[11/3, 09:15] +91 73963 92086: *🧘♂️61- శ్రీ రమణ మార్గము🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*
*11 - మూడవ భాగం*
ఆత్మవిచారణ చేయకపోతే, జీవితంలో లోక విచారణ ప్రవేశిస్తుంది. విచారణ కన్నా ఏ భక్తి, ఏ సత్కర్మా అధికం కాగ, ఆత్మవిచారణ, ఒక విభజన కాదు. కేవలం తానేదై వున్నారో, దాని మీద దృష్టి కేంద్రీకరించడం. అంటే, నిరంతరం మనలో "నేను నేను” అని అంటున్న దానిపై దృష్టి పెట్టడం.
అజ్ఞానపు తెర తొలగించడానికే, ఈ సాధనలన్నీ. ఆత్మనే తెలుసుకోవడం కోసం చేసే సాధన, ప్రయత్నం దానికైన ఆశ అన్నీ స్వప్నంలోని భాగాలు, కాకపోతే, భ్రాంతి. ఆత్మను తెలుసుకోవడమంటే, మనలో రెండు "నేను"లు వున్నట్లూ, ఒకటి మరొక దాన్ని తెలుసుకోవడంవలె కాదు. అసలు సత్యాన్ని, అసత్యంగా భావించే పొరపాటును పోగొట్టడం.
ఆత్మసిద్ధి కోసం చేసే సాధన ఎట్లా వుంటుందంటే, “మీరు మీ ఇంట్లో వుంటూ, మీరు మీ ఇంట్లోకి వెళ్ళడానికి ఏది దారే ఎన్ని దారులున్నాయి? ఆ దారుల్లో ఏది మంచిది? ఏది దగ్గర దారి? ఏది సులభమైనది?" అన్నట్లు వుంటుంది. అసలు సంగతి ఏమిటంటే, ఆత్మ నీలోనే వుంది. నువ్వే ఆత్మ స్వరూపానివి దాని కోసం ఏ సాధనలు చేయనవసరం లేదు. అవి గ్రంథాల్లో వుండే సంగతి కాదు. ఆత్మ ఎప్పుడూ అవగతమవుతూనే వుంది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో దాన్ని చేరుకోవడమే, జీవిత లక్ష్యంగా చెపుతారు.
లోదృష్టి వల్ల ఆత్మవిచారణ సాధ్యమౌతుంది. కంటే కనపడక, నీటిలో కరిగివున్న ఉప్పును రుచి ద్వారా తెలుసుకున్నట్ల బుద్ధి ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు. విచారం ద్వారా కాక మరొక మార్గాన అంటే, దొంగ, పోలీసు అధికారియై, తనని తాన పట్టుకోవడం వంటి మార్గాన ఆత్మను తెలుసుకోవచ్చు.
లోదృష్టితో వుండి, ఆత్మలో ఐక్యం కావాలంటే. మనో విజృంభణ పూర్తిగా అణగి నాశనం కావాలి. అట్టి సమాధి స్థితిలోనే, ఆత్మ అనుభవైక్య వేద్యం కాగలదు. అట్టివారికి ప్రపంచం భిన్నంగా తోచదు. వారు సహజ సమాధి స్థితిలో చలిస్తారు. సమస్త కార్యకలాపం, సినీమా తెర మీద బొమ్మలు మాదిరిగా కదిలి, గతించిపోతుంది. దానికంతకూ వారు సాక్షి భూతులుగా వుంటారు.
నిజం చెప్పాలంటే, ఆత్మసాక్షాత్కారము అనేది కేవలం మాట మాత్రమే. కాని, ఆత్మసాక్షాత్కారం అనేప్పటికి ప్రజలు ఏదో మహాత్యం జరుగుతుందని ఎదురుచూస్తారు. అది ఒక మెరుపులాగ ఆకాశంలోంచో, స్వర్గంలోంచో వూడిపడుతుందనే భావనలో వుంటారు. ఏదైనా కొత్తగా వచ్చిందంటే, అది పోతుంది. కొత్తగా పుట్టింది. అయితే, అది చేస్తుంది. నిర్మాణం అయిందంటే, అది నాశనమౌతుంది. పొందేది అయితే, నష్టమౌతుంది. కాని అది అటువంటిది కాదు. "నేను ఈ దేహం. నేను ఇది, నేను అది అనే భావం పోవడమే, ఆత్మసిద్ధి. అంటే, నువ్వు అసలైన నువ్వుగా మిగలడం.
