[11/11, 07:07] +91 73963 92086: సద్గురు పరబ్రహ్మణే నమః
విద్యాసాగర్ స్వామి వారి బోధ 4-11- 2022
సూక్ష్మం దాటుట ఎలా? - 1
**
సూక్ష్మ శరీరం అంటే ఏమిటి?
ప్రాణము మనసు బుద్ధి. అర్థమైందా! ఈ ప్రాణము మనసు ఎందులోనుంచి వచ్చినాయంటే.. అజ్ఞానము అవిద్య చీకటి.
సరే ఫలితం ఏమిటి మరి ? ఆకలి దప్పిక నిద్ర.
ఇవి సూక్ష్మ శరీరం యొక్క ఫలితాలు.
సరే ఇదే సూక్ష్మ శరీరంలోనే మనకి అరిషడ్వర్గాలు కూడా ఉన్నాయి. స్థూల శరీరంలో లేవు కదా అరిషడ్వర్గాలు, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. మరి ఆరిషడ్వర్గాలు సృష్టిలో అన్నిటికీ ఉన్నాయా లేవా! జీవరాశికి అంతటికి ఉన్నాయి. జీవరాశికి అంతటికి ఉన్నాయి అంటే ప్రాణము ఉన్నవి, ప్రాణము లేని జీవులు కూడా ఉన్నాయి.
శి : - ప్రాణము లేని జీవులు అంటే..
గు : - ప్రాణము అంటే శ్వాస క్రియ జరిగేటటువంటి జీవులు ఉన్నాయి, శ్వాసక్రియ లేని జీవులు కూడా ఉన్నాయి.
శి : - అంటే మైక్రో ఆర్గానిజమ్స్
మైక్రో ఆర్గానిజమ్స్ కి శ్వాసక్రియ లేదు కదా!
జీవ ప్రక్రియ ఉంది తప్ప శ్వాసక్రియ లేదు.
జీవ ప్రక్రియ వరకే ఉన్నటువంటి వాటికి అరిషడ్వర్గాలు లేవు. అమీబా ఎవరి మీదనైనా కోప్పడే అవకాశం ఉందా! లేదు కదా! అమీబా ఎవరి మీద అయినా కక్ష కట్టే అవకాశం ఉందా! లేదు.
సో.. వేటికైతే శ్వాసక్రియ లేదో వాటికి అరిషడ్వర్గాలు లేవు. వర్గీకరణ. కానీ శ్వాసక్రియ ఉన్నంత మాత్రాన చేపలు ఎవరినైనా ద్వేషించగలవా! రాగద్వేషాలు ఉన్నాయా! అంటే శ్వాసక్రియ మాత్రమే ఉంటే అరిషడ్వర్గాలు కూడా లేవు. శ్వాసక్రియతో పాటు ఏమి ఉండాలి, మానసిక వికాసం కూడా ఉండాలి.
అంటే వెన్నుముక కలిగిన జీవులు, వెన్నుముక లేని జీవులు. వెన్నుముక లేని జీవులలో మానసిక వికాసము లేదు. శ్వాస వికాసం అయితే ఉన్నది గాని, దానికి మానసిక వికాసం లేదు. బ్లూ వేల్ ఉందమ్మా! బ్లూవేల్ కి రాగద్వేషాలు ఉన్నాయా! లేవు ఎందుకని, దానికి వెన్నుముక లేదు. సో... భూచరాలుగా వచ్చిన తర్వాత మాత్రమే మానసిక వికాసం ప్రారంభం అయినది. జలచరాల వరకే ఉన్నప్పుడు వాటికి మానసిక వికాసం లేదు. కేవలం వాటి ఆహార నిమిత్తం ఏదైనా జంతువుని వేటాడితే వేటాడుతాయి తప్ప, వాటికి ఏ రకమైనటువంటి మానసిక వికాసం లేదు.
