Sunday, April 16, 2023

:::: ధ్యానం ఎక్కడ చేయాలి?::::

 *:::: ధ్యానం ఎక్కడ చేయాలి?:::::*

         మనకు దుఃఖం రాగద్వేషమోహాల వలన కలుగుతుంది. 
  ఈ రాగద్వేషమోహాలు మనం బాహ్యం ప్రపంచంతో ఇంద్రియాల ద్వారా సంబంధంలోకి  వచ్చినప్పుడు కలుగుతాయి.
        ఇవి లేకుండా జీవించడం దుఃఖ రహిత జీవితం .
       
      అలా కలుగు నివ్వనిదే ఉన్నది ఉన్నట్లుగా చూచే దర్శనం. ఈ దర్శనం ఇచ్చేది ధ్యానం.
        ఈ ధ్యానం చెయ్యాలిసింది
ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో సంబంధం లోకి వచ్చినప్పుడు.
      అనగా వ్యవహారాలు చేస్తూ, కార్యక్రమాల్లో పాల్గొంటూ, పనులు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగం చేస్తూ, జరుగుతున్న విషయాల పట్ల, సంఘటనల పట్ల,  రాగం, ద్వేషం కలుగకుండా, ఉద్వేగాలకు గురి కాకుండా, లోపల బయట చూస్తూ, అప్రమత్తతగా, ఎరుకగా సావధానంగా, సున్నితంగా, జాగరూకతతో, వుండుటే ధ్యానం.
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment