Friday, April 21, 2023

"ఆరా" అంటె ఏమిటి ...? ?

 🎻🌹🙏 "ఆరా" అంటె ఏమిటి ...? ?

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿భగవంతుని చుట్టూ ఉన్న  కాంతివలయమును "ఆరా" అంటారు, ఆ ఆరా ప్రతీ ప్రాణి చుట్టుతా కంటికి కనపడని 
ఓ విద్యుదయస్కాంతవలయంలా ఉంటుంది.

🌸 జీవరాసుల అన్నింటికీ దేహం చుట్టూ 'ఆరా'గా పిలవబడే కాంతి వలయముంటుంది.

🌿 ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం. ఈ కాంతి ఆత్మసాక్షాత్కారం అయిన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది.

🌸 సామాన్యుల దృష్టికి ఇది కనబడదు
  సాధరణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం ఐదు నుండి పది అడుగుల వరకు ఉంటుంది. 

🌿ఈ వలయంలోనికి ప్రవేశించిన మరోవ్యక్తి "ఆరా" ఆకర్షణలు పడతాయి. 

🌸 ఇలా ఒకరి 'ఆరా' మరొకరి 'ఆరా' దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికీ ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులౌతారు,  సన్నిహితులౌతారు, వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది.  

🌿 అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు. అలానే వేరు వేరు గుణాలుగల 'ఆరా' లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు, వైముఖ్యం తప్పనిసరి.

🌸అలానే యోగులు, మహర్షులు చుట్టూ ఈ 'ఆరా' ఇరవైఐదు నుండి ముప్పది అడుగులమేర విస్తృతంగా, ధృడంగా ఉంటుంది..

 🌿అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతిశక్తి ఎక్కువగా ఉంటుంది.

🌸ఆరా' బలహీనపడితే రోగాలబారినపడి వ్యాధిగ్రస్తులమౌతాం 
ఆరా' పూర్తిగా శిధిలమైనప్పుడు ప్రాణం పోతుంది.

🌿అందుకే మనమూ బాగా ధ్యానం చెేద్దాం. యెాగులమవుదాం. మన  'ఆరా' ను మనమే పెంచు కుందాం....ఆరోగ్యం గా జీవించుదాం...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment