💖💖💖
💖💖 *"523"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"తర్కించుకోవటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి పొందే అవకాశం ఉంటుందా ?"*
*"ఒక విషయం గురించి ఇరువురు తర్కించుకుంటున్నారంటే అది వారి అనుభవ రాహిత్యాన్ని తెలుపుతుంది. ఎందుకంటే పంచదార తిన్నవాడు అది తియ్యగా ఉన్నదని వాదించడు. పంచదార గురించి తెలుసుకోవాలన్న వారికి దాని తియ్యదనాన్ని, అది పొందే మార్గాన్ని చెప్తాడు. ఎదుటివాడు తిన్నప్పుడు వాడికే తెలుస్తుందనుకుంటాడు. విజయవాడలో ఉండి ముక్త్యాలకు మార్గం ఎటు అని అడిగితే చెప్పటం కష్టం. కొంతదూరం ప్రయాణించి జగ్గయ్యపేట వరకూ వచ్చి అడిగితే ముక్త్యాలకు దారి చెప్పటం సులభం అవుతుంది. ఇంట్లో భర్తగావున్న వ్యక్తి దుకాణంలో యజమనిగా వ్యవహరిస్తాడు. వారు ఇద్దరిగా ఒకరినొకరు చూసుకోవటం సాధ్యంకాదు. మనం అనుకుంటున్న ఆత్మదర్శనం కూడా అలాంటిదే. మన నిజస్థితి మనకి తెలియటమే ఆత్మదర్శనం కానీ క్రొత్తగా కనిపించేదికాదు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment