Saturday, April 1, 2023

జీవితం తర్కాన్ని అనుసరించి నడవదు. నా దృష్టి ఏమిటంటే వ్యక్తి ప్రయత్నం ప్రయత్న రహితంగా వుండాలి. అంతమంగా అస్తిత్వపు దయ వల్ల ఫలితమందు కుంటాడు.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 322 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం తర్కాన్ని అనుసరించి నడవదు. నా దృష్టి ఏమిటంటే వ్యక్తి  ప్రయత్నం ప్రయత్న రహితంగా వుండాలి. అంతమంగా అస్తిత్వపు దయ వల్ల ఫలితమందు కుంటాడు. 🍀*

*మనిషి ఆనందం కోసం ప్రయత్నించాలి. పని చేయాలి. అది అస్తిత్వపు అంతిమ వరం. అది వైరుధ్యంగా అనిపిస్తుంది. అది తర్కం కాదు. తర్కం నువ్వు దాని కోసం పని చేస్తే అప్పుడు నువ్వు అందుకున్న వాడివవుతావు అంటుంది. అది అసిత్త్వమిచ్చిన బహుమతి. అందువల్ల నువ్వు పని చేయాల్సిన పని లేదు. అస్తిత్వం ఎప్పుడనుకుంటే అప్పుడు నీకు ఆ బహుమతి నిస్తుంది.*

*అయితే జీవితం తర్కాన్ని అనుసరించి నడవదు. నా దృష్టి ఏమిటంటే వ్యక్తి వ్యక్తి  ప్రయత్నం ప్రయత్న రహితంగా వుండాలి. అంతమంగా  అస్తిత్వపు దయ వల్ల ఫలితమందుకుంటాడు. సాధారణంగా నువ్వు స్వీకరించడానికే సిద్ధంగా వుండవు. నీ తలుపులు మూసుకుని వుంటావు. హృదయం ముడుచుకుని వుంటావు. అస్తిత్వం అరిచి గీ పెట్టినా వినవు. అస్తిత్వం నీ తలుపుల్ని తడుతుంది. తెరవవు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment