హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏
మానవుడు తెలియనిదానిని తెలుసుకుంటున్నాడా.. తెలిసినదానిని గుర్తిస్తున్నాడా.
అలభ్య లభ్యం .. తనదగ్గర లేనిది ... తాను పొందదగినది
ఉన్నది .. ఎక్కడ ఉన్నది.. ఎలా ఉన్నది.. ఏమై ఉన్నది ...మరచిపోయాడు..... దాని కొరకు చేసే ప్రయత్నం.
అజ్ఞానం ... అశ్రధ్ధ... సంశయాత్మ ఈ మూడు కారణాల వలన ....నీవు అదే అయి ఉన్నప్పటికీ ... నీ వద్దే ఉన్నప్పటికీ .. ఉన్నదున్నట్లుగా ఉన్నప్పటికీ ... గుర్తించలేకున్నాడు.
బ్రహ్మ స్వరూపుడననే జ్ఞానాన్ని ఎక్కడ వెతకాలి ?
నీ వద్దే ఉన్నది ... లేదనిపిస్తోంది .. కారణం అశ్రధ్ధ.
ఉన్నది ఎప్పుడూ ఉన్నది ... లేనిది ఎప్పుడూ లేదు ... ఉన్నదానికి లేమి లేదు ... లేనిదానికి ఉనికి లేదు.
తాను పరబ్రహ్మ స్వరూపమే అయి ఉండి .. తననాశ్రయించిన వారికి నీవు పరబ్రహ్మవే అని స్ఫురింప చేస్తాడు.
నిరపేక్ష దృష్టి ఉండాలి ... సాపేక్ష దృష్టిలో . అజ్ఞానం... అశ్రధ్ధ.. సంశయం ఉంటుంది.
ఆవరణ దోషాన్ని తొలగించుకుంటే నీ స్వరూపం యధార్ధమై నీ వద్దే
ఉన్నది ... అది అయ్యే ఉన్నది .. ఉన్నదున్నట్లున్నది.
సర్వదా సర్వ కాలమందు స్థితమై.. స్థిరమై.. ధృవమై.. అచలమై ఉన్నది పరమాత్మ .... లేనివాడవు నీవు .
పంచ బ్రహ్మలకు అధిష్టానమై ఉండవలసిన వాడు ... ఇంద్రియాలకు లొంగి పోయాడు.
గంధ గజం అయినవాడు ... గ్రామ సింహ స్థాయికి దిగి వచ్చేశాడు
లేని బంధం ఉందను కుంటున్నాడు .. ఉన్న ముక్తి లేదనుకుంటున్నాడు ..
శ్రీ విద్యా సాగర్ స్వామి వారు
గురుగీత -27
జై గురుదేవ 🙏
No comments:
Post a Comment