Wednesday, August 3, 2022

🙏🏽🙌🏿🌹🙊 హితోక్తులు

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి

వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊 హితోక్తులు
👉🏼 Comfort అనేది,
పెద్ద పెద్ద బంగ్లాల్లో,
బ్యాంక్ లాకర్లో దాచిన బంగారంలో,
బీరువాలో దాచిన డబ్బులో,
చుట్టూ చేరి పదిమంది కొట్టె చప్పట్లల్లో,
అక్కడెక్కడా ఉండదు..?
నా దగ్గర కోల్పోవడానికేం లేదు,
అనే తృప్తిలో ఉంటది..
మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి
కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు
కాలికింద ఉంది కదా అని
ధూళిని చులకనగా చూడకు.
కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది
దాని సత్తా ఏమిటో.
అందుకే
ఎవరినీ తక్కువ అంచనా వేయకు
మీ సహాయం కోసం,
చేతులు చాచిన ఎవ్వరిని చులకనగా చూడకూడదు,
ఈ రోజు నీ time బాగుండొచ్చు,
రేపు ఎక్కడుంటావో...? ఎలా ఉంటావో...? ఎవరికెరుక...?
ఎవరు మనకు నిజమైన స్నేహితులో,
మన పరిస్థితి తారుమారైనప్పుడు తెలుస్తుంది.💥☝

👉🏼 వినేటప్పుడు వినయంతో వినాలి.నిజానిజాలు గ్రహించాలి.
మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి గర్వంతో కాదు.
అడిగేటప్పుడు
ఆప్యాయతగా అడగాలి. లోన ఒకటి బయట ఒకటి కాకూడదు.
సమాధానం చెప్పేటప్పుడు
సంస్కారంతో చెప్పడం.
కాదన్నపుడు ముద్దుగా కాదనడం
ఇవే ఒక మనిషి యొక్కగొప్ప లక్షణాలు.
ఈ లక్షణాలు మనలో ఉంటే..
ప్రపంచంలో మనల్ని ప్రేమించని
మనిషి అంటూ ఎవరు ఉండరు.
అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు "పొగడ్తల"తో ఉంటాయి,
అవసరం లేనప్పుడు వచ్చే మాటలు "పొగరు"తో ఉంటాయి.!
బతకడం కోసం నటిస్తే లేదు తప్పు...?
నటిస్తూ మోసం చెయ్యడమే తప్పు.!
కులం కుర్చీని ఇవ్వకుంటే..
గుణం గుర్తింపు ఇస్తుంది.!
జ్ఞానవంతమైన మాటలు,
నలుగురిలో హేళనగా ఉంటాయ్!
“అణిచివేత“ ఆ రోజులలో కంటే,
ఈ రోజులలోనే ఎక్కవ..
లోలోనే జరిగిపోతాంది

సేకరణ

No comments:

Post a Comment