Thursday, March 23, 2023

దేహాత్మభావన అంటే నేను దేహం అనుకోవటమేనా, దాన్ని అధిగమించే తరుణోపాయం ఏమిటి ?

 💖💖💖
      💖💖 *"501"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"దేహాత్మభావన అంటే నేను దేహం అనుకోవటమేనా, దాన్ని అధిగమించే తరుణోపాయం ఏమిటి ?"*

*"దేహాత్మభావన అంటే తాను కేవలం ఒక దేహాన్ని అనుకోవడం కాదు. తనకు తాను ఒక గుర్తింపుతో భావించటం. నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను కార్మికుడిని ఇలా అనుకోవటమే దేహాత్మభావన ! ఇప్పుడు మనకి అలాంటి భావనే ఉంది. అది దాటినవాడు గురువు కనుక ఆయనను మనం ఆశ్రయిస్తున్నాం. ఇద్దరిలోనూ సత్య దృష్టి ఉంటేనే వాళ్ళు గురుశిష్యులు అవుతారు. అద్వైత భావనలో ఉన్నవాడు గురువైతే, ఆ అద్వైత భావనను ఆశ్రయిస్తున్న వాడు శిష్యుడు. అలాంటప్పుడు ఇద్దరిలోనూ గురువు అంటే దేహం అనే భావనకే ఆస్కారంలేదు. అద్వైత భావనలేని అజ్ఞానికి బయటినుండి చూస్తున్నప్పుడు గురుశిష్యులు ఇద్దరూ అజ్ఞానులుగానే కనిపిస్తారు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           

No comments:

Post a Comment