ఆత్మ పొందేదే అయితే, అది నష్టం కావడానికి వీలు వుంటుంది. అంటే, అది అశాశ్వతమన్నమాట. అది కలిగించే ఆనందం కూడా తాత్కాలికమే అవుతుంది. అందుచేత పొందేదేదీ శాశ్వతం కాదు. ఆత్మ ఎప్పుడూ వుండేదే! దానికోసం ఆరాట పడటం, ఆతృత చెందటం, ఆశించడం, ప్రయత్నించడం మూర్ఖం. భవిష్యత్తులో జరిగే దానికి ఎందుకు ఆందోళన చెందటం? అక్కడ క్షణంలో వున్నదే ముఖ్యం. అంటే, “ఆ క్షణం” అదే వర్తమానం. ఉన్నదీ అదే! కనుక నువ్వు ఎప్పుడూ ఆత్మవే. ఆత్మను ఎరిగిన వాడవే. అసలు నువ్వే ఆత్మ. కాని, అజ్ఞానం వల్ల నువ్వు ఆ యదార్ధానికి ఎరుకలో లేవు. అంతే! కనుక వర్తమానమే ముఖ్యం. భవిష్యత్తు కోసం చూస్తూ వర్తమానాన్ని వృధా చేయకూడదు. ఆ క్షణం మీదే దృష్టి పెట్టాలి. మనం ! వున్నాం. దాన్ని నిష్కామ కర్మాచరణ యోగ - విచారణ మార్గాల ద్వారా ఎప్పుడూ అదైన, ఆత్మయై ద్వారా, భక్తి - జ్ఞాన యోగ. తెలుసుకోవాలి.
ఆత్మసాక్షాత్కారానికి అవరోధాలు స్మృతి, జ్ఞప్తి, ఆలోచించే నిజంగా, అలవాటు, విషయ వాసనలు, పోగుచేసుకునే బుద్ధి. శ్రద్ధగా ఆత్మను తెలుసుకోవాలంటే, గట్టి కోరిక వుంటే, ఆత్మ దర్శనం కాకమానదు. ఆ సంకల్పమే, గురుపై మనల్ని ఆ మార్గాన మరింత సులభంగా నడుపుతుంది. దానికి మనసంతా పూర్తిగా `కేంద్రీకృతశక్తితో ఎరుకలో వుండి పనిచేయాలి. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారానికి దేహం కాదు అడ్డు, అహంకారం, అదే దేహాత్మ బుద్ధి. అహంకారం చావకపోతే, మృత్యువు దాన్ని పోగొట్టదు. కనుక బ్రతికి వుండగానే అహంకారం నాశనమైతే, మృత్యువు దాన్ని తిరిగి పుట్టించదు.
ఆత్మసిద్ధి అసాధ్యం అనుకోవడం కూడా ఒక తలంపే ఆతలంపే ఆత్మసిద్ధికి అడ్డు, అవరోధం, ఆటంకం. ఆ తలంపు కలగడమే, అజ్ఞానం. దాన్ని నిరోధించావా, అంతా చక్కబడుతుంది. అజ్ఞానానికి సమమైనదే అహంకరణ. దాని మూలాన్ని చేరితే, అది అదృశ్యమౌతుంది.
“నేను” అనే మొదటి తలంపు ఎక్కడ నుంచి పుడుతుందో గమనిస్తే, " నేను ” అనే అహంభావం అదృశ్యమై, అనంతమైన “అహ మహం” అనే స్ఫురణ కలుగుతుంది. అంటే, దేహాత్మ బుద్ధి నశిస్తుంది. “నేను దేహాన్ని” అనే నిశ్చయభావం కూకటివేళ్ళతో కూలుతుంది.
[11/3, 09:16] +91 73963 92086: అందుచేత “నేను” అను మొదటి తలంపు, పుట్టు చోటు తెలుసుకుని అక్కడ నిశ్చలంగా నిలవాలి. అక్కడ వున్న దేదో అది అంతటా ఒకటిగా, సమంగా, నిత్యసత్యంగా, శాశ్వతంగా వుంది. అదే అంతనీ చూసుకుంటుంది. అక్కడ ప్రత్యేక వ్యక్తిత్వపు శక్తి ఏదీ పనిచేయదు. సముద్రం, అలలను లక్ష్యపెట్టనట్లు; దేహాన్ని గుర్తించదు.
