Saturday, January 29, 2022

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీ రామభక్త వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి వారు తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

మంగళ వారం--: 25-01-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
మనం మనసులో ఒక ఆలోచన నాటితే అది పనిగా పెరుగుతుంది.. అదే పని చేయటం మొదలు పెడితే అది ఒక అలవాటుగా మారుతుంది.. అలవాటును క్రమబద్ధంగా ఆచరిస్తే మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం బాగుంటే మీ తలరాత మారుతుంది..అర్థమైందిగా మీ తలరాతను మీరే రాసుకోవచ్చు👍

మనస్సులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషము నింపుకొని ఉన్నవారు మన ముందు తియ్యగా మన వెనుకాల చేదుగా మాట్లాడుతారు ఒకటి మాత్రం నిజమనేది గమనించాలి సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ ! గుంట నక్కతో దోస్తీ అత్యంత ప్రమాదకరం .

బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి . బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి , ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకండాలి . నలుగురితో కలిసుండాలంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది .

మనం బాద పడితే మనల్ని ఓదార్చే వాళ్ళు కొందరు , మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు మనతో ఏ బంధం లేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు . అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు

సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment