Sunday, January 30, 2022

మానవ_జన్మ

 #మానవ_జన్మ.


ఈ ప్రపంచలోకి వచ్చేటప్పుడు ఏ జీవి కూడా 

తన వెంట ఏదీ తీసుకురాలేదు, 

అదే విధంగా వెళ్లేటప్పుడు కూడా ఏదీ తీసుకువెళ్లలేదు’ ఈ జీవిత సత్యాన్ని గుర్తించడమే కాదు..

ఎల్లవేళలా స్మరించుకోవాలి.


చెదపురుగు పుట్టి గిట్టుతుంది. 

దానివల్ల మరొకరికి లాభం లేదు కేవలం నష్టం తప్ప. అట్లాకాక మనిషిగా పుట్టి విచక్షణా జ్ఞానం ఉన్నందువల్ల భగవద్గీతలో చెప్పినట్టు 

మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, 

దాని వల్ల వచ్చే ఫలితాన్ని భగవంతుడికే వదిలివేయాలి. మనిషి జీవితం భగవంతుడి చేతుల్లో నడుస్తుంది. 

మనం నిమిత్తమాత్రులమని సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి.


సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. 

ఏ ఇతర జీవికి భగవంతుడు ఇవ్వని వరం మనిషికి మాట్లాడే రూపంలో ఇచ్చాడు. 

మన మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులు సంతోషిం చేవిధంగా మాట్లాడాలి. 

భగవంతుడి ప్రతి నిర్ణయం వెనుక పరమార్థం 

దాగి ఉంటుంది. 

దాని నుండి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు. 

‘మానవసేవే మాధవసేవ’ అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకుని సామాజిక సేవలో నిమగ్నం కావాలి. జీవితంలో నీతిగా, నిజాయితీగా ఉంటూ 

ప్రశాంతంగా జీవించాలి. 

ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.


భగవంతుడు గుణాతీతుడు. 

మనిషి గుణాలకు అధీనమై ఉండేవాడు. 

గుణాల్లోను రజోగుణం, తామస గుణం వల్ల మనిషికి కామక్రోధాదులు కలుగుతాయ. 

కోరిక ఉద్భవించడం, అది తీరక పోవడం వల్ల 

కోపంతో ఇతరులను తిట్టడం వారి మీద 

కసి, ద్వేషం పెంచుకోవడం జరుగుతుంది. 

మనకు దక్కనిది ఇతరులకు దక్కుతుందనగానే 

వారిని నాశనం చేయాలనే దుష్టబుద్ధి ఏర్పడ్డం జరుగుతుంది. 

వీటి అన్నింటికీ కారణం మాత్రం రజోతామసగుణాలే. కనుక ఈ గుణాలను అణచివేయాలంటే గుణాతీతుడైన భగవంతుని పాదపద్మాలే శరణ్యం. 


ఎప్పుడైతే భగవంతుడే అన్నింటికి కారణుడు 

అని తెలుసుకొంటే అపుడు బుద్ధి అందరిలోను భగవంతుని అంశను చూడగలుగుతుంది. 

భగవంతుని అంశను చూసినపుడు సమత్వబుద్ధి 

దానితో పాటు ఎవరికీ నష్టం చేయకూడదు 

ఇది కేవలం పురాకృత కర్మ వల్ల వచ్చిన స్థితి మాత్రమే అని తెలుస్తుంది. 


కర్మఫలితాలను అవతారమూర్తలు కూడా అనుభవించినట్టు ఇతిహాసాలు పురాణాలు చెబుతాయి.

ఇతరులకు సేవఛేయడంలోనే మనుష్యజన్మకు 

సార్థకత ఏర్పడుతుంది. 

సమాజసేవ చేస్తూ నలుగురి మంచికోసం 

పాటు పడినప్పుడు భగవంతుని తత్వం బోధపడుతుంది.

No comments:

Post a Comment