Monday, November 7, 2022

:::::ఆత్మ విస్తృతి::::

 *::::::ఆత్మ విస్తృతి::::;;*
     వివిధ వస్తువులు, మనుషులు,ప్రాంతాలు, సంఘటనలకు చెందిన జ్ఞానం మనకు వుంటుంది. అనేక అంశాలపై అవగాహన కూడా వుంటుంది. ,ఎవరు ఎంత అధ్యయనం చేస్తే అంత.ఇదంతా మంచికే.
      ఇలా తెలిసిన విషయాల ఆధారంగా అభిప్రాయాలు , నమ్మకాలు, ఇష్టాలు , ఉద్దేశాలు,అంచనాలు, విశ్లేషణలు, ఏర్పరచు కుంటాము.ఇది చెడ్డది.ఎలాగంటే..
     ఇలా ఏర్పరచుకొని .ఇవి నా సొంతం అంటాము.వీటితో తాదాత్మ్యం చెందుతాము.
   అనగా నేనే ,నేను ఏర్పరచు కొన్న అభిప్రాయం. అభిప్రాయమే నేను, నేనే అభిప్రాయం.ఈ రకంగా నేను ఎన్ని అభిప్రాయాలు పెట్టు కుంటానో అంతగా విస్తృతి చెందుతాను.నా వైశాల్యం పెంచుకూంటూ పోతాను
ఉదా.ఎవరన్నా, నా అభిప్రాయం కాదంటే నన్ను కాదన్నట్లు ఫీల్ ఆవుతాను.నేను నమ్మిందే సత్యం అంటాను.నా సిద్ధాంతం గొప్ప అంటాను.ఇదే ఆత్మ విస్తృతి చెందటం.
     చివరికి ఇవన్నీ వాస్తవాలు కావు కనుక ,మారేవి కనుక,, అది తెలిసిన నాడు  నేను కుప్ప కూలి పోతాను.
  షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment