*🍁ఎలా జీవించాలి?*🍁
✍️ మురళీ మోహన్
'👉ఎలా జీవించాలి?' భగవంతుడిని అడిగాను
'నీగదిని ఓసారి పరికించు' అన్నాడు దేవుడు
నా గది ఇలా జవాబిచ్చింది...
*'ఉన్నతమైన ఆశయాలెంచుకో' అన్నది పైకప్పు*
*'చల్లగా ఉండు' అన్నది ఫ్యాను*
*'సమయానికి విలువ నివ్వు' అన్నది గడియారం*
*'ఈరోజువరకు జరిగినవన్నీ తెలుసుకో' అన్నది క్యాలెండర్*
*'భవిష్యత్తుకై దాచుకో నిధి' అన్నది సొరుగు*
*'నిన్ను నువ్వు చూసుకో' అన్నది అద్దం*
*'ఇతరుల జీవితాలలో వెలుగును నింపు' అన్నది దీపం*
*'ఇతరుల భారాన్ని పంచుకో' అన్నది గోడ*
*'నీదృక్పథాన్ని విశాలంచేసుకో' అన్నది కిటికీ*
*'నన్నువిడిచి సాము చేయకు' అన్నది నేల*
*'నీవు వేసే ప్రతిఅడుగును గమనించుకో' అన్నవి మెట్లు*
_*భగవంతునికి కోటికోటి ప్రణామములు🙏*_
No comments:
Post a Comment