Sunday, April 23, 2023

శివుడు స్మశానవాసి

 *🕉️శివుడు స్మశానవాసి*

అనునాషిక "పర్వంలో...


పార్వతి దేవి పతిని ఇలా అడుగుతుంది

స్వామి మీరు ఎప్పుడూ స్మశానంలో ఉంటారు ఎందుకు./ నీకు కైలాసం ఉంది* వెండి కొండ ఉంది*
ఇంత గొప్ప అంతఃపురం ఉంది* కానీ.. 
స్మశానంలో ఎందుకు ఉంటారు..?అనీ..

ఆప్పుడు.. శివుడు....
పార్వతి తో..

చీకటి పడిన తరువాత ఉగ్ర భూతములు
ఇళ్లల్లోకి బయలుదేరుతాయి
వాళ్లని అనుష్టానం చెయనివ్వవు.. 

ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచాలు
ఇళ్లలోకి వస్తాయి..అవి రాకుండా ఉండాలంటే
అందుకు స్మశానంలో నర్తన చేస్తుంటాను_
ఆ నర్తనను చూసి  అవి అక్కడే కూర్చుంటాయి.
ఇది మొదటి కారణం..!

రెండవ కారణం :
బ్రతికున్నవాళ్ళు..
నా వాళ్ళు నీవాళ్లు అని కష్టపడి..
వాళ్ల ఇంటికి వెళ్తాడు_వీళ్ళ ఇంటికి వెళ్తాడు*
ప్రయాణాలు చేస్తాడు_
అక్కడికి వెళ్తాడు_
ఇక్కడికి వెళ్తాడు_
వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు
వీళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు..
ఇలా అన్ని చోట్ల తిరుగుతాడు
స్మశానానికి వెళ్దామా అంటే ఎవరూ రాడు..
దేహము పడిపోయిన తర్వాత_
రుద్రభూమి లోకి వస్తాడు_
పడుకోబెట్టిన దేహాన్ని,
కట్టెలలో కాలిపోతూ ఉంటే_
చూసుకుంటూ ఉంటాడు జీవుడు_//

చీకటి పడుతుంది_
స్మశానం దాటి వెళ్లడానికి లేదు_
అయ్యో వీళ్లందరినీ నమ్ముకున్నాను
అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడు ఉండడు 
అని శివుడు పార్వతితో చెప్తాడు.*!

చచ్చినవాడు వంద సార్లు చచ్చిపోతాను అనే            భయంతో జీవుడు ఉంటాడు_
అప్పుడు శివుడు నీకు నేనున్నా లేరా
బెంగ పెట్టుకోకు.. ఇంకొక శరీరం ఇస్తాను..!
వళ్ళు దగ్గర పెట్టుకునీ జీవించు అని చెప్తాడు..జీవుడితో*
అంతేకానీ నాకు ఇల్లు లేక,
అవాసం లేక, లేని వాడిని కాదు, 
తండ్రిని..అది నా కర్తవ్యం అన్నాడు పార్వతితో..

No comments:

Post a Comment