🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"385"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"విరాగిగా సకల విషయాలు వదిలివేస్తే సాధన మరింతగా ముందుకు సాగుతుందా ?"*
*"విరాగే నిజమైన మంచి గృహస్థుడు. ఒక వస్తువు ప్రక్కనే ఉన్నా దాని నుండి ఏర్పడే ఫలంపై దృష్టి లేకపోతే మనం శాంతితో ఉంటాం. వస్తువు దూరంగా ఉన్నప్పుడు దాని ఫలంపై మన ధ్యాస ఉంటే అది కోరిక అవుతుంది. విరాగి అంటే అన్నీ వదిలి వేసిన వాడు కాదు. దీనిపైనా కోరిక లేని వాడే నిజమైన విరాగి. వైరాగ్యం అంటే ప్రతిదీ తిరస్కరించటం కాదు. ఏదీ కావాలని కోరుకోకపోవటం. విరాగి లౌకిక జీవనానికి పనికిరాడని మనం భావిస్తుంటాం. కానీ అలాంటి విరాగి మాత్రమే ధర్మబద్ధమైన సంసారి కాగలడని శ్రీరమణమహర్షి చెప్తున్నారు. ఎందుకంటే విరాగికే భార్య యొక్క నిజమైన విలువ తెలుస్తుంది. మానవ జన్మకు సార్ధకత చేకూర్చు మోక్షముపై దృష్టి ఉండటంచేత వివాహం, వంశాభివృద్ధి కోసం ధర్మాచరణతో మసలుకుంటాడు. కాబట్టి వైరాగ్యం ఉన్నవాడే సద్గృహస్థుడు కాగలడు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment