*::::::: మనస్సు కి జన్మలు ::::::::*
మనస్సు రెండు రకాలు.
1) మెదడు తో అనుసంధానమైన భౌతిక మైన మనస్సు. (దీనితో మనకు ఇబ్బంది లేదు. కనుక ఇప్పుడు చర్చించడం లేదు)
2) వివిధ ఆలోచనలతో, కోరికలతో, అప్పటికప్పుడు ఏర్పడి, రద్దు రద్దు కాబడు తున్న మానసిక మనస్సు
ఆలోచనలు, ఇష్టం అయిష్టం, జ్ఞాపకాలు, భావాలు, వివిధ స్థితులు ఇవేవి లేకుండా మానసిక మనస్సు వుండదు.
భౌతిక మనస్సు లో కోరిక కలిగినప్పుడు కోరిక గల మానసిక మనస్సు పుట్టింది అని అర్థం.
అనేక సార్లు,అనేక రకాలైన కోరికలు పుడతాయి. ఎన్ని కోరికలు పుట్టినాయో అన్ని సార్లు అన్ని విధాలా మానసిక మనస్సు పుడుతుంది.
ఈ రకంగా మనస్సు కి పుట్టుకలు ఎక్కువ. అనగా జన్మలు ఎక్కువ. కోరిక రాకపోతే మనస్సుకు జన్మ లేదు. జన్మ లేకుంటే దుఃఖం లేదు.
కోరిక రాహిత్యమే, జన్మ రాహిత్యం. దుఃఖ రాహిత్యం.ఇదే మోక్షం.
*షణ్ముఖానంద*
No comments:
Post a Comment