కాబట్టి వెన్నుముక కలిగినటువంటి ప్రాణులలో మానసిక వికాసం ప్రారంభం అయినది. ఆ వెన్నుముక రెండు రకాలుగా ఉన్నది. ఒకటి భూమికి సమాంతరంగా ఉన్నది. రెండవది భూమికి లంబకోణంలో ఉన్నది. నిటారుగా ఉన్నది. బుద్ధి వికాసం వచ్చేటప్పటికి భూమికి నిటారుగా ఉన్నటువంటి జీవులలోనే వచ్చినది. మనో వికాసమేమో భూమికి సమాంతరంగా వెన్నుముక ఉన్నవాటిలో కూడా ఉంది. బుద్ధి వికాసం మాత్రము వెన్నుముక నిటారుగా నిలబెట్టగలిగిన మానవులలో మాత్రమే వచ్చినది.
కాబట్టి సూక్ష్మ శరీర వికాసం చేత జలచరాలు భూచరాలైనాయి. భూచరాలలో కూడా మరల మానవులైనాయి. కాబట్టి జీవ శరీర పరిణామం ఈ సూక్ష్మ శరీర వికాసమే కదా! అంతకుమించి వేరే ఏమైనా ఉన్నదా!
శి : - లేదు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగే పరిణామం.
గు : - అంతే కదా! అక్కడ మరి మొట్టమొదట ఎలా ఉన్నాము... స్విమ్మింగ్ ఫుల్ లో ఉన్న ఫిష్ లాగే ఉన్నాము. స్లోగా సూక్ష్మ శరీర వికాసం వచ్చే కొలది మనలో స్వీయ ప్రాణ శక్తి ఏర్పడి, స్వీయ అస్తిపంజరం ఏర్పడి, స్వీయ నిటారుగా నిలబడగలిగే దశ వచ్చేంత వరకు అంటే ఎనిమిదేళ్ళు దాటే వరకు, పుట్టిన తర్వాత 8 ఏళ్ళు దాటేంత వరకు, వాడి స్వబుద్ధి పనిచేస్తోందా! లేదు. 16కి వస్తేగానీ వాడి స్వబుద్ధి పనిచేయటం లేదు. అందుకని 16 వరకు మానసిక వికాసమే. 16 తర్వాత ఏమైనది, బుద్ధి వికాసం వచ్చింది. 24కి వచ్చేటప్పటికి బుద్ధి వికాసం పూర్తయిపోయింది.
అందుకని 24 లోపల పెళ్ళి చేయమన్నాం. ఎందుకని బుద్ధి వికాసం పూర్తి అయిపోతే నేను బలపడిపోతుంది. అహంకారం బలపడిపోతుంది. అందుకనే చూడండి... 24 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. వారిలో అహం బలంగా ఉంటుంది. ఏవో కారణాంతరాలు చెప్పుకుంటారు. చదువు అవలేదనో, స్థిర పడలేదనో, ఉద్యోగం రాలేదనో... ఏవో రకరకాల కారణాలు చెప్పుకుని 24 తర్వాత పెళ్ళి చేసుకుంటారు. వారిలో అహం బలంగా ఉంటుంది. సర్దుబాటు దోరణి ఉండదు. అందుకని 21 పెట్టారు మనవాళ్ళు. 21 నుంచి 24 సంవత్సరాల లోపల పాతికేళ్ళు వచ్చేటప్పటికి పెళ్ళి చేసేయండి నాయనా అంటారు.
శి : - 30 ల వరకు వెళ్ళిపోయింది.
గు :- ఎందుకని సూక్ష్మశరీర వికాసం దృష్టిలో పెట్టుకుని చెప్పారు. స్థూల శరీరాన్ని బట్టి చెప్పలేదు. మన గొడవ అంత స్థూల శరీరం కదా! అందుకని ఆ దృష్టితో చెబుతూ ఉంటాము.
ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే మానవ జీవితంలో ప్రధమార్ధం అంతా సూక్ష్మ శరీరమే కనిపిస్తోందా లేదా! 25 ఏళ్ళు వచ్చినాయి. అంతఃకరణ చతుష్టయములో మనోవికాసం, బుద్ధి వికాసం వచ్చింది, కానీ చిత్తశుద్ధి వచ్చిందా! రాలేదు. ఇప్పుడు 25 నుంచి చిత్తశుద్ధి పనికి మొదలుపెట్టాడు. ఎన్ని ఏళ్ళు పడుతుంది అంటావు చిత్తశుద్ధి రావడానికి...
[11/11, 07:07] +91 73963 92086: శి : - అంటే వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి...
