💖💖💖
💖💖 *"499"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"శివైక్యం చెందటం అంటే మరణించి శివుడిలో ఐక్యం అవ్వటమేనా ?"*
*"శివైక్యం చెందటం అంటే మనం మరణించటం కాదు ! మనసు మరణించటం. అంటే బేధాన్ని కలిగించే మన ఆలోచనలు మరణించటం. శివైక్యం అంటే తాను శివుడిలో కలిసి పోవటమో లేక తనలో శివుని కలుపుకోవటమో కాదు. 'తాను ఈ ప్రపంచం - శివుడు' వేరుకాదన్న సత్యం అనుభవంలోకి రావడం. అలా శివైక్యం పొందిన వ్యక్తినే మనం గురువుగా పూజిస్తాం. ప్రతిరోజూ నిద్రలో మనం శివైక్యతను పొందుతూనే ఉన్నాం. కానీ అది మనకి తెలియకుండా జరుగుతోంది. నిద్ర లేవగానే మళ్ళీ జీవభావన తప్పటంలేదు. కానీ గురువు అలా కాదు. నిరంతరం అదే శివైక్యభావనలో ఉంటారు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment