🔱🕉️ శ్రీ సిద్ధి 🕉️🔱
🕉️🔱 ఆత్మ అంటే ఏమిటి🔱🕉️
ఆత్మ అంటే ఏమిటి ?
దాని స్వరూపం ఎలా ఉంటుంది ?
అనే విషయం ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు.
కానీ ...
చాలా మందికి ఆత్మ అంటే ఏమిటి
మీకు తెలుసా అంటే తెలుసు అనే చెప్తారు .
కొందరు ఆ .... ఆత్మ ద్వారా మనిషి నడిపింపబడుతున్నాడని,
కొందరు దుష్టశక్తులని ,
ఆత్మ అనేది మనలో ఉన్న దైవ శక్తి అని
ఆత్మ అనేది వ్యతిరేక శక్తి అని ,
ఏవేవో చెప్తూ ఉంటారు .
ఇవన్నీ కూడా అజ్ఞానపు ఆలోచనలే ....
కానీ ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మానవుని నోటి నుంచి వింటాము .
కానీ సద్గురువుల బోధవలన , వేదాలలో , ఉపనిషత్తులలో ఈ ఆత్మ స్వరూపం గురించి తెలుస్తుంది.
ఈ ఆత్మ అనే పదము నిజానికి చాలామందికి తెలియదు .
ఆత్మ ను సాక్షాత్కరించుకున్న వాళ్లకు మాత్రమే ఆ తత్వం గురించి కొంత అవగాహన ఉంటుంది.
సృష్టికి మూల కారణమైన ఈ ఆత్మ గురించి వారికి అవగతమవుతుంది .
అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది కాబట్టి.
ఆత్మ అంటే ప్రతి మనిషిలో నూ ఉండే భగవంతుని అంశ.
ఈ ఆత్మకి ,కుల , మత, వర్గ ,రూప భేదాలు అనేది ఉండదు.
దీనిని అంతరాత్మ అని కూడా అంటారు.
మనిషిని సరియైన దారిలో న్యాయ , అన్యాయాలు, తప్పులు ఒప్పులు నిష్పక్షపాతం గా చూపుతూ మనిషికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది.
మనకి ఒక స్నేహితుడు లాగా .
ధర్మాన్ని చెబుతూ....న్యాయదేవతలాగా .
సాధనాపరంగా..... ఒక గొప్ప యోగి లాగా ,
మంచి చెడులను నిర్ణయించి న్యాయమూర్తి లా.... నడిపిస్తూ ఉంటుంది .
ఈ ఆత్మ మన లోపల అంటే ...... మానవుని లోపల అంతరాత్మ
ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధమైన ఆలోచన ఇస్తూ , ఆలోచన కలిగి ఉంటుంది .
ఈ విషయంలో ఎలాంటి తేడాలు
వుండవు .
ఎందుకంటే ఇది పరమాత్మ యొక్క అంశ కాబట్టి .
పరమాత్ముడు ఒక్కడే కనుక ఆయన నుండి వేరుపడి వివిధ రూపాలు కలిగిన శరీరాలలో
ప్రవేశించి మనుగడ సాగిస్తూ ఉంటుంది.
కనుక ఎంత వీలైతే అంత తొందరగా భగవంతుని లీనం కావాలని తాపత్ర పడుతూ ఉంటుంది .
ఈ ఆత్మకు రూపం అనేది లేదు ,
నాశనము లేనిది , ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చే చంపబడేది కాదు, ఆత్మకు చావు పుట్టుకలో లేవు.
ఇది జన్మ లేనిది.
నిత్యము ,శాశ్వతము పురాతనము,
శరీరము చంపబడినను ఇది చావదు.
ఈ ఆత్మ నాశనరహితము .
నిత్యము అన్ని.
జననం మరణం లేనిదని,
మార్పు లేనిది, శాశ్వతమైనది , సర్వవ్యాప్తి చెందింది, చెలింపనిది , స్థిరమైనది, సనాతనమైనది.
ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరమ్మ కానిది
మనసుకు అన్నది వికారాలు లేనిది .
ఆత్మ ప్రకాశము ఆత్మ జ్యోతి స్వరూపమైన .
అత్మ ప్రకాశవంతం, అణువు కంటే సూక్ష్మము ఐనది అంతటా వ్యాపించినది , అత్యంత సూక్ష్మమైనది, సృష్టికి మూల కారణమైనది, అపరిమితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మ.... ఊహాతీతమైన బ్రహ్మ .
బ్రహ్మం ప్రకాశిస్తుంది .
అది సూక్ష్మాతి సూక్ష్మము.
అది ఈ మానవ శరీరంలోనే ఉంది .
ఇక్కడ సూర్యుడు ప్రకాశించడు , చంద్రుడు తారలు వెలుగునీయవు, మెరుపులు కూడా కాంతినివ్వవు ,
ఈ స్వయంప్రకాశమైనా ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లు తుంది.
ఈ ఆత్మ జ్యోతి దేదీప్యమానమవుతూ ఉంది .
ఈ ఆత్మ స్వయంప్రకాశతం, స్వయం ప్రకాశమైన జ్యోతి స్వరూపమైన ఆత్మను
మాటల చేత వర్ణించలేము
దానిని కళ్ళతో చూడలేము
ఇంద్రియాలతో గ్రహించలేము
కర్మలలో విధులు దానిని ఆవిష్కరించలేవు.