గు : - పాతికేళ్ళు పడుతుంది. 25 ఇయర్స్ పడుతుంది. అప్పుడు అహంకార వికాసం కూడా పూర్తయిపోతుంది. చిత్తశుద్ధి రావాలి అంటే అహంకారం బలపడాలి, అహంకారం చేత బాధించబడాలి, అది చిత్తవృత్తులలోఎలా ఉందో తెలియబడాలి.. అప్పుడు చిత్తశుద్ధి అవ్వాలి. అందుకు అంత టైం పడుతుంది. 50 వచ్చేటప్పటికి... అసలు సమస్య నేనే అని తెలుస్తుంది.
ప్రపంచం కాదు నా సమస్య, నా ప్రాబ్లం ఎవరయ్యా అంటే నేనే. నా అజ్ఞానమే, నా అవిద్యే. అజ్ఞానము, అవిద్య, చీకటి అనేటటువంటి అంశాలు ఎక్కడెక్కడ అయితే నా యందు బలంగా ఉన్నాయో వాటి చేతనే నా జీవితం అంతా ఇలా అయింది. అని 50 కి అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పటికి గృహస్థాశ్రమము అయిపోతుంది. ఇది గుస్థాశ్రమంలో ఫలితం. ఏమిటయ్యా ఫలితం అంటే, నీ అజ్ఞానం, నీ అవిద్యే అని తెలియచెబుతుంది బాగా, ఎవరికి వాళ్ళకి. ఎందుకని ఎప్పుడూ పక్క వాళ్ళ మీద ఆరోపిస్తాము కదా మనము. నా దుఃఖానికంత నువ్వే కారణం అంటూ ఉంటాడు.. 25 నుంచి 50 దాకా. 50 తర్వాత అనడు ఇక. ఎందుకని, అర్థమైపోతుంది.
50 వరకు అర్థం కాని భార్యాభర్తలు 50 వచ్చేసరికి అర్థం అయిపోతారు. ఎందుకని, ఇదంతా నా కర్మవశం. నాలో ఉన్న గుణాలు. నాలో ఉన్న అహంకారం. నాలో ఉన్నటువంటి అవిద్య. నాలో ఉన్న అజ్ఞానం.
కాబట్టి జాగరుకుడై 50 నుంచి మొదలు పెడతాడు వానప్రస్థాశ్రమంలో. చిత్తశుద్ధి వచ్చింది కదా ఇప్పుడు.
శి : - అంటె సాధనతో చిత్తశుద్ధి ముందే...
గు : - ముందు నార్మల్ జీవితము ఆలోచిద్దాము. ఆలోచించిన తర్వాత అప్పుడు సాధన ఎట్లాగా...
50 వచ్చేసరికి వానప్రస్తాశ్రమానికి వచ్చేస్తాడు దాదాపుగా. ఎందుకని శారీరక శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. 25 లో ఉన్న బలం ఉంటుందా, ఉండదు కదా. 50 కి వచ్చేటప్పటికి సగానికి సగం శరీర బలం తగ్గిపోతుంది. స్థూల శరీరం తగ్గిపోతుంది. సూక్ష్మ శరీరంలో కూడా సంతృప్తి అసంతృప్తులు ఇక సాధ్యపడని అంశాల జోలికి వెళ్ళడు. సాధ్యమయ్యే అంశాలను ట్రై చేద్దాము అసాధ్యమయ్యే అంశాల జోలికి వెళ్ళవద్దని మానేసుకుంటూ ఉంటాడు. 50 నుంచి ఒక పరిణామం ప్రారంభమవుతుంది. ఏవి సాధ్యం.. ఏవి అసాధ్యం.. అనే దృష్టితో చూస్తాడు. 50 నుంచి 75 వరకు ఆ పరిణామం పూర్తయిపోతుంది.
ఇక 75 తర్వాత ఏమి చేస్తాడు... ఇక అసాధ్యం అన్న అంశాలు వదిలేస్తాడు. ఇప్పుడు ఆ విచారణే లేదు. సాధ్యపడే అంశాలలో నా నిర్ణయం ఏమిటి అని వెతుక్కుంటాడు. ఏదైతే సాధ్యమైనాయో 75 లోపల వాటిలో నా నిర్ణయం ఏమిటి అని తనలో తాను తర్కించుకోవడం మొదలుపెడతాడు 75 కి. అందువలన 75 తర్వాత మానవులందరూ కూడా సహజంగా తమలో తాము ఉంటారట.
