Friday, April 21, 2023

ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మానవుడు పండితుడు .. విజ్ఞాని.. రాజర్షి అన్న స్థాయికి చేరాలి.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏

ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మానవుడు పండితుడు .. విజ్ఞాని.. రాజర్షి అన్న స్థాయికి చేరాలి. 

పండితా:సమదర్శిన: అన్నది గీత .. సమదర్శనం కలిగినవారే పండితులు. సమదర్శనంతో కూడుకొని ఉంటే ఆత్మ జ్ఞానం. 

లక్షణాలతో తెలుసుకోవటం జ్ఞానం .. బుధ్ధిని సమాధానపరిచే శక్తి జ్ఞానం ... ఇది సుజ్ఞానం కావాలి. 

ఏ జ్ఞానాన్ని పెద్దల దగ్గర తెలుసుకున్నామో అలా జీవించాలి. 

సర్వ కాల సర్వావస్థల యందు మార్పులేక ఉన్నదనే అనుభవ జ్ఞానం విజ్ఞానం. 

మహత్ స్థితి యొక్క జ్ఞానాన్ని పొందినవాడు మహర్షి. 

ఏ మారని నేను.. సత్యం.. నేను.. సాక్షి.. ప్రకాశం ఉన్నదో అదే సత్యం. 
మారని పరమాత్మ సత్యం. 

మనలో ఉన్నా జీవ భావాన్ని బాగా వడకట్టాలి. 

అన్నీ తనయందే పుడుతున్నప్పటికీ .. తనకన్యంగా తలచటం భ్రాంతి. 

చుట్టూ ఉన్న మనుష్యులు... ఆ జీవనం నీకన్న భిన్నం కాదని తెలుసుకుమె భ్రాంతి రహితం. 

సంకల్పాలు తనంతట తనుగా తనలోనే ఉదయంచటం భ్రాంతి 

సకల భ్రాంతులకు పుట్టిల్లు నీవే. 
నీ నుంచే పుట్టి.. నీకే అనుభవాన్నిచ్చి నీలోనే కలిసిపోతున్నాయి. 

ప్రభూ అంటున్నాడంటే నీవు చెప్పినట్లు నేను ఆచరిస్తాను. 

ఉండమన్నట్లుగా ఉండమన్న చోట ఉండాలి. చూడమన్నట్లు చూడమన్న చోట చూడాలి 

జ్ఞానార్జనకు మార్గం ఏది? ముక్తిని సాధించటము ఎలా? వైరాగ్యము ఎలా సముపార్జించాలి? 

ఈశ్వర దర్శనం కావాలంటే ప్రాధమిక అర్హత వైరాగ్యం. 

నిర్ణయం అవ్వాలంటే నిశ్చయ జ్ఞానం ఉండాలి. 

గురుపాదములను ఆశ్రయించగానే .. ఏ తత్ క్షణమే నీవు ముక్తిని పొందాలి .. స్వామి నిర్భయానందులు. 

ప్రతి ఆలోచనను ఒడిసి పట్టగలవాడవై ఉండాలి   

తీవ్ర వైరాగ్యమనే అగ్నిలో వాసనా బీజాలను వేయించాలి. 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 
అష్టావక్రగీత -7

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

No comments:

Post a Comment