Sunday, April 2, 2023

ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రస్తుత క్షణంలో ఆనందంగా ఉండడం ఎలా?

 💝 * ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రస్తుత క్షణంలో ఆనందంగా ఉండడం ఎలా?*🌹
🍁🍁🍁🍁🍁🍁🍁             💖 *ఆనందమే నీ స్వభావం.*
❤️ *మనుషుల మీద, వస్తువుల మీద అనవసరంగా మమకారం పెంచుకోవడం వలన, అవన్నీ పోగొట్టుకుంటామేమో అనే ఆలోచనతో, భయంతో ప్రస్తుత క్షణం అనేది కలుషితమైపోయి మన స్వభావమైన ఆనందం మరుగైపోతోంది.*
💓 *ఎవరితోనూ, దేనితోనూ అటాచ్మెంట్ ఉండొద్దు నీ లోపల. బయట అటాచ్మెంట్ ఉన్నట్టు నటించు. ఆధ్యాత్మికం అంటే ఇదే. ఇంకేమీ కాదు.*
💕 *రంగులరాట్నంలో కూర్చొని నేను నిశ్చలంగా ఉండాలంటే ఎలా? నిశ్చలత కావాలంటే రంగులరాట్నానికి విడిగా ఉండాలి.*
💝 *సంసారంలో కూడా నువ్వు అలా ఉండు విడిగా.* 
💞 *ఇతరులకు మాత్రం నీవు  రంగులరాట్నంలో తిరుగుతున్న వాడిగానే కనపడాలి. ఇదే గీతలో చెప్పిన "కర్మసు కౌశలం" అంటే.*
❤️ *వ్యతిరేక ఆలోచనలను ఆపడం ఎలా? అనుకూల ఆలోచనలను చేయడం ఎలా?*
💝 *ఆలోచన ప్రతిదీ వ్యతిరేకమే. మంచి-చెడు రెండు రకాలైన ఆలోచనలూ వ్యతిరేకమే.*
💖 *ఆలోచనలను మానడమే అనుకూలము. ఆలోచనలు మానడం అంటే…రాయిలా జడమై పోవడం కాదు.*
💓 *ఆలోచించేది నీవు కాదు. ప్రతి ఆలోచన భగవంతునిదే. నేను ఆలోచిస్తున్నా అని భ్రమ పడుతున్నావు.*
💓 *ప్రతి కదలికా భగవంతునిదే. నేను కదులుతున్నానని భ్రమ పడుతున్నావు.*
💓 *శ్వాసించేది భగవంతుడే. నేను శ్వాసిస్తున్నానని భ్రమ పడుతున్నావు.*
💝 *~ఇంతకీ నా పాత్రేమి? అని అడుగుతావేమో…!?!*
💖 *ఊరికే ఉండడమే నీ పని. దేవుని చేతిలో నేనొక సాధనం అని ఉండడమే నీ కర్తవ్యం.*
💕 *~అంటే నేను ‘హ్యూమన్ డూయింగ్ను’ కాదు, ‘హ్యూమన్ బీయింగ్ని’ అని తెలుసుకోవాలి.*
💞 *~అంటే “సచ్చిదానంద స్థితి” అనుభవంలోకి వచ్చేంత వరకు కరిగిపోయి "నేనున్నాను" అనే స్థితిలో  ఉండడమే మన కర్తవ్యం అని తెలుసుకోవడమే.*🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

No comments:

Post a Comment