని ఒకే రక మైన ఆలొచన కే పరిమితం చేయాలి. ఎలా?*

*ఒక మంత్రమో,ఒక రూపమో,ఒక శబ్దమో,ఒక జ్యోతి పైనో మనస్సుని కేంద్రీకరించి ధారణ చేయాలి.*

*ధారణ లో ఆలోచన ఉండదు. కేవలం ఒక్క విషయం పై గమనికే ఉంటుంది.*

*గమనిక లో   మానసిక స్పందన ఉండదు .*

*ఎప్పుడైతే స్పందన లేని స్థితి సుస్థిర మవుతుందో అప్పుడే కారణ కోశ శుద్ది ఆరంభ మవుతుంది .*

*ఈ విధ మైన ధ్యాన క్రియ తో శుద్ది పూర్తీ ఐన తర్వాత నే ఎరుక ఆత్మ గత మవుతుంది .*


*ఆత్మ గత మైన ఎరుక లొ మనిషి కున్న అన్ని కోశాల జ్ఞానం కలిసి ఉంటుంది.*

*ఎలా గంటే ,మనిషి ఎరుక శరీర స్థాయి నుండి మనస్సు కి ఎదిగిన తర్వాత శరీరం గురించి బాగా తెలుస్తుంది .*

*అలాగే బుద్ది  బాగా అభివృద్ధి చెందినప్పుడు ,మనస్సులోని మర్మాలు , మనస్సు ఎలా పని చేస్తుంది? అనే విషయాలు అవగత మవుతాయి .*

*బుద్దిని దాటి కారణ కోశం లేదా ఆనంద కోశం అవగత మైతే సృష్టి కి కారణం ఏమిటో అవగత మవుతుంది .*

*దానిని కూడా దాటి ఆత్మ స్థాయికి మనిషి ఎరుక చేరి నప్పుడు , సకలం తేట తెల్ల మవుతుంది .*

*ఆత్మ ఒక్కటే శుద్ద మైనది ,గుణాతీత మైనది.*

*మిగిలిన అన్నికోశాలు సంసారపు మకిలి అంటు కొని మలిన మై ఉంటాయి.*

*అలాగని వాటిని త్రుణీకరించ కూడదు*


*https://www.facebook.com/groups/638078683192004*

No comments:

Post a Comment