దేవునికి రూపం ఉందా ?
పరమాత్మకు ఆకారంలేదు. అందుచేతనే "పరమాత్మకు ఆకారం లేదు, వయస్సులేదు, ఏనాటికి అతడు లేకుండా పోడు, నిత్య సనాతనుడు" అని చెప్తారు. ఇది నిజమే, అయినా పరమాత్మ ఏ ఆకారమైనా ధరించగలడు. పరిశుద్ధమైన నీటికి రుచి ఉండదు. కానీ నీటిలో ఉప్పుకలిపితే అది ఉప్పుగా ఉంటుంది. పంచదార కలుపుతే తియ్యగా ఉంటుంది. పరమాత్మకూడ వేరువేరు గుణాలను గ్రహించగలిగిన పరిశుద్ధ జలం వంటివాడు. పరమాత్మకు వాస్తవంగా ఆకారం అని మనం వర్ణించజాలం. ఉదాహరణకు - ఎంత పంచదార కలిపినా సముద్రం నీరు తియ్యగా మారదు. ఎందువల్లననగా ఉప్పగా ఉండడం దాని సహజ స్వభావం అందుచేత పరమాత్మకి ఏదో ఒక ఆకారం ఉన్నదని అంటే అప్పుడు ఆ పరమాత్మ మరొక ఆకారం ఏదీ ధరించజాలడని చెప్పవలసి వస్తుంది. అలాంటప్పుడు అతడు పరమాత్మయే కాకుండా పోతాడు. అందుచేత పరమాత్మకి ఆకారం లేదని చెప్పబడింది. అప్పుడు పరమాత్మ ఏరూపమైనా ధరించగలడని చెప్పడం కుదురుతుంది.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment