*::::: ఆలోచన కాదు ఎరుక కావాలి ::::::*
మనకు కొన్ని అలవాట్లు వుంటాయి. ఆవేశాలు వుంటాయి. మన ప్రవర్తనలో మనకే నచ్చని విషయాలు వుంటాయి. మారాలి అని ఆలోచన చేస్తాము. మారలేము. ఎందుకు???
మనం అనుకునేది ఆలోచన. లేదా కోరిక. ఇది పై మనస్సు కు చెందినది. లోపలి మనస్సు మన అలవాట్లకి కారణం.
లోపలి మనస్సు ఆధారంగా జరప బడే అలవాట్లు, పై మనస్సు ఆధారంగా చేసే ఆలోచన/ కోరిక ఆపాలి అంటే ఈ రెండు ఒక్కటే అవ్వాలి. అది ఎరుక చేస్తుంది.
మనం చేయకూడదు అనుకునేది , చేయ బోయే ముందు కాదు లేదా చేస్తూ వున్నప్పుడు కాదు. చేస్తూ లేనప్పుడు అనుకుంటాం
చేయడంలో నిమగ్నమైన మనకు చెయ్య కూడదన్న ఆలోచన రాదు , తర్వాత వస్తే లాభం లేదు.
ధ్యానం మనకు, ఎప్పటికప్పుడు,ఏమి చేస్తున్నాము అనే ఎరుకను ఇస్తుంది. ఈ ఎరుక పనిని ఆపుతుంది ఆలోచన అక్కర్లేదు. ఎరుకలో విచక్షణ, హెచ్చరిక వుంటుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment