Sunday, November 6, 2022

నా జీవితం, నిర్ణయాలు, పనుల్లో నా ప్రమేయం ఎంత వరకు అనేది అర్ధం చేసుకోవటం ఎలా ?

 💖💖💖
       💖💖 *"374"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"నా జీవితం, నిర్ణయాలు, పనుల్లో నా ప్రమేయం ఎంత వరకు అనేది అర్ధం చేసుకోవటం ఎలా ?"*

*"ప్రమేయం అంటే నేను చేస్తున్నందువల్లనే నా జీవితం సాగుతుందనుకోవటం. అన్నీ మన ప్రమేయంతోనే జరిగే మాటైతే మనమే అనుకొని కోటీశ్వరులం కావచ్చు కదా ! ఈ ప్రమేయమే మన బంధాలన్నింటికి కారణం. మన ప్రమేయంతో పనిలేకుండానే మన ఉనికిగా ఉన్న దైవం తన పని తాను చేసుకుపోతుంది. పనులకు సంబంధించిన ఫలాలు సంతోషంగానో, దుఃఖంగానో ఉన్నాయంటే అర్ధం ఉంది. కానీ వాటి జ్ఞాపకాలతో కూడా ఈ దుఃఖం, సంతోషం ఎందుకు ? మన జీవితంలో మన ప్రమేయమే మన మనసు. దైవం మన ఉనికిగా ఉన్నప్పుడు, ఆ ఉనికికి ఆలోచనలవల్ల ఏ నష్టం లేనప్పుడు జ్ఞాపకాలవల్ల కలుగే బాధ, సంతోషంతో పనేలేదు. అనుభవంలో ఏర్పడే బాధ ఆ క్షణంతోనే పోతుంది. ఇక జ్ఞాపకంతో ఏర్పడిన బాధే దాన్ని పదేపదే గుర్తుకుతెచ్చి అదనపు బాధకు గురిచేస్తుంది. భర్త తిట్టాడన్న జ్ఞాపకంతో వంట చేయకుండా కూర్చుంటే ఆ కారణంగా మళ్ళీ తిట్లు తినటమే కదా జరిగేది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
             

No comments:

Post a Comment