చూడు.. వృద్ధాప్యంలో అందరూ ఎట్లా ఉంటారు... యాక్టివిటీస్ అన్ని తగ్గిపోతాయి. ఏకాంతం వచ్చేస్తుంది. తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. సాధ్యపడిన వాటిలో ఉన్న సంతృప్తులు అసంతృత్తులు పోగొట్టుకోవడం ఎట్లాగో విచారణ చేస్తూ ఉంటాడు ఎప్పుడు..
అందువలన 75 తర్వాత ఏమైనా కదిలించామనుకో... ఎక్కడికి వచ్చేస్తాడు.
అయితే 25కో, లేకపోతే 50కో, లేకపోతే 75 కో..
వీటి మీద ఊగిసలాడుతూ ఉంటాడు.
ఆ ఊగిసలాటతో 100 పూర్తి అయిపోతుంది. ఇది మానవ జీవితం.
ఇప్పుడు జననం నుంచి మరణం దాకా సూక్ష్మ శరీరమేగా ఇది అంతా.. అవునా కాదా! అంతా ప్రాణ మనోబుద్ధిలే కదా! మరి ఈ ప్రాణ మనోబుద్ధులను దాటడం ఎట్లాగా! అధిగమించాలి అంటే సాధన కావాలి. అదిగమించాల్సిన అవసరం లేకపోతే సాధన అవసరమా! లేదు కదా ! కాబట్టి ఎవరికైతే వీటిని అధిగమించాలనే ఆలోచన 25 లో రావాలి కనీసం. ఎందుకని, అప్పటికి స్థిరపడ్డాడు కదా! ప్రాణమనో బుద్ధులు తెలిసినవి అప్పటికి, అహంకారం బలపడకముందే వీటిని దాటే సాధన ప్రారంభించాలి.
8 లో ప్రారంభించారమ్మా... అప్పుడు వాళ్ళు పీఠాధిపతులు. బాల్యంలోనే సాధన ప్రారంభించాడు అనుకోండి... వాడికి ఆ జన్మలో ముక్తి లభిస్తుంది, పీఠాధిపత్యం లభిస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది. సులభం కదా ఎనిమిదిలో ప్రారంభిస్తే. కానీ ఎనిమిదిలో ప్రారంభిస్తారా! అసాధ్యం కదా!
16 కి వచ్చిన తర్వాత అయినా కనీసం ప్రారంభించు నాయనా అంటాము. 16కైనా ప్రారంభిస్తాడంటావా! ఇంకా నాకు ప్రపంచం తెలియలేదు. ప్రపంచానుభవం కలగలేదు అంటూ ఉంటాడు.
25 కి ప్రారంభించాడనుకో... సాధనంతా మనం సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని రద్దు చేసుకోవడానికే. ఏ సాధన చేసిన ఆ సాధన యొక్క ఫలం ఏమిటయ్యా అంటే నీవు సూక్ష్మ శరీరం కాదు, నీవు కారణ శరీరం కాదు, నీవు మహాకారణం అనే నిర్ణయాన్ని అందించాలి. ఏ సాధన చేయాలన్నా దైవాన్ని ఆశ్రయంగా పట్టుకోవాలా వద్దా!
శి : - పట్టుకోవాలి.
గు : - మరి ఆ దైవం స్థూలమా, సూక్ష్మమా, కారణమా, మహా కారణమా...
శి : - మహా కారణం
గు : - కదా మరి. అమ్మవారి నామాలలో మొదటిలోనే ఏమున్నది.. 'చిదగ్నికుండ సంభూతా' అని ఉంటుంది. చిదగ్ని అంటే అది మహా కారణం కదా! మరి అమ్మవారిని మహా కారణ స్థితిలో దర్శించగలుగుతావు కానీ, సూక్ష్మ స్థితిలో దర్శించాలనుకోవడం ప్రతిబింబ దర్శనం కాదా!
[11/11, 07:07] +91 73963 92086: శి : - అవునండి.
