*🔊పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్ ముప్ప*
*🔶50-60% మందిలో గుర్తింపు*
*🔷అయిదు పాఠశాలల్లో ఏఐజీ అధ్యయనం*
*🍥ఈనాడు, హైదరాబాద్: పిల్లలు అడిగిందే తడవుగా బిస్కెట్లు, చాక్లెట్లు, మిఠాయిలు, నూడుల్స్, కూల్‌డ్రింకులు, సమోసాలు వంటి తినుబండారాలు కొనిపెడుతున్నారా..?! అయితే తస్మాత్ జాగ్రత్త.. ఇవన్నీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)కు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అయిదు కార్పొరేట్ పాఠశాలల్లోని 1,100 మంది చిన్నారులపై చేసిన అధ్యయనంలో ఈ సమస్య గుర్తించారు. 10-14 ఏళ్లలోపు చిన్నారుల్లో 50-60% మంది ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ ఉన్నట్లు తేలింది. ఇందులో 20% మందికి కాలేయం గట్టిపడి సిర్రోసిస్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. తర్వాత కాలేయ మార్పిడి ఒక్కటే శరణ్యమని వైద్యులు స్పష్టీకరించారు. ఆరు నెలలపాటు సాగిన ఈ అధ్యయనంలో అల్ట్రాసౌండ్, కాలేయ పరీక్షల ద్వారా ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీని గుర్తించారు.*
*💥ఏంటీ ఫ్యాటీ లివర్..?*
*🌀సాధారణంగా తాగుడు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మద్యం అలవాటు లేకపోయినా ఆహార ప్రభావంతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ పెరుగుతుంది. అతిగా తిన్నప్పుడు కొవ్వు రూపంలోకి మారి కాలేయంలో నిల్వ చేరుతుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు కాలేయం దీనిని వినియోగిస్తుంది. శారీరక శ్రమ లేకపోతే కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ప్యాకెట్లలో దొరికే జంక్‌ఫుడ్‌కు పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. వారి లంచ్ బాక్సుల్లోనూ బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్‌లు వంటివి పెడుతున్నారు. అంతేకాక చిన్నారుల్లో శారీరక శ్రమ లోపిస్తోంది. చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు అసలు ఆటస్థలాలే లేవు. ఇళ్లలో టీవీలు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఫలితంగా బరువు పెరిగి ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ బారినపడుతున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.*
*💥నాలుగు దశలు*
*💠నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌లో నాలుగు దశలు ఉంటాయి. సింపుల్ స్టియటోసిస్, స్టియటో హెపటైటిస్, ఫైబ్రోసిస్, నాలుగోది తీవ్రమైన సిర్రోసిస్. తుది దశ వరకు గుర్తించకపోతే కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదని వైద్యనిపుణులు అంటున్నారు.*
*💥లక్షణాలు లేకుండానే దాడి*
*✳️ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ సమస్య ఉన్నా ఎలాంటి లక్షణాలు బయటపడవని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో మాత్రం పొట్ట పెరిగి ముందుకు రావడం, కుడివైపు పొట్ట పైభాగంలో గుచ్చినట్లు నొప్పి ఉండటం కనిపిస్తాయి. ఇవి సాధారణమేనని నిర్లక్ష్యం చేస్తున్నారు. అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేసినప్పుడు అసలు సమస్య బయట పడుతోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే తరం తీవ్రమైన కాలేయ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే జనాభాలో 30% మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.*
*💥ఆరోగ్యకర అలవాట్లే రక్ష*
*◼️మార్పు తల్లిదండ్రుల నుంచే రావాలి. జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉంటూ పిల్లలూ అనుసరించేలా చేయాలి. ఇంట్లో వండిన తాజా ఆహారమే లంచ్ బాక్సుల్లో అందించాలి. అధిక బరువు ఉంటే ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించాలి.*
*◼️రిఫైన్డ్ షుగర్స్, మైదాతో చేసిన పదార్థాలు, మిఠాయిలు తగ్గించాలి. తృణధాన్యాలతో చిరుతిళ్లు(స్నాక్స్) చేసి పెట్టాలి.*
*◼️విద్యార్థులు తరచూ ఆటలాడేలా ప్రోత్సహించాలి. పాఠశాలల్లో రోజూ కనీసం 45 నిమిషాలు క్రీడలకు కేటాయించాలి. ఇంట్లోనూ తల్లిదండ్రులు వారితో కలిసి ఆడుకోవాలి.*
*💥సమస్య తీవ్రం కాకముందే మేలుకోవాలి*
*🔆పిల్లల పరిస్థితి చేయి దాటక ముందే తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తం కావాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యమివ్వాలి. ప్యాకెట్ ఫుడ్‌లో వాడే ప్రిజర్వేటర్లు ఇతర పదార్థాలు జీర్ణకోశంలోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. చాలామంది పిల్లలు దంతాలు తోమి టూత్‌పేస్ట్ నురగ మింగేస్తుంటారు. ఇందులో ఉండే టైటానియంతోనూ మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్నప్పటి నుంచే మంచి ఆహార అలవాట్లపై అవగాహన కల్పించాలి. ప్రతిఒక్కరు ఏడాదికోసారి కాలేయ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు.*
*🎙️డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్, ఏఐజీ*
No comments:
Post a Comment