నువ్వు చేయవలసింది, నిశ్చలంగా వుండటం. ఆ నిశ్చలలే “నేను" అన్న స్ఫూర్తి. అదే ఆత్మస్థితి. అది వర్తమానాల వాస్తవత్వాన్ని అనుభవిస్తుంది. అది అన్నింటికీ సంపూర్ణఎరుకలో వుంటుంది. అదే మన సహజ స్వభావం. అప్పుడు కలిగే సహజ స్థితినే. "నిర్వికల్ప సమాధి”అంటారు.ఎందుకంటే, ఆ స్థితిలో మనసు సంశయాలనుంచి, స్వేచ్ఛ పొందుతుంది. ఆ స్థితిలో వున్న వారికి ఒక దానివెంట మరొకటి సంభవించే అవకాశాలూ, బహుశా జరగవచ్చుననే ఆశలూ వాటి మధ్య వూగిసలాడవలసిన పని వుండదు. అంటే, ఏ రకమైన వికల్పం వుండదు.
నువ్వు చూడవలసిందీ, చేయవలసిందీ నిశ్చలంగా, వుండటం. అంటే, నువ్వు; పున్నట్లే వుండటం. అంటే, నువ్వేం చేస్తున్నా, నువ్వు నువ్వే. నువ్వు, నువ్వు కాకుండా పోవు. కాని, మమకారం లేకుండా, యిష్టాయిష్టాల ప్రమేయం లేకుండా పనిచేయాలి. లేదా ఆ పని జరుగనివ్వాలి. జరిగే వాటికి మనసును గొడవపడనివ్వ కూడదు.
నీ పని, వుండటం. అంటే, “అలా వుండాలి. ఇలా వుండాలి. అలా వుంటాను. ఇలా వుంటాను" అని కాదు. నిశ్చలంగా, స్థిరంగా వుండటం. అదే నీ ధర్మం. ప్రతి పవిత్ర గ్రంథం, ప్రతి మహాత్ముడూ “వూరికే వుండు. BE QUITE. BE STILL" అంటారు. అందుచేత “BE - వుండు. అది చాలు" అంటారు భగవాన్.
ఊరికే వుండటం అసాధ్యం. ఏళ్ళ తరబడి అనేక విధాల పోగుజేసుకున్న విషయవాసనల బైటపడి, వూరికే నుంచి నిశ్చలంగా వుండటం సాధ్యం కాదు. దానికి గట్టి సాధ్యం సాధన చెయ్యాలి - “BE STILL” అంటే, సర్వేంద్రియాల సంచలనాన్ని నిలిపి, వున్నట్లు వుండటం. ఆ సాధనామార్గం, ప్రేమకు కళ్ళు తెరిపిస్తుంది.
ప్రశాంతంగా వుండాలంటే, తప్పనిసరిగా థ్యానం ద్వారా మౌనస్థితికి వెళ్ళాలి. ధ్యానానికి కావలసింది అనుగ్రహం కాదు, నిరంతర సాధన. అది నీ చేత జరిగే సంగతి. నువ్వే ధ్యానం. నీ నిజ స్వభావమే ధ్యానం. ఆ థ్యానం నీకు విడిగా లేదు. దానికి నువ్వే కేంద్రం. అదే హృదయం - ఆత్మ దైవం అదే అసలు నువ్వు. దాన్ని అందుకోవడానికే నిన్ను నీవు తెలుసుకోవడానికే, నువ్వు ధ్యానం చేస్తావు. అందుకే “ధ్యానమంత ఉత్తమమైనది లేదు" అన్నారు భగవాన్.
ఆత్మసిద్ధి కలిగిందంటే, అసలు తామేదో అదైనారన్నమాట. అంటే, పరిపూర్ణులైనారని అర్థం. అంటే, ఆత్మస్వరూపులై నారు. ఆ స్థితిని మాటల్లో వర్ణించడం బహు కష్టం. ఆ స్థితిని అందుకున్న వారు ఆదీ - ఇదీ, ఏదీ కాకుండా, ఆత్మగా మిగులుతారు. ఊరికే వుండటమంటే, అదే. అంటే, ఏ మాత్రం ప్రత్యేక వ్యక్తిత్వపు స్ఫురణా లేకుండా నిరంతరం తాను, తానుగా వుండటం. అంటే, SEEING IS BEING.
