*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 326 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ధ్యానమన్నది చేసేది కాదు, అది స్వచ్ఛమైన చైతన్యం, ఐతే జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. పరిశీలిస్తే నీకు తెలిసి వస్తుంది. ఒక నిశ్శబ్దం, ఒక నిర్మలత్వం ఒక సమతూకం ఏర్పడుతుంది. 🍀*
*ధ్యానమన్నది చేసేది కాదు, అది స్వచ్ఛమైన చైతన్యం, ఐతే జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. పరిశీలిస్తే నీకు తెలిసి వస్తుంది. నీ శరీరం దయాన్వితమవుతుంది. విశ్రాంతిని అందుకుంటుంది. నిర్బంధం లేనిదవుతుంది. తేలిక పడుతుంది. నీ శరీరం నించీ పర్వతాల భారం దిగిపోతుంది. నీ మనసు చురుకుదనం తగ్గుతుంది. గాని చర్యల మధ్య చాలా వ్యవధాన ముంటుంది. ఆ వ్యవధానంలో అపూర్వ అనుభవాలు కలుగుతాయి. క్రమక్రమంగా నీ ఉద్వేగాలు శాంతినిస్తాయి.*
*నువ్వు ఎంతో కాలం ఆనందంగానూ వుండవు. బాధగానూ వుండవు. వాటి మధ్య తేడా అంతరిస్తుంది. అవి రెండూ లేవి పరమానంద స్థితి ఏర్పడుతుంది. ఒక నిశ్శబ్దం, ఒక నిర్మలత్వం ఒక సమతూకం ఏర్పడుతుంది. అక్కడ పర్వతాలూ వుండవు. లోయలూ వుండవు. చీకటి వెలుగులుండవు. నువ్వు వాటి మధ్య నుంటావు. ఈ అనుభవాలు గాఢమవుతాయి. అప్పుడు ఒక పెద్ద ముందడుగు వేస్తావు. అప్పుడు నిన్ను నువ్వు చూస్తావు. దాన్ని ఆత్మ అను లేదా స్వీయతత్వమను, దేవుడను. అప్పుడు అంతా కాంతిమయమే. అంతర్నేత్రం తెరుచుకుంటుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment