*శివయోగం*
🔹🔸🔹🔸🔹
శివ, శంభు, శంకర ఈ మూడు నామాలని వేదం పరమేశ్వరుని తిశ్రూలంలా చూపించింది. పరమేశ్వరుని త్రిశూలం తన భక్తులని ఎలా రక్షిస్తుందో అలా ఈ నామాలని నిరంతరం పఠించేవారి అన్ని విధాల పరమేశ్వరుని రక్షణ లభిస్తుంది. నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ అని రుద్ర నమక మంత్రాల వరుసలో కూడా శంభు, శంకర, శివ ఉన్నాయి. శం అనగా శుభము, సుఖము, శాంతి అని అర్థం. వాటిని కలిగించేవాడు శంకరుడు. ఆయన ఏమిస్తాడో ఆ నామమే చెప్తోంది. నమస్కరించేవారికి శుభాన్ని, సుఖాన్ని, శాంతిని ఇస్తున్నాడు. అవి ఇవ్వగలిగేవాడు ఆయనే. వాటి స్వరూపమూ ఆయనే. పరమేశ్వరుని నామాన్ని పలకాలన్నా వారికి ఎంతో భాగ్యం ఉండాలి. ఆ భాగ్యం లేనివారికి అది సాధ్యంకాదు.ప్రయత్నపూర్వకంగా నైనా భగవన్నామాన్ని జపించగలిగితే పరమేశ్వర అనుగ్రహాన్ని పొందవచ్చు..
శివాయగురవే నమః శ్రీ శంకరాయనమః
-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.
No comments:
Post a Comment