*అరుణాచల శివ*
*రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం! రూపం పొంది ఎన్నో పనులు చేసి ఉండవచ్చు చివరికి ధరించిన రూపాన్ని ఇక్కడే* *వదిలివెళ్ళిపోతాం.ఇక్కడ ఉన్నది నువ్వు కాదు నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే నిజం తెలుసుకుంటే ఎన్నో* *సమస్యలు పరిష్కారమౌతాయి రూపానికి ముందు నువ్వున్నావు..!*
*రూపంలో నువ్వున్నావు..!*
*రూపం వదిలేశాకా నువ్వుంటావు !*
*ఎక్కడో ఓ చోట నువ్వు అనే వాడివి లేకపోతే,అసలు రూపమే* *ఉండదు..!ఈ దేహం, దేవుడిచ్చిన ఓ అద్భుత వరం! ఆయనే,ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు.అయితే ధర్మాధర్మ విచక్షణ చేసుకుంటూ నడవమని* *మేధస్సు నిచ్చిన ఆయనే ప్రతీ నడవడికనూ నిశితంగా పరిశీలిస్తూ తగిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తున్నాడు.ధర్మంగా నడిస్తే ఈ రోజు కాకపోయినా రేపయినా* *విజయగర్వంతో గమ్యస్థానానికి చేరుకుంటాము.అది చక్కని పునాదితో కూడిన శాశ్వత విజయమే. ధర్మాన్ని కాదని అధర్మానికి అలవాటుపడితే తాత్కాలిక సుఖంతో గమ్యస్థానానికి చేరినా అక్కడ శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించ గలగడమనేది కల్ల.*
No comments:
Post a Comment