అందుచేత ఎప్పుడూ ఆత్మను తెలుసుకునేవాడివిగా వుండక పోవడమే, పరిపూర్ణంగా వుండటం. ఆ స్థితిలో వున్నవారు సంసారం చేయవచ్చు. గుహలో జీవించవచ్చు. వారికి అన్నీ, అంతా, ఒకటె. అటువంటి మహాత్ములు ఇట్లా వుండాలి, అట్లా అక్కడ ఉండాలి, ఇక్కడ వుండాలి అనేది లేదు.
ఆత్మలో ఐక్యమైన వారికి ప్రపంచం లేదు. ప్రపంచం పట్టదు. వారికి బాధ, దుఃఖం ఏమీ వుండవు. దానికి కారణం,వారిలో అవిద్య నాశనం కావడం. అసలు అవిద్య అనేది వాస్తవంగా లేదు. సమస్త శాస్త్రాలూ "అవిద్య" అనేది లేడని చెప్పడానికి చేసే ప్రయత్నాలే. అవిద్య కేవలం, అజ్ఞానం. కాళపోలే, ఆత్మను మరవడం. సూర్యుని ముందు చీకటి లేనట్లే, జ్ఞానప్రకాశంలో అవిద్యకు తావు లేదు.
ఆత్మ సిద్ధించిన వారికి శక్తులు ఉత్పత్తి కావచ్చు. వారి చుట్టూ జనం చేరి గోల చేయవచ్చు. అయినా వారు చలించరు. వారి స్థితీ భిన్నం కాదు. అటువంటివారికి ఏకాంతవాసంతో పని లేదు. వారు నిరంకుశాధికారులుమల్లేనో, చంటిబిడ్డలు మాదిరిగానో వుంటారు. వారికి ఎటువంటి జాగ్రత్తలు, ఆందోళనలు వుండవు.
"ఆత్మసాక్షాత్కారం పొందినవారు మళ్ళా ఆ స్థితిని పోగొట్టుకోవడమంటూ వుంటుందా ? ఒకరు భగవాన్ని ప్రశ్నించారు.
"అవకాశం లేకపోలేదు. సాధన మొదట్లో చాలా అవకాశం వుంది. ఏమాత్రం బంధం, మమకారం కోర్కెవున్నా ఆ కోర్కె ఎటువంటిదైనా - చివరికి దైవ సంబంధమైన కోర్కె అయినా సరే, కోర్కె మిగిలి వుంటే, వారు తిరిగి మామూలు ప్రపంచంలో పడిపోయే ప్ర్రమాదం లేకపోలేదు.
“అదంతా వాసనల ఫలితం. వాసనలు మనల్ని మన సహజస్థితి నుంచి లాగేస్తాయి, లేదా అడ్డు పడతాయి. వాసనలన్నీ ఒకే ఒక్క సారిగా పోవు గనుక, వాటిని అన్నింటినీ పూర్తిగా సర్వ నాశనం చేయాలి. అంటే, ఏ కోర్కె లేకుండా పోవాలి. లేకపోతే ఎంతటివారి విషయంలోనూ ప్రమాదం వుండనే వుంటుంది. “ఆత్మ సాక్షాత్కారమనేది కొందరికి మెరపుమల్లే కలిగి, పోతుంది. మెరుపులాగ వచ్చేది, మెరుపులాగే పోతుంది. అది ఆత్మసాక్షాత్కారం కానే కాదు” అన్నారు భగవాన్.
