Sunday, April 23, 2023

**** ఒక తెలిసీ తెలియని వాడు రమణ మహర్షి దగ్గరకు వెళ్లి ఒక ప్రశ్న వేశాడు......

 అరుణాచల శివ 🙏

   ఒక తెలిసీ తెలియని వాడు రమణ మహర్షి దగ్గరకు వెళ్లి ఒక ప్రశ్న వేశాడు...... 

' మీకు సర్కోమా పుట్టింది. మీకు బెంగ లేదు. ఎందుకంటే మీరు శరీరం కాదంటారు.
 పుండుకి పుండు పుట్టింది అంటారు. 

చావు వస్తుంది. నాకు చావు లేదు ..  శరీరమునకు వస్తుంది అంటారు. 

మీరు నోరు విప్పి ఏమీ మాట్లాడరు. మీరు ఎవ్వరికీ ఏమీ ఉపదేశం చెయ్యరు. మీరు ఎవ్వరితో పూజలు చేయించరు. 

మీరు ఎల్లప్పుడూ అరుణాచలం కొండెక్కి కూర్చుని మీలో మీరు రమించిపోతు ఉంటారు. ఎప్పుడైనా మీకు మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడతారు. మాట్లాడేటపుడు ఎంతమంది ఉన్నారని చూడరు. మీరు ఎవరిని ఉద్ధరించాలని అనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారు. 

కాబట్టి మీ వలన ప్రపంచమునకు ఏమిటి ప్రయోజనం?' అని అడిగాడు. 

   రమణ మహర్షి ఒక నవ్వు నవ్వి అన్నారు..... ..

 గురువు శరీరంలో ఉండటంవలన శిష్యులకే అనుగ్రహం. గురువు తాను శరీరం కాదని తెలుసుకున్నవాడు. కాబట్టి శరీరం పడిపోతే గురువు శోకించడు. తృణ ప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్టాడు. 

కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వలన శిష్యులు నష్టపోతారు. ఎందుచేత అంటే ఆగురువు శరీరంలో లేదు కాబట్టి ఆ గురువు ఉపదేశం చేయడం కుదరదు.

 లోక ప్రయోజనం శిష్యుల వలనే ప్రసరిస్తుంది. 

సూరినాగమ్మ గారు ఈ ప్రపంచమునకు చేసిన సేవ అద్భుతమైనది. ఆవిడ ఎప్పుడూ మాట్లాడతారో తెలియని రమణమహర్షి వెనకాల తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో , ఏమి మాట్లాడారో గబగబా రాసుకుని, ఉత్తరం రాసి అన్నగారికి పోస్టు చేసేవారు.

 ఆ అన్నగారు ఎంత ప్రాజ్ఞుడో... తన చెల్లెలు తనకంత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరముల న్నీ దాచారు. 

     రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తరువాత సూరి నాగమ్మ గారు వాళ్ళ అన్నయ్యకి తారీకు వేసి రాసిన లేఖలే రమణులు ఏమి మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారములు అయ్యాయి. అవే ' సూరి నాగమ్మ గారి లేఖలు'  అనే రూపంలో మూడు, నాలుగు వాల్యూములుగా ప్రచురింపబడ్డాయి. 

వాటి ద్వారా రమణుల సమస్త బోధనలు మనకి అందే అదృష్టం కలిగింది. 

కాబట్టి గురువు శరీరంలో ఉండడం అనేది శిష్యులకే ప్రయోజనం.

 అంతే. గురువు శరీరం వదిలిపె డితే నష్టపోయేది శిష్యులే.🕉️🚩🕉️. 

No comments:

Post a Comment