Friday, November 11, 2022

ఒకరు ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పగా, మరొకరు అదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు! సత్యాన్ని నిర్ధారించేది ఎలా?

 🌻ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌺

                    *భక్తుడు :* 
  ఒకరు ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పగా, మరొకరు అదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు! సత్యాన్ని నిర్ధారించేది ఎలా?

                   *మహర్షి :*
 ప్రతివారూ వారి ఆత్మనే చూస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ..... ప్రపంచాన్నీ, దైవాన్ని కూడా వారు ఉన్న స్థితిని బట్టే చూస్తారు.

   ఒకసారి ఒక నాయనార్ దైవదర్శనానికి కాళహస్తికి వెళ్ళాడు. వారికి అందరూ శివుడుగా, శక్తిగా కనిపించారు. ఎందుకంటే తాను అట్టివాడే కనుక. 
   
   *ధర్మపుత్రుడు ( ధర్మరాజు )* 
         ఇలా భావించాడు ....
         
   *ప్రపంచంలోని ప్రజలు అందరూ ఏదో ఒక విధంగా పుణ్యశీలురని, ఏదో ఒక కారణంగా తన కన్న గొప్పవారే.* 
   
           *దుర్యోధనుడు* 
                 ఇలా భావించాడు ... 
                 
   *ఈ ప్రపంచంలో ఒక్క మంచివాడు కూడా కనిపించటం లేదు.*

    అదేవిధంగా , *ప్రతి వ్యక్తికి వారి వారి ప్రతిబింబమే ( స్వభావమే ) కనిపిస్తుంది.*

            🌺ఓం తత్సత్🌻

No comments:

Post a Comment