[11/3, 09:16] +91 73963 92086: కాని, భగవాన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆయన పొందిన అంతిమస్థితి, చివరి వరకు ఒకే విధంగా నిలిచి వుంది. అనే మాటకు "ఫలానా వారు మోక్షం పొందారు. ఫలానా వారు జీవన్ముక్తులు. ఫలానా వారికి ఆత్మదర్శనమైంది. ఫలానా వారికి ఈశ్వర సాక్షాత్కారం కలిగింది. నిర్వాణస్థితి అందుకున్నారు” అని అంటారు. కాని, అది సరి కాదు. అర్ధం మనకు స్పష్టంగా, పూర్తిగా తెలియక, ఆ సంగతి అనుభవంలోకి రాక, దాన్ని తప్పుగా ఉపయోగించడమే అవుతుంది. ముక్తి పొందేది ఎవరు? దేహమా? కాదు. ముక్తి పొందేది ఎప్పుడూ జీవితం. కాని వ్యక్తి కాదు. ఫలానా వారు మోక్షం పొందారని చెప్పడానికి బాహ్యంగా ఏమైనా గుర్తు వుంటుందా? కాని ఒక గుర్తు వుంటుంది ముక్తి పొందినవారు ఎప్పుడూ ఈ ప్రపంచంలో జరిగే ఏ సంగతికీ, ఏ విషయానికి, ఏ సంఘటనకూ “REACT రియాక్ట్ ” కారు. " అంటే, వారు ప్రతిక్రియ చేయరు, వారు కేవలం ఏదో ఒకటి చేస్తారు, అదీ తమకు ఆ క్షణాన ఏం చెయ్యాలనిపిస్తే, అది చేస్తారు. కనుక మనం చేయవలసిందీ, వారిని చూసి నేర్చుకోవలసింది ఏమిటంటే, మనంకూడా క్రమంగా ప్రతిక్రియల్ని తక్షణ కార్యాల్లోకి మార్చుకో వాలి. మనం చేసే ఆ పనులు పవిత్రంగా వుంటే, క్రమంగా మనలో అనాసక్తభావం ఏర్పడుతుంది. అదే మోక్షం. అంటే, పవిత్రమైన, నిర్మలమైన కార్యకలాపం సాగించడం వల్ల, అహంకారం దాని కదే అదృశ్యమౌతుంది.
ఆత్మ సాక్షాత్కారం వంటి అంతిమ స్థితిని పొందిన తర్వాత వారి దేహం నిలవవచ్చు, లేదా నిలవకపోవచ్చు. ఏమైనా వారికి దేహస్ఫురణ మాత్రం వుండదు.
తాము పొందిన లేక, తమకు కలిగిన, లేక తాము వున్న స్థితి ఏమిటో అసలుసత్యం తెలుసుకున్న మహాత్ములే వర్ణించి చెప్పలేరు. వర్ణించాలంటే, వారు తమ స్థితికిబైట నిలబడ, మాట్లాడాలి కదా ? వారే ఆ స్థితి అయిన తర్వాత ఇంక వారు స్థితిని ఎట్లా వర్ణించగలరు? వర్ణింప శక్యంకాని దాన్ని, వారు మాత్రం మాటల్లో ఎట్లా వర్ణిస్తారు? అది మాటకీ, భావానికీ, ఊహకూ, నామ.రూపాలకూ, మనసుకూ, కాల దూరాలకూ ఆతీతమైన స్థితి.
తమకు కలిగిన దివ్యానుభూతుల్ని మాటల్లో వర్ణించి చెప్పడానికి ప్రయత్నించేప్పటికి వేదాంతులు, తత్వవేత్తలు, 'మహర్షులు భిన్నంగా తోస్తారు. వారి హృదయాంతరాళంలో ఏమి వుందో, ఏం జరుగుతూవుందో, ఏం జరిగిందో - అదంతా మర్మం, మాయ అనవలసిందే! అది తెలియాలంటే, మనమూ ఆ లోపల ప్రవేశించాలి. ఎవరికి వారు, ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత వారూ అంతే! వారూ దాన్ని వారి మాదిరిగా మాటల్లో వర్ణించలేరు.
ఆత్మసాక్షాత్కారం పొందినవారు ఇదంతా ఆనంద తరంగాలుగా చూస్తారు. వారి మనస్సు నిశ్చలంగా, శాంతంగా వుంటుంది. ఏ అలజడీ, కలతా, ఘర్షణా, గందరగోళం, తికమక ఏమీ లేకుండా శాంతంగా వుంటుంది. అది నిశ్చల, గంభీర, అగాధ సముద్రం మాదిరిగా వుంటుంది. ఆ మహాసముద్రంపై తేలి ఆడే తరంగాలే, ఆనందం. అంటే, శాంతి నుంచి ఆవిర్భవించినదే, ఆనందం.
🕉️🌞🌍🌙🌟🚩
No comments:
Post a Comment