💖💖 *"514"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"ఒక సాధకుడికి జ్ఞానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ?"*
*"ఆత్మసిద్ధి కాలేదే అన్న నీ భ్రాంతిని పోగొట్టడానికి " అని ఒక భక్తుడి ఈ ప్రశ్నకు భగవాన్ శ్రీరమణమహర్షి సమాధానమిచ్చారు. సహజంగా చీకటిలో త్రాడు పాముగా కనిపించటం మన భ్రాంతి. ఆ ప్రాంతంలో ఒక పెద్ద విషసర్పం తిరుగుతుందని, దానివల్ల చాలా మంది చనిపోయారని విన్న మాటలవలన మనలో కలిగే భయం విభ్రాంతి. అంటే మనలో సహజంగా కలిగే భ్రాంతి విపరీతమైతే అది విభ్రాంతిగా మారుతుంది. మన భ్రాంతి-విభ్రాంతి వల్ల ఆ త్రాడు పాముగా మారలేదు. ఇవి తొలగిపోయిన మరుక్షణం తిరిగి మనకది త్రాడుగానే కనిపిస్తుంది. జ్ఞానిచేసే పని ఆ విభ్రాంతిని తొలగించటమే. ప్రతి సాధకుడికి తానొక గమ్యం చేరుకోవాలన్న తపన ఉంటుంది. తాను కోరుకున్న స్థితి అప్పటికే తనకి ఉన్నదేనని జ్ఞానివల్ల మనకి తెలుస్తుంది. ఒక జ్ఞాని గురించి సాధకుడికే తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడు కొంత ప్రయాణాన్ని పూర్తిచేయటమో, ఆ ప్రయాణంపై ఇష్టం కలిగి ఉండటమో చేస్తున్నాడు కనుక !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment