Saturday, November 5, 2022

మంచి మాట..లు(1-11-2022)

మంగళవారం --: 01-11-2022 :--
ఈ రోజూ AVB మంచి మాట..లు
వందల బంధాలు నీకు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజం అనేది, మీ విలువైన సమయాన్ని మీతో కాలం వృధా చేసే వారితో కాదు మీ కోసం ఎదురు చూసేవారితో కలిసి ఉండే ఎర్పాట్లు చేయండి, ఎందుకంటే ప్రేమగా ఎదురు చూసేవారు ఉండటం అదృష్టం అది అందరికీ దక్కదు .

మీకు మంచి అనుకున్నది ఎవరు ఏమనుకుంటారో అనేది ఆలోచించకుండా చేయటమే మంచిది..

ఒక్కోసారి మనసు లోని బాధ పోవటానికి ఏ మందు పని చేయక పోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు .

మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది మనల్ని కాదు మనం సాధిస్తున్న విజయాలను అని గుర్తించాలి, మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే అది మనల్ని కాదు మన వైఫల్యాలను అని గుర్తించాలి .

పుణ్యం అంటే ! నీవు ఇతరులకు సహాయం చేయడం కాదు హాని చేయకుండా ఉండటం , పాపం !అంటే నీవు ఇతరులకు కీడు చేయడం మాత్రమే కాదు ఇతరుల మనసు బాధపడటానికి కారకులు కూడ మీరుయినప్పుడు .

పుస్తకాల్లో లేనిది సమాజంలో ఉంది, సమాజంలో లేనది పుస్తకాల్లో ఉంది, అందుకే బాగా చదివిన వారు ఉద్యోగులు అవుతున్నారు ఏమి తెలియని వారు రాజ్యమేలుతున్నారు .
సమాజం లో జరిగేది ప్రతి ఒక్కటి గీత లో ఉంది గీత లో లేనిది సమాజం లో ఏది లేదు అందుకే,గీత చదవండి రాత మార్చుకోండి, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

🖊️మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

సేకరణ

No comments:

Post a Comment