అందుకని మానవుడు ఆ మహా కారణ స్థితికి ఎగర లేని వారికోసం, అందుకోలేని వారి కోసమని ఆర్చారూపాలను సృష్టించాడు. అందుకని అమ్మవారికి వివిధ అర్చారూపాలు కనబడుతూ ఉంటాయి. ఏమిటవి... ఏదో మహాలక్ష్మి, ఏదో అష్టలక్ష్ములు, ఏదో సరస్వతి దేవి, మహాకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్దని ఆయా సందర్భానుసారం ఆవేశావతారాలుగా ఆవిర్భవించినటువంటి పౌరాణిక వైభవాలు ఉన్నాయో వాటన్నిటికీ అర్చారూపాలను స్పృజించారు. కానీ అవి వాస్తవిక రూపాలేనా,
శి : - ప్రతిబింబ రూపాలు.
గు : - అంటే, సూక్ష్మంలో పనిచేయడానికి పనికి వస్తాయి అవి. అంటే నీ ప్రాణ మనోబుద్ధులను స్వాధీనం చేసుకోవడానికి పనికి వస్తాయి. అందువలన ఏం చేశారు... అందరినీ లలితా సహస్రనామం చదువుకోండి, ఖడ్గమాల చదువుకోండి, లలిత త్రిశతి చదువుకోండి, ఆ పంచరత్నం చదువుకోండి, మీనాక్షి పంచరత్నం చదువుకోండి... ఇలా ఏవేవో రకరకాలైన స్తోత్రాలను శంకర భగవత్పాదులు ప్రాణ మనోబుద్దులను స్వాధీనం చేసుకోవడం కోసమని ఆ పూజా విధానాన్ని సహస్ర నామావళిని, స్తోత్రాలని అందించారు.
మరి తత్వార్ధం ఏమైనా గ్రహించాడంటావా! గ్రహించలేదు కదా! ఎందుకని విచారణే చేయలేదు కదా! విచారణ చేస్తే కదా తత్వార్థం గ్రహించడానికి, ఎవరైతే ప్రాథమిక దశలలో కర్మ మార్గం భక్తి మార్గం మధ్యలో ఇట్లా పరిణామం చెందుతూ ఉంటారో వాళ్ళు ఎవరో ఒక గురువును ఆశ్రయించి తత్వార్ధాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారు.
అప్పుడు వారు చెప్తారు... నాయనా తత్వజ్ఞానం తెలిస్తే తప్ప నీకు మహా కారణం వీలు కాదు.
మరి మహాకరణ స్థితిలో ఉన్నటువంటి దైవాన్ని నీవు అమ్మ అనుకుంటావో, అయ్య అనుకుంటావో... అది దైవం కదా అది దివ్యత్వం కదా! దివ్య శక్తి కదా! దివ్యజ్ఞానం కదా! దివ్య ప్రకాశం కదా! దివ్య జీవనం కదా! మరి ఆ స్థాయికి నీవు ఎదగాలా! ఆ దివ్యత్వాన్ని మీ స్థాయికి దించాలా!
శి : - ఆ స్థాయికి ఎదగాలి.
గు : - ఎదగాలంటే మరి జ్ఞానం కదా, ఎదగడం ఎప్పుడూ జ్ఞానం కదమ్మా, దించడం ఏమో కర్మ.
అంటే అర్థం ఏమిటి? ఏమైనా సరే మా అబ్బాయికి అమెరికాలో సీటు వచ్చేటట్లు చేయాలి. రోజు ఖడ్గమాల చదువుకోండమ్మా... ఏమైంది అప్పుడు... నీ ఇచ్చానుసారం దైవాన్ని పనిచేయమంటున్నావు. ఇదేమో కర్మమార్గం. నా ఇచ్ఛలేదు.. 'నేచ్ఛయాకృతం'... అదే కర్మని ఇచ్ఛ వదిలేసి చేశావు. అప్పుడు ఏమైనది.. నిష్కామ కర్మ. ఎప్పుడైతే నిష్కామ కర్మకి వచ్చాడో... అప్పుడు భక్తి. నిష్కామ కర్మకి రానంతవరకు అది భక్తి అనబడదు. కర్మే.
ఏమండీ! భక్తి కర్మ కాదా! కర్మే.
కానీ అది నిష్కామ కర్మ.
ఏమిటండీ ఫలితం... జ్ఞానం.
భక్తి ఫలం ఏమిటంటే... జ్ఞానం.
హరిఃఓం
No comments:
Post a Comment