స్వచ్ఛమైన మానవునికి అతని ప్రాణమాన శరీరాల సర్వము విశుద్ధి పొంది అప్పుడు నిబగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.
ఆత్మ అంటే ఒక శక్తి .
మనం అర్థం చేసుకోవడానికి దానిని ఒక జ్యోతిగా తెలిపారు .
అటువంటి శక్తి స్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది .
దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి ,
అది మాత్రమే నువ్వు అని తెలుసుకుని , కాంతివంతముగా, స్వయంప్రకాశమయ్యి, దివ్య జ్యోతిని నీవు నీ శరీరంలో ఎప్పుడు చూసుకుంటావో....
నిన్ను నువ్వుగా తెలుసుకోవడం , అలా తెలుసుకున్న నీవు నీ జన్మను పూర్ణంగా సార్ధకం చేసుకుంటావు.
ఇది ఒక దివ్య శక్తి.
ఆ దివ్య శక్తిని తెలుసుకోవాలని గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధనలల్లో చెప్పేది.
మరి ఇక్కడ చూసినట్లయితే మనిషి తన ఆలోచన విధానములో ఆచరణలో చాలా చాలా తేడాలు ఉంటాయి .
అలాగే మనిషి రూపంలో కానీ , చేష్టల్లో, ఆలోచన విధానములో, ఒకరికి ఒకరికి పోలికలు అనేది ఉండవు .
ఎక్కడో ఒకచోట చిన్న తేడా ఆయన ఉంటుంది.
కానీ విచిత్రంగా ఒక ఆత్మ విషయంలో అందరూ ఒకే లాగా ఒకే పోలికతో ఉంటారు.
వ్యత్యాసం అంతా కూడా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
అక్కడే మనుషులకు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది .
దీనికి కారణం మనస్సు కూడా ....
మనకు ఆత్మ చేసే బోధకు 80 శాతం వరకు ఈ మనసు వ్యతిరేకంగా తన విధులను, తన పనులను చేస్తూ ఉంటుంది .
పరిస్థితులను బట్టి ఇంద్రియాలకు లోబడి ,
పురుషోర్థాలకు, గుణాలకు లోబడి ,
మానవునికి మార్గము చూపుతో ఆ మార్గములో సమయానుసారముగా మారుతూ....
మార్పు చెందిస్తూ ఉంటుంది.
ఈ మార్పు ఎవరెవరు ఎంత శాతం అనుసరిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
కానీ ఆత్మ దేనికి కూడా లోబడదు.
అయ మార్గాన్ని చూపిస్తూ నడిపిస్తుంది కానీ మనుషులలో ఈ తేడాల వల్ల వీరు దేనికి విలువనిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
కొన్ని గ్రంథాలలో ఆత్మ గురించి , పరమాత్మ గురించి ,
మహా వాక్యాలు మన హిందూ ధర్మం లో ఆధ్యాత్మికంగా వ్రాయబడ్డాయి.
ఈ నాలుగు ....
ఒక్కొక్క వేదము.
ఒక్కొక్కసారము గురించి చెప్తుంది.
ప్రజ్ఞానం బ్రహ్మ ....ఋగ్వేదము ,
అహం బ్రహ్మాస్మి....యజుర్వేదము ,
తత్ త్వమసి .....సామవేదము ,
ఆయమాత్మా బ్రహ్మ.... అధర్వణ వేదము,
ఈ మహా వాక్యాలు ఆత్మ తత్వాన్ని సూచిస్తున్నాయి.
ఆయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మయే బ్రహ్మము )
ఆత్మ, బ్రహ్మము అనేవి ఒకటి అని చెప్తున్నారు
దీనికి సముద్రము ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు .
ఎందుకంటే ఒక్కొక్క కెరటం ఒక్కొక్క ప్రత్యేకమైన ఉనికిగా మనకి కనబడుతూ ఉంటుంది.
కానీ ఆ కెరటం ఒడ్డున తాకిన తర్వాత కెరటానికి సముద్రానికి తేడా అనేది ఉండదు.
ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్పిందేమిటంటే ఆత్మ అనేది రెండు విధాలు ....
జీవాత్మ పరమాత్మ గా ఉండే శక్తి పరమాత్మ .
అన్ని జీవుల్లో ఉండే ఆత్మ అంశం జీవాత్మ అని చెప్పారు .
ఈ జీవాత్మ యే ఆత్మ
ఇది నాశనము కానిది .
శస్త్రము ఏది కూడా దీనిని చేదించలేదు .
అగ్ని దహించలేదు .
నీరు తడపలేదు .
వాయువు ఆర్పలేదు.
అని చెప్పారు
అంతేకాక అహం బ్రహ్మాస్మి , అయమాత్మ బ్రహ్మా అనే ఉపనిషత్తు వాక్యాలలో కూడా మీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశా కనక ఆ విషయాలన్నీ తెలుసుకోమని చెబుతున్నాయి.
"శ్రీ" శక్తి అపూర్వం......!!!
"శ్రీ "సిద్ధి అనంతం.........!!!
"శ్రీ "గురుభక్తి అఖండం....!!!
🔱🕉️ శ్రీ సిద్ధి 🕉️🔱
🕉️🔱 శ్రీ సిద్ధి జ్ఞాన యోగ ధ్యాన పీఠము 🔱🕉️
🌹శ్రీ లక్ష్మి అనురాధ చావా 🌹
No comments:
Post a Comment